close

తాజా వార్తలు

Published : 04/09/2020 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘ క్లౌడ్‌’పై వ్యాపారవేత్తల ఆసక్తి

బెంగళూరు: తమ వ్యాపార సామర్థ్యాలను, వ్యూహాలను సమర్థంగా వినియోగించుకోవడం కోసం హైబ్రిడ్‌ మల్టీ క్లౌడ్‌ ప్లాట్‌ఫాంపై పెట్టుబడులు పెంచుకోవాలని భారత వ్యాపార దిగ్గజాలు భావిస్తున్నాయి. ఈ విషయాన్ని ఐబీఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహించిన బిజినెస్‌ వేల్యూ సర్వే స్పష్టం చేసింది. భారత, అంతర్జాతీయ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొన్న ఈ సర్వే ప్రకారం.. ‘ప్రస్తుతం ఐటీ వ్యయాల్లో 17 శాతం క్లౌడ్‌పై పెడుతుండగా.. ఈ వాటాను 2023 కల్లా 42-49 శాతానికి పెంచుకోవాలని ఎగ్జిక్యూటివ్‌లు భావిస్తున్నారు. ఎక్కువ వ్యయాలు హైబ్రిడ్‌ క్లౌడ్‌ ప్లాట్‌ఫాంపైనే కేటాయించనున్నారు. ఎందుకంటే వీరి పబ్లిక్‌ క్లౌడ్‌ వ్యయాలు 50 శాతం నుంచి 43 శాతానికి తగ్గనున్నాయి. భవిష్యత్‌లో చాలా వరకు పరిశ్రమలు క్లౌడ్‌ సంఖ్య రూపంలో తమ వృద్ధిని ప్రదర్శించే అవకాశం ఉంది. ముఖ్యంగా బీమా, టెలికాం, రిటైల్‌లో వచ్చే మూడేళ్లలో 10 క్లౌడ్స్‌ వరకు వినియోగించుకోవచ్చు.’



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని