close

తాజా వార్తలు

Published : 28/07/2020 20:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జీవీకే ఆఫీస్‌ల్లో తనిఖీలు

హైదరాబాద్‌: జీవీకే గ్రూప్‌ అధినేత జీవీకే రెడ్డి, ఆయన కుమారుడు జీవీ సంజయ్‌రెడ్డికి చెందిన కార్యాలయాలు, ఇళ్లలో నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తనిఖీలు నిర్వహించింది. ముంబయి ఎయిర్‌పోర్టు స్కాంకు సంబంధించి హైదరాబాద్‌, ముంబయిల్లో ఈ తనిఖీలు నిర్వహించింది. ఇప్పటికే జీవీకే గ్రూప్‌ ప్రమోటర్లపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఈ విషయాన్ని ఈడీ అధికారులు వెల్లడించారు. 

ప్రివెంటీవ్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ (పీఎంఎల్‌ఏ)లోని సెక్షన్‌ 3 కింద ఈ తనిఖీలు చేపట్టారు. జూన్‌ 27న సీబీఐ కేసు నమోదు చేసిన తర్వాత ఈడీ దృష్టిపెట్టింది. దీనిలో ఎయిర్‌పోర్టు అథారిటీకి చెందిన కొందరు అధికారుల పేర్లు కూడా ఉన్నాయి. ముంబయి విమానాశ్రయ అభివృద్ధిలో రూ.705 కోట్ల మేరకు అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.