close

తాజా వార్తలు

Published : 24/11/2020 01:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ హర్షకుమార్‌

రాజమహేంద్రవరం: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ నాయకత్వంలో తిరిగి పనిచేయబోతున్నందుకు గర్వంగా ఉందని మాజీ ఎంపీ హర్షకుమార్‌ అన్నారు. సోమవారం తిరిగి ఆయన సొంతగూటికి చేరుకున్నారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల బాధ్యుడు ఊమెన్‌చాందీ హర్షకుమార్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హర్షకుమార్‌ మాట్లాడుతూ తప్పిపోయిన కుమారుడిని తండ్రి హత్తుకున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ తనను హత్తుకుందని వ్యాఖ్యానించారు. సోనియాగాంధీ వంటి నాయకురాలిని ఇంతవరకు చూడలేదన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలంతా ఖబడ్దార్‌ వైకాపా అనే పరిస్థితులు ఉన్నాయని చెప్పారు.


Tags :

రాజకీయం

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని