కర్ణాటకలో కరోనా అనుమానిత రోగి మృతి
close

తాజా వార్తలు

Published : 11/03/2020 14:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కర్ణాటకలో కరోనా అనుమానిత రోగి మృతి

బెంగళూరు: భారత్‌లో కరోనా(కొవిడ్‌-19) కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రజలు ఈ వైరస్‌ బారిన పడ్డారు. తాజాగా కర్ణాటకలో ఓ కరోనా అనుమానిత రోగి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. 

కర్ణాటకలోని కలబుర్గికి చెందిన 76ఏళ్ల మహ్మద్‌ హుస్సేస్‌ సిద్ధిఖీ ఇటీవల యాత్రల నిమిత్తం సౌదీ అరేబియాలో పర్యటించి వచ్చాడు. అనంతరం ఆయన అనారోగ్యానికి గురవడంతో చికిత్స నిమిత్తం కలబుర్గి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. సిద్ధిఖీలో కరోనా వైరస్‌ లక్షణాలు కన్పించడంతో అనుమానించిన వైద్యులు అతడి రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం బెంగళూరులోని ల్యాబ్‌కు పంపించారు. ఆ రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. అయితే ఈ లోగానే సిద్ధిఖీ ఆసుపత్రిలో మృతిచెందాడు. కాగా.. సిద్ధిఖీ కరోనా కారణంగానే చనిపోయారా లేదా అన్నది రిపోర్టులు వచ్చిన తర్వాతే తెలుస్తుందని వైద్యాధికారులు చెబుతున్నారు. 

60కి చేరిన కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 60కి చేరింది. వీరిలో 16 మంది ఇటాలియన్లు కాగా.. మిగతా వారంతా భారతీయులని ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. కరోనా అనుమానితులకు కనీసం రెండు సార్లు పరీక్షలు నిర్వహించిన తర్వాతే వైరస్‌ను నిర్ధారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు కరోనా లక్షణాలతో దిల్లీలోని సఫ్తార్‌జంగ్‌, మేదాంతా ఆసుపత్రిలో చేరిన రోగులతో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ వీడియో కాల్‌ ద్వారా మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 

ఇవీ చదవండి..

బ్రిటన్‌ ఆరోగ్య మంత్రికి కరోనా

కరోనా ఫ్రీ సర్టిఫికేట్‌ తెస్తేనే భారత్‌కు ఎంట్రీ

అగ్రరాజ్యంపై కరోనా పంజా..


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని