దేశంలో చాలినన్ని హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ నిల్వలు

తాజా వార్తలు

Updated : 11/04/2020 01:32 IST

దేశంలో చాలినన్ని హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ నిల్వలు

దిల్లీ: దేశీయ విపణికి సరిపడా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. కొరత ఏర్పడకుండా అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నామని వెల్లడించింది. మలేరియా, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, లూపస్‌కు ఈ మందును వినియోగిస్తారన్న సంగతి తెలిసిందే. కొవిడ్‌-19పై పోరాడేందుకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను చాలాదేశాలు ‘గేమ్‌ ఛేంజర్’గా భావిస్తున్నాయి. అమెరికా, బ్రెజిల్‌, కొన్ని ఐరోపా దేశాలు తమకు ఈ ఔషధం కావాలని భారత్‌ను కోరుతున్న సంగతి తెలిసిందే.

‘దేశంలో చాలినన్ని హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ నిల్వలు ఉన్నాయి. దేశీయ అవసరాలు, గిరాకీ, ఉత్పత్తిని రోజువారీగా సమీక్షిస్తున్నాం’ అని జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్‌పీపీఏ) ఛైర్మన్‌ శుభ్రాసింగ్‌ తెలిపారు. ‘దేశీయ అవసరాలే మా తొలి ప్రాధాన్యం. మన అవసరాలు తీరాకే విదేశాలకు ఎగుమతి చేస్తాం’ అని హామీ ఇచ్చారు. ఐతే వైద్యుల సలహా మేరకే వీటిని తీసుకోవాలని ప్రజలకు ఆమె సూచించారు.

ప్రపంచానికి అవసరమైన హైడ్రాక్సీ క్లోరోక్విన్‌లో 70 శాతం భారతే తయారుచేస్తోంది. ఐపీసీఏ, జైడస్‌ క్యాడిలా వంటి సంస్థలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. దేశీయ అవసరాలకు సరిపడా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ నిల్వలు ప్రస్తుతం ఉన్నాయని గతవారం భారత ఫార్మాసూటికల్‌ ఇండస్ట్రీ వెల్లడించింది. ఎగుమతుల అవసరాలు తీర్చేందుకు ఉత్పత్తిని పెంచుతామని పేర్కొంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని