close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 02/05/2020 00:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉద్ధవ్‌ పదవి పదిలం!

మే 21న ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ

ముంబయి: మహారాష్ట్రలో వీలైనంత త్వరగా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించాలన్న గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ సూచనపై ఎన్నికల సంఘం(ఈసీ) సానుకూలంగా స్పందించింది. మే 21న ఖాళీగా ఉన్న తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈరోజు జరిగిన ఈసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రలో ఏప్రిల్‌ 24వ తేదీ నుంచీ ఈ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం కొద్దిగా సడలించిన నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్ల మధ్య ఎన్నికలు నిర్వహించవచ్చని కోశ్యారీ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. 

మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే అటు శాసనసభలో గానీ, ఇటు మండలిలో గానీ సభ్యుడు కాని సంగతి తెలిసిందే. దీంతో పదవి చేపట్టిన ఆరు నెలల్లోగా ఆయన ఉభయ సభల్లో ఏదో ఒకదానిలో సభ్యత్వం పొందాల్సి ఉంటుంది. ఆ గడువు మే 28తో ముగియనుంది. తాజా సమాచారం ప్రకారం.. మే 21న ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించిన నేపథ్యంలో ఉద్ధవ్‌ సీఎం పదవికి ఇక ఎలాంటి ఢోకా లేనట్లే. మరోవైపు ఈరోజు ఉదయం సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే.. గవర్నర్‌ కోశ్యారీతో సమావేశమయ్యారు. 20 నిమిషాల పాటు వీరి భేటీ కొనసాగింది. నేడు మహారాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికే గవర్నర్‌ను సీఎం కలిశారని అధికారికంగా చెప్పినప్పటికీ.. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. 

ప్రస్తుతం దేశంలో అత్యధిక కొవిడ్-19 కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో రాజకీయ అస్థిరత ఏర్పడకుండా ఉద్ధవ్‌ను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని కోరుతూ మంత్రి మండలి తీర్మానం చేసి ఇటీవల గవర్నర్‌కు పంపింది. ఆ అంశం పెండింగ్‌లో ఉండడంతో ఉద్ధవ్‌ నేరుగా ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని వివరించినట్లు సమాచారం. ఈ పరిణామాల తర్వాతే గవర్నర్‌ ఈసీకి లేఖ రాసినట్లు తెలుస్తోంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.