మారటోరియం పేరుతో మోసాలు.. జాగ్రత్త!
close

తాజా వార్తలు

Published : 09/04/2020 18:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మారటోరియం పేరుతో మోసాలు.. జాగ్రత్త!

దిల్లీ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో రుణగ్రహీతలకు ఊరట కల్పించేందుకు గానూ టర్మ్‌ రుణాలపై మారటోరియం ఇవ్వాలని ఆర్‌బీఐ బ్యాంకులకు సూచించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయా బ్యాంకులు తమ ఖాతాదారులకు ఆ సౌకర్యం కల్పించాయి. ఈ నేపథ్యంలో సైబర్‌నేరగాళ్లు కొత్త పంథాకు తెరలేపారు. మారటోరియం పేరుతో వ్యక్తిగత వివరాలు తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో ఆయా బ్యాంకులు తమ ఖాతాదారులకు సందేశాలు పంపించి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి. ఓటీపీ, పిన్‌ వంటివి ఎవరితోనూ పంచుకోవద్దని సూచిస్తున్నాయి.

ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ గత కొన్ని రోజులుగా ఖాతాదారులకు ఎస్సెమ్మెస్‌లు, ఈమెయిల్స్‌ ద్వారా సందేశాలు పంపించి అవగాహన కల్పిస్తున్నాయి. సైబర్‌ నేరగాళ్లు డబ్బు దోచుకునేందుకు కొత్త విధానాలను అవలంబిస్తున్నారని, కాబట్టి ఖాతాదారులు జాగ్రత్తగా ఉండాలని యాక్సిస్‌ బ్యాంక్‌ తమ ఖాతాదారులకు పంపిస్తున్న ఈ-మెయిల్‌లో పేర్కొంది. ఈఎంఐ మారటోరియం పేరిట మీ ఖాతాకు సంబంధించిన ఓటీపీ, సీవీవీ, పాస్‌వర్డ్‌ లేదా పిన్‌ అడుగుతున్నారని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఎస్‌బీఐ సైతం సైబర్‌ నేరగాళ్లు ఫోన్లు చేసి ఓటీపీలు అడుగుతున్నారని, ఎవరూ ఎలాంటి వివరాలూ ఇవ్వొద్దని ఖాతాదారులకు సూచించింది. కొవిడ్‌-19పై పోరుకు ఏర్పాటైన పీఎం-కేర్స్‌కు సంబంధించిన ఫేక్‌ యూపీఐ ఐడీలను సృష్టించి మోసాలు చేస్తున్నట్లు గుర్తించిన ఎస్‌బీఐ.. విరాళాలు ఇవ్వదలచుకున్నవారు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని