close

తాజా వార్తలు

Updated : 21/02/2020 17:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 5PM

1. ఏపీ ఈఎస్‌ఐలో రూ.70కోట్ల అవినీతి!

ఏపీ ఈఎస్‌ఐలో భారీగా అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. రూ.975 కోట్లతో కొనుగోలు చేసిన ఔషధాలు, పరికరాల్లో రూ.70 కోట్ల అవినీతి జరిగినట్లు అధికారులు తేల్చారు. 2014-2019 వరకు జరిపిన కొనుగోళ్ల డాక్యుమెంట్లను విజిలెన్స్‌ అధికారులు పరిశీలించగా ముగ్గురు డైరెక్టర్ల పదవీకాలంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 ఈఎస్‌ఐ ఆస్పత్రులు, 3 డయాగ్నోస్టిక్‌ సెంటర్లు, 78 ఈఎస్‌ఐ డిస్పెన్సరీలకు ఔషధాలు, పరికరాల కొనుగోలులో అవినీతి జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. జగన్‌కు ఎవరు సలహాలిస్తున్నారో?: రాజా

 మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి సృష్టించిన రాజకీయ అనిశ్చితి ఏపీని రాజకీయం సంక్షోభంలోకి నెట్టిందని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా అన్నారు.  ప్రజలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలకు విలువ ఇవ్వని రీతిలో  ప్రభుత్వం వ్యవహరించడం దురదృష్టకరమని రాజా అభిప్రాయపడ్డారు. మూడు రాజధానులపై సీఎం జగన్‌కు ఎవరు సలహాలు ఇస్తున్నారో తెలియడంలేదన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధానాలు ఏపీలో ఎందుకని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. శివ నామస్మరణతో మార్మోగిన శ్రీశైలం

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా కర్నూలు జిల్లా శ్రీశైలంలో స్వయంభువుగా వెలసిన మల్లికార్జునస్వామి,భ్రమరాంబికాదేవి దర్శనానికి భక్తులు పోటెత్తారు. పాతాళగంగలో పుణ్య స్నానమాచరించిన అనంతరం భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో శ్రీశైలం జనసంద్రంగా మారింది. ఇవాళ సాయంత్రం స్వామివార్లకు ప్రభోత్సవం నిర్వహించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నా పాత్రపై వైకాపాది తప్పుడు ప్రచారం:అచ్చెన్న

ఏపీ ఈఎస్‌ఐలో 2014-19 మధ్య రూ.70 కోట్ల మేర అవినీతి జరిగిందని విజిలెన్స్‌ అధికారులు గుర్తించిన నేపథ్యంలో తెదేపా సీనియర్‌ నేత, అప్పటి కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. ఈఎస్ఐ అవకతవకల్లో తన పాత్ర ఉందంటూ వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ‘టెలీ హెల్త్‌ సర్వీసెస్‌’ తాను కార్మికశాఖ మంత్రిగా ఉన్నప్పటి నిర్ణయమన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పూనమ్‌ తిప్పేసింది..

పూనమ్‌ యాదవ్‌ (4/19) విజృంభించడంతో మహిళా టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ ఘనంగా బోణీకొట్టింది. శుక్రవారం సిడ్నీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 17 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. దీప్తి శర్మ (49*, 46 బంతుల్లో; 3×4) రాణించింది. అనంతరం బరిలోకి దిగిన ఆసీస్‌ 19.5 ఓవర్లలో 115 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ బ్యాటర్లలో అలిసా హీలీ (51, 35 బంతుల్లో; 6×4, 1×6), ఆష్లీ గాడ్నర్ (34, 36 బంతుల్లో; 3×4, 1×6) పోరాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. చైనాలో ఖైదీలకూ సోకిన కరోనా..! 

చైనాను వణికిస్తోన్న కరోనా వైరస్‌ తాజాగా అక్కడి జైలు ఖైదీలకూ సోకింది. వుహాన్‌ పట్టణానికి దూరంగా ఉన్న రెండు జైళ్లలో దాదాపు 234 మంది ఖైదీలకు కరోనా సోకినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. షాండోంగ్‌ ఉత్తర ప్రావిన్సుతో పాటు జీజియంగ్‌ తూర్పు ప్రావిన్సుల్లో ఉన్న ఈ రెండు జైళ్లలోని ఖైదీలకు కరోనా సోకినట్లు నిర్ధారించారు. అయితే ఒక్క జైళ్లోనే దాదాపు 207మంది ఖైదీలకు వైరస్‌ సోకడంపై అధికారులు కన్నెర్ర చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అమూల్యకు నక్సల్స్‌తో సంబంధాలు

 సీఏఏ వ్యతిరేక ఆందోళనలో పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన యువతి అమూల్య లియోన్‌కు గతంలో నక్సల్స్‌తో సంబంధాలున్నాయని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప అన్నారు. ఆమెకు బెయిల్‌ వచ్చే అవకాశాలు కూడా లేవన్నారు.  అమూల్యకు శిక్ష పడాల్సిందేనని ఆమె తండ్రే స్వయంగా చెప్పారు. దీంతో అమూల్యకు బెయిల్‌ వచ్చే అవకాశం కూడా లేదు. ఈ కేసులో ఆమెకు తగిన శిక్ష పడేలా చూస్తాం’ అని యడియూరప్ప తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఉత్తమ నటుడిగా హృతిక్‌ రోషన్‌

ఏటా వేడుకగా నిర్వహించే దాదాసాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అవార్డ్స్ ప్రదానోత్సవం ఈ ఏడాది కూడా అట్టహాసంగా జరిగింది. గురువారం సాయంత్రం ముంబయిలో నిర్వహించిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో పలువురు బాలీవుడ్‌, టెలివిజన్‌ తారలు సందడి చేశారు. ఈ ఏడాది అవార్డుల ప్రదానోత్సవంలో.. ఉత్తమ చిత్రంగా ‘సూపర్‌ 30’ అవార్డును సొంతం చేసుకోగా.. ఉత్తమ నటుడిగా హృతిక్‌ అవార్డును గెలుపొందారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వ్యాయామం చేస్తే.. రైల్వేస్టేషన్‌లో ఫ్రీ టికెట్‌

నేటి జీవన విధానంలో మన ఆరోగ్యానికి వ్యాయామం తప్పనిసరే అయినప్పటికీ ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఫిట్‌నెస్‌పై ఆసక్తి చూపించేవారు తక్కువే. అందుకే వ్యాయామాన్ని ప్రోత్సహించి ఆరోగ్యంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు వినూత్న ప్రయోగం చేపట్టింది రైల్వేశాఖ. కొద్దిసేపు వ్యాయామం చేస్తే ఉచితంగా ప్లాట్‌ఫాం టికెట్‌ పొందే అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం దిల్లీలోని ఓ రైల్వే స్టేషన్‌లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ట్రంప్‌తో పాటు ఇవాంకా కూడా భారత్‌కు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెంట ఆయన కుమార్తె ఇవాంకా, అల్లుడు జారెద్ కుష్నర్‌ కూడా భారత పర్యటనకు వస్తున్నారట. ఈ మేరకు అధికారిక వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఇవాంకా దంపతుల రాకను అమెరికా ధ్రువీకరించినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.  అధ్యక్షుడితో పాటు ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం కూడా రానుంది. ఈ బృందంలో కుమార్తె ఇవాంకా ట్రంప్‌, సీనియర్‌ సలహాదారు జారెద్‌ కుష్నర్‌, జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఓ బ్రెయిన్‌, ట్రెజరీ సెక్రటరీ స్టీవ్‌ ముచిన్‌, కామర్స్‌ సెక్రటరీ విల్బర్‌ రోస్‌ తదితరులు ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.