close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 09/05/2020 15:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెలంగాణలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ఊరట

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు పురపాలకశాఖ ఊరట కల్పించింది. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఆస్తిపన్నుపై 5 శాతం ఎర్లీబర్డ్‌ ప్రోత్సాహకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. వార్షిక ఆదాయపు పన్ను పరిమితి రూ.30 వేలు ఉంటేనే ఈ ప్రోత్సాహకం వర్తింస్తుందని.. గతంలో ప్రకటించిన పురపాలక శాఖ ఆ పరిమితిని ఎత్తివేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్తి పన్ను ఎంత ఉన్నా మే 31లోగా చెల్లిస్తే ఈ 5 శాతం రాయితీ వర్తించనున్నట్లు పేర్కొంది. రెసిడెన్షియల్‌, కమర్షియల్‌ కేటగిరీల వారీగా ఎర్లీబర్డ్‌ ప్రోత్సాహకం వర్తించనున్నట్లు పురపాలక శాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.