close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120023934 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => Mjsjawx1Mfk [video_short_link] => Mjsjawx1Mfk [created_by] => [created_date] => [modified_by] => 8917202 [modified_date] => 2020-02-19 17:13:12.395551 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

విలువలు, విశ్వసనీయతే మా బలం: బృహతి

‘వాన్‌-ఇఫ్రా’ సదస్సులో మాట్లాడిన ఈటీవీ భారత్‌ డైరెక్టర్‌

దిల్లీ: మీడియా రంగంలో ‘ఈటీవీ భారత్‌’ ఉన్నత విలువలు పాటిస్తోందని ఆ సంస్థ డైరెక్టర్‌ బృహతి అన్నారు. కచ్చితత్వం, విలువలు, విశ్వసనీయతే తమ బలమని చెప్పారు. దిల్లీలో జరుగుతున్న వరల్డ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ న్యూస్‌ పేపర్స్‌ అండ్‌ న్యూస్‌ పబ్లిషర్స్‌ సంస్థ ‘వాన్‌-ఇఫ్రా’ డిజిటల్‌ మీడియా-2020 సదస్సు రెండో రోజులో భాగంగా నిర్వహించిన ‘హౌ టు కల్టివేట్‌ ఎ కల్చర్ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ ఇన్‌ న్యూస్‌రూం’ అంశంపై ఆమె మాట్లాడుతూ ఏడాది కాలంలో ఈటీవీ భారత్ పయనాన్ని వివరించారు. దేశవ్యాప్తంగా 13 భాషల్లో కచ్చితమైన వార్తలు అందించే డిజిటల్ వార్తా వేదికగా ఈటీవీ భారత్ నిలిచిందని చెప్పారు. దేశ వ్యాప్తంగా విస్తరించిన నెట్​వర్క్ సాయంతో మారుమూల ప్రాంతాల్లో వార్తలను వెలుగులోకి తీసుకొస్తున్నామన్నారు. కష్టమైన రంగాలు ఎంచుకుని మరీ భారత మహిళలు తమ కలలు సాకారం చేసుకుంటున్నారని కొనియాడారు. వారి గాధలను ఈటీవీ భారత్ ద్వారా ప్రజలకు ఏ విధంగా చేరువ చేసిందీ ఆమె వివరించారు.

గాంధీజీ 150వ జయంతి సందర్భంగా దేశంలోని ప్రముఖ గాయకులతో ‘వైష్ణవ జనతో’ గీతం ఆవిష్కరించామన్నారు. ప్లాస్టిక్ నిర్మూలన ఆవశ్యకతపై దేశవ్యాప్త ప్రచారం కల్పిస్తున్నామని చెప్పారు. ‘ఈటీవీ భారత్’ దేశంలోనే అత్యధిక విస్తృతి ఉన్న డిజిటల్ వార్తా వేదిక అని బృహతి తెలిపారు. ఐదు దశాబ్దాల అనుభవం ఉన్న రామోజీ గ్రూపు.. 45ఏళ్లుగా ‘ఈనాడు’ పత్రిక నిర్వహిస్తోందని.. జిల్లా పత్రికల ద్వారా స్థానిక వార్తలకు ప్రాముఖ్యం కల్పించిందన్నారు. అదే బాటలో ఈటీవీ భారత్ దేశవ్యాప్తంగా స్థానిక వార్తలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని బృహతి చెప్పారు.

మీడియా రంగంలో దూసుకెళుతున్న ‘ఈటీవీ భారత్‌’.. దక్షిణాసియా బెస్ట్‌ డిజిటల్‌ న్యూస్‌ స్టార్టప్‌ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. డిజిటల్‌ మీడియా రంగంలో ఉత్తమ ఆవిష్కరణలకు గానూ ‘వాన్‌-ఇఫ్రా’ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. మంగళవారం జరిగిన కార్యక్రమంలో ‘ఈటీవీ భారత్‌’ డైరెక్టర్‌ బృహతి ఆ అవార్డును ద క్వింట్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌ రీతూ కపూర్‌ చేతుల మీదుగా స్వీకరించారు.

సదస్సు ఈరోజూ కొనసాగుతోంది. డిజిటల్‌ మీడియా విస్తృతి, సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, మార్కెటింగ్‌ తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తున్నారు. దాదాపు 100కు పైగా దేశాలకు చెందిన వివిధ వార్తాపత్రికలు, న్యూస్‌ ఏజెన్సీలు, పబ్లిషింగ్‌ సంస్థలకు వాన్‌-ఇఫ్రాలో సభ్యత్వాలు ఉన్నాయి.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.