35 ఏళ్లు.. కుల ధ్రువీకరణ నకిలీపత్రంతో ఉద్యోగం 
close

తాజా వార్తలు

Published : 02/11/2020 22:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

35 ఏళ్లు.. కుల ధ్రువీకరణ నకిలీపత్రంతో ఉద్యోగం 

సీబీఐకి చిక్కిన ఈపీఎఫ్‌ఓ ఉద్యోగి

లఖ్‌నవూ : కుల ధ్రువీకరణ నకిలీ పత్రంతో 35 ఏళ్ల కిందట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఓ వ్యక్తి ఇటీవల సీబీఐ అధికారులకు చిక్కాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఈపీఎఫ్‌వో కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారిగా విధులు నిర్వర్తించే రమేష్‌ చంద్‌ మీనా రాజస్థాన్‌లోని సవాయ్‌ మథోపూర్‌ సబ్‌డివిజన్‌ మేజిస్ర్టేట్‌ 1983లో జారీ చేసిన ఎస్టీ కుల ధ్రువీకరణపత్రంతో ఉద్యోగం సంపాదించాడని తమ ప్రాథమిక విచారణలో తేలిందని సీబీఐ అధికారి వివరించారు. ఇటీవల సదరు ఈపీఎఫ్‌ఓ అధికారి తన పర్మినెంట్‌ అడ్రసు మార్పు చేయాలని అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. అందులో తను రాజస్థాన్‌లోని సవాయ్‌ మథోపూర్‌కు చెందిన వాడిని కాదని స్వస్థలం మథుర అని వివరించాడు. దీంతో దర్యాప్తు చేయగా నకిలీ కుల ధ్రువీకరణ పత్రం గురించి బయటపడింది. మోసం చేసి ఈపీఎఫ్‌ కార్యాలయంలో క్లర్కుగా చేరిన రమేష్‌పై లఖ్‌నవూలోని సీబీఐ కార్యాలయంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయినట్లు సీబీఐ అధికారి తెలిపారు.

నిందితుడి కొడుకుకి చెందిన ధ్రువపత్రాల్లో తమ కుటుంబం రాజస్థాన్‌లోని అల్వార్‌ ప్రాంతం నుంచి యూపీకి వలస వచ్చినట్లు ఉందని సీబీఐ అధికారి వివరించారు. అతని కుమారుడి ధ్రువపత్రాల్లో ఉన్న చిరునామాకు సదరు ఉద్యోగి ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రంలో ఉన్న అడ్రసుకు మధ్య తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 1985 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో అక్రమంగా కొనసాగడమే కాకుండా ఎస్టీ కులానికి సంబంధించి అందే అన్ని హక్కులను పొందాడని అధికారులు తేల్చారు. కేసుకు సంబంధించి సీబీఐ ముమ్మర దర్యాప్తు చేస్తోంది. నిజంగానే ఈ వ్యక్తి నకిలీ ధ్రువపత్రంతో ఉద్యోగం సంపాదించినట్లు తేలితే ఇన్నాళ్లు జీతంగా తీసుకున్న డబ్బు వసూలు చేయడంతో పాటు అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీబీఐ అధికారి వివరించారు. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని