రెండు వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో 11 మంది మృతి
close

తాజా వార్తలు

Published : 02/11/2020 19:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెండు వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో 11 మంది మృతి

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌, ఝార్ఖండ్‌లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది మృతిచెందారు. యూపీలోని బహ్రాయిచ్‌ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం ఉదయం గోండా-బహ్రాయిచ్ హైవేపై శివదాహా మలుపు సమీపంలో గుర్తు తెలియని వాహనం ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్‌ను ఢీకొట్టింది. దీంతో వ్యాన్‌ అదుపు తప్పి బోల్తా కొట్టడంతో ఆరుగురు ఘటనా స్థలంలోనే మరణించారు. 10 మందిని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

మరోవైపు ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సోమవారం ఉదయం ధన్‌బాద్‌ నుంచి జమార్తా వైపు వెళుతున్న కారు.. తూర్పు టుండి ప్రాంతం సమీపంలో రోడ్డుపక్కన నిలిపి ఉంచిన లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఆరుగురిలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. కారు డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే స్థానికులు స్పందించి ఆస్పత్రికి తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని