close

తాజా వార్తలు

Published : 29/10/2020 14:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వ్యాక్సిన్‌ ప్రయోగాలు..బీఐఆర్‌ఏసీతో డాక్డర్‌ రెడ్డీస్‌!

ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడి!

దిల్లీ: రష్యా తయారు చేసిన‌ స్పుత్నిక్‌-V వ్యాక్సిన్ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రక్రియను వేగవంతం చేసేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ సమాయత్తమవుతోంది. ఇందుకోసం తాజాగా బయో టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన బీఐఆర్‌ఏసీ (బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్‌ అసిస్టెన్స్‌ కౌన్సిల్‌) విభాగంతో భాగస్వామ్యమైనట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా వ్యాక్సిన్‌ ప్రయోగాలపై బీఐఆర్‌ఏసీ పలు సూచనలు ఇవ్వడంతో పాటు వ్యాక్సిన్‌ ప్రయోగ కేంద్రాలను కూడా డాక్టర్‌ రెడ్డీస్‌ వినియోగించుకునే వీలుంటుంది.

‘స్పుత్నిక్‌-V వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా సలహాదారుగా కేంద్ర ప్రభుత్వం విభాగం బీఐఆర్‌ఏసీతో ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉంది. భారత్‌కు వ్యాక్సిన్‌ను తీసుకొచ్చే ప్రయత్నాలను వేగవంతం చేయడంలో వారితో కలిసి పనిచేయడం కోసం ఎదురుచూస్తున్నాం’ అని డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ ఛైర్మన్‌ సతీష్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక, కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిని వేగవంతం చేయడం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని బయోటెక్నాలజీ మంత్రిత్వశాఖ కార్యదర్శి డాక్టర్‌ రేణు స్వరూప్‌ వెల్లడించారు. ఇందులోభాగంగా సరైన వ్యాక్సిన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు కావాల్సిన అన్ని సౌకర్యాలను వ్యాక్సిన్‌ సంస్థలకు అందిస్తున్నామని రేణు స్వరూప్‌ అన్నారు.

ఇదిలాఉంటే, రష్యాకు చెందిన గమలేయా ఇనిస్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-v వ్యాక్సిన్‌ను భారత్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌, పంపిణీ చేసేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌తో ఆర్‌డీఐఎఫ్‌‌ ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగా రెండు, మూడో దశ ప్రయోగాల కోసం ఈ మధ్యే భారత నియంత్రణ సంస్థల నుంచి డాక్టర్‌ రెడ్డీస్‌ అనుమతి పొందింది. దీంతో వ్యాక్సిన్‌ ప్రయోగాలను మరింత వేగవంతం చేసే దిశగా డాక్టర్‌ రెడ్డీస్‌ అడుగులు వేస్తోంది.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని