close

తాజా వార్తలు

Published : 28/07/2020 01:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఐపీఎల్‌కు అంతా సిద్ధం.. అదొక్కటి తప్ప

బీసీసీఐ లేఖ అందిందన్న ఈసీబీ

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా వైరస్‌ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌ ఆలస్యమైంది. టోర్నీ నిర్వహణకు భారత్‌లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఇప్పుడు దాన్ని యూఏఈకు తరలించారు. అందుకు సంబంధించిన అన్ని పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ను గతవారం ఐసీసీ వాయిదా వేయడంతో మెగా ఈవెంట్‌ నిర్వహణకు తొలి అడ్డంకి తొలగిపోయింది. అంతకుముందే ఈసారి ఐపీఎల్‌ను తాము నిర్వహిస్తామని ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) ముందుకు రావడంతో బీసీసీఐ ఆమోదం తెలిపింది. ఆ అంగీకార పత్రం తమకు అందిందని, ఇక మిగిలింది భారత ప్రభుత్వ ఆమోదమేనని ఈసీబీ జనరల్‌ సెక్రటరీ ముబాషిర్‌ ఉస్మాని సోమవారం మీడియాకు వెల్లడించారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో మెగా టోర్నీ నిర్వహణ పెద్ద సాధన సంపత్తితో కూడుకున్నదని, అందుకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించడానికి నిపుణులతో సంప్రదించాల్సి ఉందని ఆయన అన్నారు. అలాగే షార్జా, అబుదాబి, దుబాయ్‌లో పోలీసు బలగాలతో పాటు స్థానిక యంత్రాంగాన్ని సమకూర్చుకోవాలని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖతో కలిసి పనిచేస్తామన్నారు. అన్నింటినీ సమన్వయం చేసుకొని ఎలాంటి అవాంతరాలు లేకుండా దిగ్విజయంగా ఐపీఎల్‌ను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఈ ఏడాది ఐపీఎల్‌ తొలుత మార్చి 29నే ప్రారంభమవ్వాల్సి ఉంది. భారత్‌లో అప్పుడప్పుడే కరోనా కేసులు నమోదవ్వడంతో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించింది. దీంతో వేసవిలో టోర్నీని నిర్వహించడం కుదరలేదు. ఇప్పుడు లాక్‌డౌన్‌లో సడలింపులివ్వడంతో కేసుల తీవ్రత పెరిగింది. ఈ నేపథ్యంలోనే మెగా ఈవెంట్‌ను యూఏఈకి తరలించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని