close

తాజా వార్తలు

Updated : 04/08/2020 18:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ విధ్వంసకర వీరుడిని ద్రవిడ్‌ గుర్తించాడిలా..!

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: యువ ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకురావడం, వారిని సానబెట్టడంలో రాహుల్‌ ద్రవిడ్‌ది అందెవేసిన చేయి. భారత్‌-ఏ, అండర్‌-19 కోచ్‌గా అద్భుతమైన క్రికెటర్లను అందించారు. హార్దిక్‌ పాండ్య, మనీశ్‌ పాండే, రిషభ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, విజయ్‌ శంకర్‌, శుభ్‌మన్‌ గిల్‌, పృథ్వీ షా, హనుమ విహారి, మయాంక్‌ అగర్వాల్‌ వంటి ఆటగాళ్లను తీర్చిదిద్దారు. మానసికంగా బలవంతులుగా మార్చారు.

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ శిబిరంలో ఉన్నప్పుడు భారత్‌లో విఫలమవుతున్న బ్రాడ్‌హడ్జ్‌లోని విధ్వంసకర హిట్టర్‌ను ఎలా బయటకు తెచ్చారో తాజాగా ద్రవిడ్‌ వివరించారు. ‘ఆర్‌సీబీ తర్వాత రాజస్థాన్‌ రాయల్స్‌కు కెప్టెన్‌, మెంటార్‌గా పనిచేశా. బడ్జెట్‌లో 40-60 శాతంతోనే పెద్ద జట్లతో పోటీపడాలి. అందరి దగ్గర విస్తృతంగా సమాచారం, విజ్ఞానం ఉన్నప్పుడు అదెంతో కష్టం. అప్పుడే మేం బ్రాడ్‌హడ్జ్‌ను పరిశీలించాం. ఆస్ట్రేలియా తరఫున టీ20ల్లో అతడికి మంచి రికార్డు ఉంది. అయితే భారత గడ్డపై ఐపీఎల్‌లో మాత్రం అంత బాగాలేదు. అతడి డేటాను పరిశీలించి పేస్‌ బౌలింగ్‌లో మాత్రమే రెచ్చిపోతున్నాడని గమనించాం’ అని ద్రవిడ్‌ అన్నారు.

‘మేం బాగా ఆలోచించి అతడిని చివరి నాలుగు, ఐదు ఓవర్లలో దించాలనుకున్నాం. ఎందుకంటే అప్పుడు పేసర్లు మాత్రమే బంతులు వేస్తారు. దాంతో అతడిని వేలంలో కొనుగోలు చేశాం. సాధారణంగా బ్రాడ్‌ హడ్జ్‌ ఆసీస్‌ తరఫున టాప్-3లో ఆడతాడు. మేం చివరి ఓవర్లలో ఆడాలని చెప్పినప్పుడు మొదట తిరస్కరించాడు. ఫాస్ట్‌ బౌలింగ్‌లో విజయవంతమైన రికార్డు, మిగతా డేటాను మేం అతడికి చూపించాం. అతడి వీరబాదుడు మాకెంత అవసరమో వివరించాం. సీఎస్కేలో ధోనీ, ముంబయిలో పొలార్డ్‌, ఆర్‌సీబీలో ఏబీ తరహాలో మాకెవరూ హిట్టర్లు లేరని ఒప్పించాం. ఆ తర్వాత అతడు చెలరేగి ఆడాడు’ అని వాల్‌ గుర్తుచేసుకున్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.