close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5PM

1. తెలంగాణ కేబినెట్‌ భేటీ ప్రారంభం

తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ భేటీ ప్రారంభమైంది. ప్రగతిభవన్‌లో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చర్చించనున్నారు. ఆయా అంశాలపై చర్చించిన అనంతరం వాటికి కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాల తేదీలను ఖరారు చేసే అవకాశముంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్న పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ప్రభుత్వ విధానాన్ని కేసీఆర్‌ వెల్లడించనున్నట్లు తెలిసింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. శుభకార్యాల్లోనూ అమరావతి నిరసనలు

అమరావతి ఆందోళనల నేపథ్యంలో విజయవాడ నగరంతో పాటు చుట్టుపక్కల జరిగే శుభకార్యాలూ నిరసన వేదికలుగా మారుతున్నాయి. ఎక్కడ ఏ వేడుక జరిగినా రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. మొన్నటికిమొన్న ఓ పెళ్లి వేడుకలో వధూవరులిద్దరూ వివాహ సమయంలో ‘మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు’ అని ప్లకార్డులతో అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇదే తరహాలో విజయవాడలో ఓ కుటుంబం ఏర్పాటు చేసిన వేడుకలో అతిథులు తమదైన రీతిలో నిరసన తెలియజేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘త్వరలో ఇంటర్‌పోల్‌ అదుపులోకి జగన్‌’ 

ఇటీవల పలువురు వ్యాపారవేత్తలపై జరిగిన ఐటీ దాడులను తెదేపాకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని తెదేపా సీనియర్‌ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. దాడులు ఎవరిపై జరిగాయో వారికే రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా సీఎం జగన్‌ పోలవరం పనులు కట్టబెట్టారని..దీనిబట్టి చూస్తే ఎవరేంటో తెలుస్తోందని ఎద్దేవా చేశారు.. సీఎం జగన్‌ను త్వరలో ఇంటర్‌పోల్‌ అధికారులు అదుపులోకి తీసుకోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మెట్రోపై కిషన్‌రెడ్డిది అనవసర రాద్ధాంతం:కర్నె

మెట్రో రైలు వ్యవహారంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ మెట్రో ప్రారంభోత్సవంలో పాటించాల్సిన ప్రొటోకాల్‌ను రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిందన్నారు. మెట్రో వ్యవహారంలో విషయాలు సరిగా తెలుసుకొని.. హుందాగా ప్రవర్తిస్తే మంచిదని కిషన్‌రెడ్డికి కర్నె హితవు పలికారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ప్రధాని ఆశీస్సులు కావాలి: కేజ్రీవాల్‌

దిల్లీని అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని అరవింద్ కేజ్రీవాల్‌ అన్నారు. ప్రచారంలో భాగంగా తమపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ప్రత్యర్థుల్ని క్షమించేస్తున్నామన్నారు. దిల్లీ అభివృద్ధికి ఇదే వేదికపై నుంచి ప్రధాని మోదీ ఆశీస్సులు కోరుతున్నానన్నారు. ప్రమాణస్వీకారానికి మోదీని ఆహ్వానించామని.. ఆయన వేరే పనుల్లో తీరిక లేకుండా ఉన్నట్లున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా మూడోసారి ఆదివారం ఆయన ప్రమాణస్వీకారం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఐపీఎల్‌ 2020 షెడ్యూల్‌ వచ్చేసిందోచ్‌

ఐపీఎల్‌ 13వ సీజన్‌ పూర్తి షెడ్యూల్‌ వచ్చేసింది. వివరాలను ఐపీఎల్‌ నిర్వాహకులు అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించారు. గతేడాది ఫైనల్‌కు చేరిన ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య మార్చి 29న వాంఖడేలో తొలి మ్యాచ్‌ జరగనుంది. రెండో మ్యాచ్‌ 30న దిల్లీ క్యాపిటల్స్‌, కింగ్స్‌ XI పంజాబ్‌ జట్ల మధ్య, 31న రాయల్‌ ఛాలెంజర్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య జరగనుంది. ఇక సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తొలి మ్యాచ్‌  ముంబయి ఇండియన్స్‌తో ఏప్రిల్‌ 1న ఆడనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. బడ్జెట్‌ గీతదాటలేదు..: ఆర్థిక మంత్రి  

బాధ్యతలను, నిర్వహణ వంటి కీలక అంశాలను దృష్టిలోపెట్టుకొనే బడ్జెట్‌ తయారు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్‌ వెల్లడించారు.  ఎఫ్‌ఆర్‌బీఎం(ఫైనాన్షియల్‌ రెస్పాన్స్‌బిలిటీస్‌, బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌) అంశాలను దృష్టిలోపెట్టుకొనే దీనిని  తయారు చేశామన్నారు. తనను అత్యధిక సేపు బడ్జెట్‌ చదవిన ఆర్థిక మంత్రిగా కంటే అత్యధిక కాలం బడ్జెట్‌ను ప్రిపేర్‌ చేసిన ఆర్థిక మంత్రిగా గుర్తుంచుకోవాలన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను ఎక్కడా తాము దాటలేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. జామియా విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి!

 దిల్లీలోని జామియా మిలియా విశ్వవిద్యాలయ విద్యార్థులపై వర్సిటీలోనే పోలీసులు లాఠీఛార్జీ చేసిన దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. పోలీసులు కర్రలతో కొడుతున్న దశ్యాలు సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి. వీటిని జామియా సమన్వయ సమితి విడుదల చేసింది.  పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గత ఏడాది డిసెంబరులో వర్సిటీలో పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. సీఏఏకు వ్యతిరేకంగా విద్యార్థులు నిర్వహించిన నిరసన ప్రదర్శన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఫోన్ల ధరలు 7శాతం వరకు పెరగొచ్చు..!  

కరోనా(కొవిడ్‌-19) వైరస్‌ ప్రభావం భారత వ్యాపార రంగంపై కూడా పడనుంది. ఈ ప్రభావం వచ్చే 15రోజుల్లో కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్లు, ఫ్యూచర్‌ ఫోన్ల విడిభాగాల ధరలు పెరగనున్నాయి. ఫీచర్‌ ఫోన్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయాన్ని మెగ్‌అజ్‌ మొబైల్స్‌ సంస్థ సీఈవో నిఖిల్‌ చోప్రా తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. గూగుల్‌ మ్యాప్స్‌లో ‘కశ్మీర్‌’ వివాదం

 దేశాల సరిహద్దులకు సంబంధించి గూగుల్‌ మ్యాప్స్‌ కొత్తగా తీసుకొచ్చిన మార్పులు వివాదాస్పదంగా మారాయి. కశ్మీర్‌ సరిహద్దు విషయంలోనూ ఆ మార్పులు కనిపించాయి. మన దేశం నుంచి చూసినప్పుడు భారత్‌లో కశ్మీర్‌ అంతర్భాగంగానే కనిపించినా.. పాక్‌ నుంచి చూసినప్పుడు మాత్రం వివాదాస్పద సరిహద్దును సూచించే డాట్ లైన్‌తో సూచిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.