close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5PM

1. పురపాలికల్లో అవినీతి మచ్చ పోవాలి:కేసీఆర్‌

ప్రగతిభవన్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పురపాలక సదస్సు ముగిసింది. పట్టణ ప్రగతి నిర్వహణకు సంబంధించిన విధివిధానాలతో పాటు కార్యాచరణను సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. ఈ మేరకు ప్రజాప్రతినిధులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. మున్సిపాలిటీ అంటే మురికి, చెత్తకు పర్యాయపదంగా మారింది. అవినీతికి మారు పేరైంది. ఈ చెడ్డ పేరు పోవాలంటే పారదర్శక విధానాలు అవలంబించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తలసాని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి: పీయూష్‌

బడ్జెట్‌ కేటాయింపుల్లో దక్షిణ భారతదేశాన్ని రైల్వేశాఖ విస్మరించిందంటూ మంత్రి తలసాని చేసిన ఆరోపణల్ని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ఖండించారు. యూపీఏ హయాంలో రూ.258 కోట్లే కేటాయించారనీ..ఎన్డీయే హయాంలో 2020-21 బడ్జెట్‌లో 2,602 కోట్లు కేటాయించినట్టు చెప్పారు.  రాష్ట్రాలు సహకరిస్తేనే రైల్వే లైన్లు వేగంగా పూర్తవుతాయని చెప్పారు. రైల్వే కేటాయింపులు రాష్ట్రాల పరిధిలో ఉండవనీ.. జోనల్‌ పరిధిలోనే ఉంటాయని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మూడేళ్లలో ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తాం

 వైఎస్‌ఆర్‌ కంటివెలుగు మూడో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి కర్నూలులో ప్రారంభించారు. నూతనంగా నిర్మంచనున్న ఆరోగ్య ఉపకేంద్రాలకు శంకుస్థాపన చేశారు. మార్చి 1 నుంచి అవ్వ, తాతలకు కంటి ఆపరేషన్లు చేయించనున్నట్లు జగన్‌ తెలిపారు. కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దే కళ్ల జోళ్లు అందిస్తామని చెప్పారు. మూడేళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మారుస్తామని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆ కుటుంబానికి ఏదైనా జరిగితే ఊరుకోం:కళా

తెదేపా అధినేత చంద్రబాబు భద్రతను రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా తగ్గించిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. తీవ్రవాదులు, మావోయిస్టులు, ఎర్ర చందనం స్మగ్లర్లు, అసాంఘిక శక్తుల నుంచి చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందన్నారు.ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందన్నారు. వారికి ఏదైనా జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కంబళ పోటీలో మరో ఉసేన్ బోల్ట్‌

ర్ణాటకలో సంప్రదాయ దున్నపోతుల పందెం కంబళలో సత్తా చాటిన శ్రీనివాస గౌడ రికార్డును మరిచిపోక ముందే ఈ పోటీల్లో మరో రికార్డు నమోదయింది. బజగోళి జోగిబెట్టు ప్రాంతానికి చెందిన నిషాంత్ శెట్టి అనే వ్యక్తి 143 మీటర్ల దూరాన్ని కేవలం 13.68 సెకన్లలో పరిగెత్తి విజయం సాధించాడు. వేగం పరంగా లెక్కిస్తే నిషాంత్ శెట్టి 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.51 సెకన్లలో పరిగెత్తినట్టే. దీంతో గతంలో శ్రీనివాస గౌడ నమోదు చేసిన రికార్డును నిషాంత్ శెట్టి బద్దలు కొట్టాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కక్షపూరితమే..అభివృద్ధి ఏదీ?: పురందేశ్వరి

వైకాపా, తెదేపా ప్రజల విశ్వాసం కోల్పోయాయని భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి అన్నారు. ప్రస్తుతం కక్షపూరిత పాలన తప్ప అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. రివర్స్‌ టెండరింగ్‌తో పోలవరం పనులు కుంటుపడ్డాయన్న ఆమె.. ప్రభుత్వ విధానాల వల్ల పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఆర్థిక లోటులో పథకాలు ఎలా అమలుచేస్తారో వాళ్లే చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రాహుల్‌.. ట్వీట్ చేసే ముందు చెక్‌ చేసుకోండి: స్మృతీ ఇరానీ

కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్ర విమర్శలు చేశారు. సైనిక దళాల్లో మహిళా అధికారులందరికీ మూడు నెలల్లోగా శాశ్వత కమిషన్ మంజూరు చేయాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ ‘‘కేంద్ర ప్రభుత్వం పురుషుల కంటే మహిళలను తక్కువ చేస్తూ వారిని కించపరుస్తోంది. అందుకే సైన్యంలో మహిళా అధికారులకు కమాండ్ హోదా, పర్మినెంట్ సర్వీస్‌ ఇవ్వకూడదని సుప్రీంకోర్టులో వాదిస్తోంది. భాజపా ప్రభుత్వంపై వ్యతిరేకంగా పోరాడిన భారత మహిళలకు నా శుభాకాంక్షలు’’ అని ట్విటర్లో విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. గూగుల్‌ ఇవ్వకున్నా... మేం ఇస్తాం

 దేశవ్యాప్తంగా ఉన్న 5600 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయాన్ని కొనసాగించనున్నామని ప్రభుత్వరంగ సంస్థ రైల్‌టెల్‌ స్పష్టం చేసింది. దేశంలోని 400 రైల్వే స్టేషన్లలో అధిక వేగంతో ఉచిత వైఫై సదుపాయాన్ని కల్పించే ‘స్టేషన్‌’ కార్యక్రమానికి ... గూగుల్ సాంకేతిక సహకారంతో భారతీయ రైల్వే 2015లో శ్రీకారం చుట్టింది. అయితే ఈ ఒప్పందం 2020లో ముగియనుంది. దీంతో ఈ పథకాన్ని ఉపసంహరించుకోనున్నామని గూగుల్ ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మార్కెట్లోకి మారుతీ ఇగ్నిస్‌ న్యూ వెర్షన్‌

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ తన ఇగ్నిస్‌ మోడల్‌లో సరికొత్త వెర్షన్‌ను నేడు మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారును ఆటోఎక్స్‌పో-2020లో ప్రదర్శనకు ఉంచింది. బీఎస్‌-6 ఇంజిన్‌తో వచ్చే ఈ కారు ప్రారంభ ధర రూ.4.89లక్షల(దిల్లీ ఎక్స్‌షోరూమ్‌లో) నుంచి రూ.6.72 లక్షల వరకూ ఉంది. ఇక ఆటోగేర్‌ వేరియంట్‌ ధర రూ.6.13లక్షల నుంచి రూ.7.19లక్షలుగా ఉంది. ఈ సరికొత్త కారు కేవలం పెట్రోల్‌ ఇంజిన్లలో మాత్రమే అందుబాటులో ఉండనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘ఆమెను తిప్పిపంపడం సమంజసమే’

కశ్మీర్‌ సందర్శించడానికి వచ్చిన బ్రిటన్‌ లేబర్‌ పార్టీ పార్లమెంటు సభ్యురాలు, ‘ఆల్‌ పార్టీ పార్లమెంటరీ గ్రూప్‌ ఫర్‌ కశ్మీర్‌’ ఛైర్‌పర్సన్‌ డెబీ అబ్రహాంను దిల్లీ విమానాశ్రయం నుంచి తిప్పి పంపడాన్ని కాంగ్రెస్‌ నాయకుడు అభిషేక్‌ మను సింఘ్వీ సమర్థించారు. భారత సార్వభౌమత్వానికి విఘాతం కలిగించే ప్రతిచర్యను తిప్పి కొట్టాల్సిందేనని తేల్చి చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.