close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 17/03/2020 21:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా ఎఫెక్ట్‌: పలు రైళ్లు రద్దు

భువనేశ్వర్‌: కరోనా వ్యాప్తి నేపథ్యంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18 నుంచి 31వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. విశాఖ, భువనేశ్వర్‌, సికింద్రాబాద్‌, పూరీ మధ్య నడిచే ఎనిమిది ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. ప్రత్యేక రైళ్లతో పాటుగా మరో 23 రైళ్లను ఈ నెల 30 వరకు రద్దు చేసినట్లు ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా ప్రజలను కరోనా వైరస్‌ ఆందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గిందని.. అందుకే ఈ నెల 31 వరకు ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్లు భారతీయ రైల్వే వెల్లడించింది.

రద్దు అయిన రైళ్ల వివరాలు...

11008 – పుణె-ముంబయి దక్కన్‌ ఎక్స్‌ప్రెస్‌– మార్చి 18 నుంచి 30 వరకు

11007 – ముంబై-పుణె డెక్కన్ ఎక్స్‌ప్రెస్ - మార్చి 19 నుంచి మార్చి 31 వరకు

11201 - ఎల్‌టీటీ-ఏజేఎన్‌జే ఎక్స్‌ప్రెస్‌ - మార్చి 23, మార్చి 30

11202 – ఏజేఎన్‌జే-ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ –  మార్చి 20, మార్చి 27

11205 - ఎల్‌టిటి-నిజామాబాద్ ఎక్స్‌ప్రెస్ - మార్చి 21 మరియు మార్చి 28 న మాత్రమే

11206 - నిజామాబాద్-ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ - మార్చి 22 మరియు మార్చి 29 న మాత్రమే

22135/22136 - నాగ్‌పూర్-రేవా ఎక్స్‌ప్రెస్ - మార్చి 25న మాత్రమే

11401 - ముంబయి-నాగ్‌పూర్ నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ - మార్చి 23 నుంచి ఏప్రిల్ 1 వరకు

11402 - నాగ్‌పూర్-ముంబై నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ - మార్చి 22 నుంచి మార్చి 31 వరకు

11417 - పుణె-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ - మార్చి 26, ఏప్రిల్ 2న

11418 - నాగ్‌పూర్-పుణె ఎక్స్‌ప్రెస్ - మార్చి 20, 27న 

22139 - పుణె-అజ్ని ఎక్స్‌ప్రెస్ - మార్చి 21, 28న

22140 - అజ్ని-పుణె ఎక్స్‌ప్రెస్ - మార్చి 22, 29న

12117/12118 - ఎల్‌టిటి-మన్మాడ్‌ ఎక్స్‌ప్రెస్ - మార్చి 18 నుంచి 31 వరకు

12125 - ముంబయి-పుణె ప్రగతి ఎక్స్‌ప్రెస్ - మార్చి 18 నుంచి 31 వరకు

12126 - పుణె-ముంబయి ప్రగతి ఎక్స్‌ప్రెస్ - మార్చి 19 నుంచి ఏప్రిల్ 1 వరకు

22111 - భూసవల్-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ - మార్చి 18 నుంచి 29 వరకు

22112 - నాగ్‌పూర్-భూసావల్ ఎక్స్‌ప్రెస్ - మార్చి 19 నుంచి మార్చి 30 వరకు

11307/11308 - కలబురగి-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ - మార్చి 18 నుంచి 31 వరకు

12262 - హౌరా-ముంబయి దురంతో ఎక్స్‌ప్రెస్ - మార్చి 24, మార్చి 31న మాత్రమే

12261 - ముంబయి-హౌరా దురంతో ఎక్స్‌ప్రెస్ - మార్చి 25, ఏప్రిల్ 1న మాత్రమే

22221 - సీఎస్‌ఎంటీ-నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్ - మార్చి 20, 23, 27, 30న మాత్రమే

22222 - నిజాముద్దీన్-సీఎస్‌ఎమ్‌టీ రాజధాని ఎక్స్‌ప్రెస్ - మార్చి 21, 24, 26, 31న మాత్రమే


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.