close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 5 PM

1. హైదరాబాద్‌ కంటే గొప్పగాచేయొచ్చు: చంద్రబాబు

రాజధాని అనేది ప్రజల భవిష్యత్‌కు సంబంధించిన విషయమని.. దానిని ముందుకు తీసుకెళ్లకపోతే యువత తీవ్రంగా నష్టపోతుందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాజధాని ప్రాజెక్టు తప్పు అని ప్రజలు అంటే తాను క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమని చెప్పారు. ‘ప్రజా రాజధాని-అమరావతి’ పేరిట నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశానికి 17 రాజకీయ పార్టీలు, వివిధ సంఘాలు హాజరయ్యాయి. సీపీఐ, జనసేన, లోక్‌సత్తా, ఆమ్‌ఆద్మీ, బీఎస్పీ, రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తదితర పార్టీల నుంచి ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌ కంటే గొప్పగా అమరావతిని నిర్మించుకునే అవకాశం మనకుందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మద్యపాన నిషేధం కోరుతూ దీక్ష చేస్తా: అరుణ

తెలంగాణ రాష్ట్రంలో పాలన సజావుగా సాగడం లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజల సమస్యలపై మాట్లాడటం లేదని మాజీ మంత్రి డీకే అరుణ ఆరోపించారు. శంషాబాద్‌లో ‘దిశ’ ఘటనపై దేశ వ్యాప్తంగా చర్చిస్తున్నా.. సీఎం మాత్రం స్పందించలేదని ఆమె అన్నారు. మద్యం వల్లే రాష్ట్రంలో ప్రమాదాలు పెరుగుతున్నాయని చెబుతూ.. మద్యం, మాదకద్రవ్యాలను నియంత్రించాలని రిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో మద్యపానం నిషేధించే సమయం ఆసన్నమైందని గుర్తుచేశారు. దీనిపై ఈ నెల 11, 12 తేదీల్లో ఇందిరా పార్కు వద్ద ‘ మహిళా సంకల్ప దీక్ష’ పేరుతో రెండ్రోజులపాటు నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వివక్ష చూపిస్తే ఊరుకోం: రాహుల్‌ గాంధీ

కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంట్‌లో వ్యతిరేకిస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. పొరుగు దేశాలైన పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్థాన్‌లో అణచివేతకు గురై భారత్‌లో ఆశ్రయం కోరుతున్న వారి కోసం తీసుకొచ్చిన ‘పౌరసత్వ సవరణ బిల్లు’కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్‌ మరో రెండు రోజుల్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ దేశంలో ఎవరిపైనా ఎలాంటి వివక్ష చూపించినా కాంగ్రెస్‌ పార్టీ చూస్తూ ఊరుకోదు. అందులోనూ భారతీయులపై వివక్ష చూపిస్తే సహించేది లేదు’ అని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 9న లోక్‌సభ ముందుకు పౌరసత్వ బిల్లు

వివాదాస్పద పౌరసత్వ(సవరణ) బిల్లు వచ్చే వారం పార్లమెంట్‌ ముందుకు రానుంది. ఈ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. డిసెంబరు 9న దీన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు అధికారిక వర్గాలు గురువారం వెల్లడించాయి.  మతపరమైన దాడులు, హింస కారణంగా అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల నుంచి భారత్‌కు పారిపోయిన వచ్చిన హిందు, సిక్కు, జైన్‌, బౌద్ధ, పార్శీ, క్రైస్తవులకు భారతీయ పౌరసత్వం కల్పించడం కోసం 1955 నాటి పౌరసత్వ చట్టంలో సవరణలు చేస్తూ ఈ బిల్లును తీసుకొచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రాష్ట్రపతి వద్దకు 15వ ఆర్థిక సంఘం నివేదిక

దేశవ్యాప్తంగా వసూలయ్యే పన్నుల ఆదాయాన్ని కేంద్రం ప్రభుత్వంతో కలిసి రాష్ట్రాలు ఏవిధంగా పంచుకోవాలో తెలియజేసే ప్రణాళికతో కూడిన 15వ ఆర్థిక సంఘం తొలివిడత నివేదిక కాపీ నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వద్దకు చేరింది. ఈ నివేదికను ఎన్‌కే సింగ్‌ నేతృత్ంలోని 15వ ఆర్థిక సంఘం సభ్యులు దీనిని తనకు అందజేసినట్లు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ట్విటర్‌లో వెల్లడించారు. 2020-21 సంవత్సరాన్ని దృష్టిలోపెట్టుకొని ఈ నివేదికను తయారు చేశారు. దీనిని నేడు పార్లమెంట్‌లో కూడా ప్రవేశపెట్టనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆర్‌బీఐ ఎఫెక్ట్‌.. మార్కెట్ల ఊగిసలాట

కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం మార్కెట్లను ఊగిసలాటలోకి నెట్టేసింది. ఆర్‌బీఐ సమీక్ష నిర్ణయాల తర్వాత చాలా సేపు ఒడుదొడుకులను ఎదుర్కొన్న సూచీలు చివరకు స్వల్ప నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 71 పాయింట్లు నష్టపోయి 40,779 వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల నష్టంతో 12,018 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.42గా కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అబ్బాయ్‌ని ప్రశంసించిన బాబాయ్‌

బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ తన అన్న కుమారుడు అర్జున్‌ కపూర్‌ను ప్రశంసలతో ముచ్చెత్తారు. తాజాగా అర్జున్‌ కపూర్‌ కథానాయకుడిగా బాలీవుడ్‌లో తెరకెక్కిన చిత్రం ‘పానిపత్‌’. అశుతోష్‌ గొవారికర్‌ దర్శకత్వం వహించారు. 1761లో జరిగిన మూడో పానిపత్‌ యుద్ధం ఆధారంగా రూపొందిన చిత్రమిది. ఈ సినిమాలో అర్జున్‌ కపూర్‌ మరాఠా యోధుడు సదాశివరావ్‌ భావ్‌గా నటించారు. అలాగే ఆయన భార్య పార్వతీ బాయ్‌ పాత్రలో కృతి సనన్‌,  అఫ్గనిస్థాన్‌ సైన్యాధిపతి అహ్మద్‌ షా అబ్దాలి పాత్రలో సంజయ్‌ దత్‌ నటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. చనిపోతాను...అనుమతించండి!

రాయ్‌ బరేలీకి చెందిన ఒక సామూహిక అత్యాచార బాధితురాలు.. కారుణ్య మరణానికి అనుమతించాలని ఉత్తర్‌ ప్రదేశ్‌ పభుత్వాన్ని కోరింది. ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్‌ నివాసంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన బాధితురాలిని, ఆమె కుటుంబ సభ్యులను బుధవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం విడుదల చేశారు. ‘‘సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను అరెస్టు చేయండి లేదా మరణించటానికి నాకు అనుమతివ్వండి’’ అని రాసి ఉన్న బ్యానర్‌ను పట్టుకుని అనుమతి లేకుండా ముఖ్యమంత్రి నివాసంలోకి ప్రవేశించాలని ప్రయత్నించినట్టు తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వరంగల్‌ నిట్‌లో అలరిస్తున్న ‘అంతరిక్ష ప్రదర్శన’

10. ‘గఫా’పై ట్రంప్‌ గుస్సా..

అమెరికా డిజిటల్‌ కంపెనీలపై ఫ్రాన్స్‌ విధించిన ‘గఫా’ పన్నులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గూగుల్‌, ఆపిల్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌ కంపెనీలను గఫా అని పేర్కొంటారు. ఇవన్నీ అమెరికన్‌ కంపెనీలు కావడం గమనార్హం.  ఈ కంపెనీలు తమ దేశాల్లో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించి ఆదాయాన్ని సంస్థల ప్రధాన కార్యాలయాలు ఉన్న అమెరికాకు తరలిస్తున్నాయని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డిజిటల్‌ ట్యాక్స్‌లో భాగంగా  ఫ్రాన్స్‌ ఈ కంపెనీలపై పన్ను విధించింది. అయితే ఈ తరహా పన్నుల విధానాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తప్పుబట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.