
తాజా వార్తలు
వీవీఎస్ క్యాచ్ చేజారి.. వీడ్కోలుకు దారి తీసి
ఆసీస్‌ను ఇబ్బంది పెట్టడంలో లక్ష్మణ్, భజ్జీ ముందుంటారు: గిల్లీ
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికేందుకు వీవీఎస్ లక్ష్మణ్ క్యాచ్ వదిలేయడం ఓ మంచి కారణంగా నిలిచిందని ఆసీస్ మాజీ వికెట్‌కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ అన్నారు. అతడి క్యాచ్‌లు వదిలేయడం మంచిది కాదని గుర్తు చేసుకున్నారు. లక్ష్మణ్, హర్భజన్‌సింగ్ నిరంతరం ఆస్ట్రేలియాను ఇబ్బంది పెట్టారని పేర్కొన్నారు. ‘లైవ్ కనెక్టెడ్’ టీవీ షోలో ఆయన మాట్లాడారు.
‘ఆ క్యాచ్ నేలపాలు చేయడం నా వీడ్కోలుకు ఓ మంచి కారణం. టెస్టు మ్యాచ్‌లో వీవీఎస్ లక్ష్మణ్ క్యాచ్ విడిచేయడం సరికాదు. అతడికి అన్ని అవకాశాలు ఇవ్వకూడదు’ అని గిల్లీ అన్నారు. 2008లో టీమ్ఇండియా ఆస్ట్రేలియాలో పర్యటించింది. అడిలైడ్‌లో జరిగిన నాలుగో మ్యాచులో ఈ ఘటన చోటు చేసుకుంది. వాస్తవంగా సిరీస్‌కు ముందు గిల్లీ వీడ్కోలుపై వదంతులు వచ్చాయి. వాటిని కొట్టిపారేసి ఆటకు ఇప్పట్లో గుడ్‌బై చెప్పనని ఆయన స్పష్టం చేశారు. కానీ ఆశ్చర్యకరంగా మధ్యలోనే వీడ్కోలు ప్రకటించడం గమనార్హం.
భారత్-ఆస్ట్రేలియా పోటీలో వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్‌సింగ్ తమను బాగా ఇబ్బంది పెట్టేవారని గిల్‌క్రిస్ట్ అన్నారు. ‘టీమ్ఇండియా బ్యాటింగ్ లైనప్‌లోని చాలా మందితో కలిసి లక్ష్మణ్ మా బౌలింగ్ బాదేసేవారు. బౌలింగ్‌లో హర్భజన్ విజృంభించేవాడు’ అని పేర్కొన్నారు. కాగా సరైన సమయంలోనే వీడ్కోలు గురించి గిల్లీ ఇలా అన్నారు. ‘నేను ఆటకు ముగింపు పలికితే నువ్వింకా ఆడగలవని ప్రజలు అంటారు. అదే ఆడుతుంటూ ఇంకా ఎందుకు కొనసాగుతున్నావని అంటారు. వీడ్కోలుపై నేనిలాగే ఆలోచించేవాడిని. తల్లిదండ్రులు, పెరిగిన విధానం, చుట్టు పక్కలుండే ప్రజలు, వాతావరణాన్ని బట్టి ఒకరి ఆటతీరు ఉంటుంది. మనవంతు ప్రయత్నిస్తూ నిజాయతీగా ఉండాలి’ అని ఆయన పేర్కొన్నారు.