close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5PM

1. వివాదాలు లేని భూములు కేటాయించండి: పవన్‌

వాదాలకు తావులేని భూములనే ఇళ్ల స్థలాలకు కేటాయించాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. రాజధానికి సమీకరించిన భూములను ఇళ్ల స్థలాలకు ఇవ్వడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పవన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు వివాదానికి దారితీస్తున్నాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘జగన్‌ ఆదేశాలతో సంయమనం పాటిస్తున్నాం’

 పేదల ఇళ్ల స్థలాల కోసం పేదల నుంచి అసైన్డ్‌ భూములను ఎక్కడా బలవంతంగా లాక్కోవడం లేదని ప్రభుత్వ చీఫ్ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు. అసైన్డ్‌ భూములు ఇచ్చి వారికి పట్టాలతో సమానంగా పరిహారం ఇస్తున్నామని చెప్పారు. తెదేపా చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలో ఆయన రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు అన్ని మాటలను భరిస్తూ సంయమనం పాటిస్తున్నామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. దిల్లీ ప్రజలు సోదరభావాన్ని పాటించాలి:మోదీ

దిల్లీలో నెలకొన్న పరిస్థితులపై విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహంచినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అక్కడ శాంతినెలకొల్పేందుకు భద్రతాబలగాలు ఎంతో శ్రమిస్తున్నాయన్నారు. శాంతి, సామరస్యాలే భారతీయ విలువలని ఈ సందర్భంగా గుర్తుచేశారు. దిల్లీ ప్రజలంతా శాంతి, సోదరభావాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అమిత్‌ షా రాజీనామాకు సోనియా డిమాండ్‌ 

ఈశాన్య దిల్లీలో చోటుచేసుకున్న ఘటనలను కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఖండించారు. ఇలాంటి ఘటనలు బాధాకరమన్నారు. మూడు రోజుల ఆందోళనల్లో 20 మంది చనిపోయారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటనలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలన్నారు. ఈ ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇవి జరిగాయని ఆమె ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వారినెందుకు విందుకు ఆహ్వానించలేదు?:బొత్స

 ట్రంప్‌ భారత్‌ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ఇచ్చిన విందుకు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి ఆహ్వానం అందకపోవడంపై రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.  అమెరికా అధ్యక్షుడితో విందుకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి కూడా ఆహ్వానం అందలేదని గుర్తుచేశారు. మొదటి సారి సీఎం అయిన జగన్‌ను పిలవకపోయినా.. మిగిలిన వారు రెండు, మూడు సార్లు సీఎం అయిన వారేనని, మరి వారికెందుకు ఆహ్వానం అందలేదని  ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. విద్యుత్‌శాఖపై సీఎం జగన్‌ సమీక్ష

రాష్ట్రంలో విద్యుత్‌ విక్రయించే సంస్థలకు అనుకూల విధానం ఉండాలని సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ పాలసీ రూపొందించాలని సూచించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విద్యుత్‌శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. విద్యుత్‌ రంగంలో పెట్టుబడులు, మరిన్ని ఉద్యోగాల కల్పనే తమ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. ఏపీలో విద్యుత్‌ ప్లాంట్లు పెట్టేవారికి సానుకూల వాతావరణం కల్పించేలా చూడాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. చైనాలో తగ్గి కొరియాలో పెరుగుతున్న కరోనా

చైనాలో విజృంభించిన కరోనా (కొవిడ్‌-19) వైరస్ ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తాజాగా మంగళవారం ఈ వ్యాధితో చైనాలో 52 మంది మృతి చెందగా, మరో 406 మంది దీని బారినపడినట్లు అక్కడి జాతీయ ఆరోగ్య కమిషన్‌ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకూ కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 2,715కు చేరింది. ఇక యూరప్‌, మధ్య ఆసియా దేశాల్లో ఈ  ప్రాణాంతక వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. 1984లాంటి ఘటనలు పునరావృతం కానివ్వం

దేశంలో 1984 అల్లర్ల వంటి ఘటనలు పునరావృతం కానివ్వమని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. సీఏఏ వ్యతిరేక, అనుకూల ఆందోళనలతో ఈశాన్య దిల్లీ ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనల కారణంగా చోటుచేసుకున్న ఘటనల్లో ఇప్పటివరకు 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు నేడు విచారణ జరిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి పౌరుడికి జెడ్‌ కేటగిరి భద్రత కల్పించాల్సిన సమయం వచ్చిందని న్యాయస్థానం అభిప్రాయపడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. డ్రైనేజీలో ఐబీ ఉద్యోగి మృతదేహం

ఇంటెలిజెన్స్‌ విభాగానికి చెందిన ఉద్యోగి ఈశాన్య దిల్లీలోని చాంద్‌బాగ్ ప్రాంతంలో మృతిచెందినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న ఘర్షణల్లో భాగంగా నిరసనకారులు జరిపిన రాళ్ల దాడిలోనే అంకిత్‌ శర్మ(26) చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతదేహం డ్రైనేజీలో లభ్యమయిందని బంధువులు పోలీసులకు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. భారత్‌ మార్కెట్లోకి సరికొత్త డిఫెండర్‌  

భారత మార్కెట్లోకి ల్యాండ్‌రోవర్‌ డిఫెండర్‌ సరికొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. ఈ కారు ప్రారంభ వేరియంట్‌ డిఫెండర్‌ 90 ధర రూ.69.99 లక్షలుగా నిర్ణయించారు. దీని టాప్‌ వేరియంట్‌ డిఫెండర్‌ 110(ఐదు డోర్లు) ధర రూ.87.10లక్షలుగా ఉంది. ఈ కారు బుకింగ్స్‌ను స్వీకరిస్తున్నట్లు ల్యాండ్‌రోవర్‌ వెల్లడించింది. డిఫెండర్‌90 తక్కువ వీల్‌బేస్‌, డిఫెండర్‌ 110కు ఎక్కువ వీల్‌బేస్‌ను అందించారు. ఈ కారు మొత్తం బేస్‌, ఎస్‌, ఎస్‌ఈ, హెచ్‌ఎస్‌ఈ, ఫస్ట్‌ ఎడిషన్‌ వేరియంట్లలో  లభించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.