close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5PM

1. ‘కరోనా’ దెబ్బకు కుదేలైన మార్కెట్లు

‘కరోనా’ దెబ్బకు దేశీయ మార్కెట్లు కుదేలయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ అత్యంత భారీ నష్టాలను చవిచూశాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో మన మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. వరుసగా నష్టాల బాటలో పయనిస్తున్న సూచీలకు బ్లాక్‌ ఫ్రైడే మిగిలింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఏకంగా 1,448 పాయింట్లు నష్టపోయి 38,297 పాయింట్లకు పడిపోయింది. నిఫ్టీ 431.55 పాయింట్ల నష్టంతో 11,201.75 వద్ద స్థిరపడింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అప్పుడు జగన్‌ని వెనక్కి పంపలేదా?:సుచరిత

తెదేపా అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనలో పోలీసుల వైఫల్యం లేదని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఆయన్ను ప్రజా సంఘాలు, ప్రజలే అడ్డుకున్నారని.. వాటితో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ కొవ్వొత్తుల ర్యాలీ కోసం విశాఖ వెళ్లినప్పుడు ఆయన్ను వెనక్కి పంపలేదా? అని సుచరిత ప్రశ్నించారు. గతంలో ఉన్న పోలీసులే ఇప్పుడూ పని చేస్తున్నారన్న విషయం చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలని హోంమంత్రి హితవు పలికారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. చంద్రబాబునుఅడ్డుకోవడంపై హైకోర్టులో విచారణ

తెదేపా అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనలో భాగంగా గురువారం జరిగిన పరిణామాలపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలను ఆలకించింది. సెక్షన్‌ 151 కింద చంద్రబాబుకు డీసీపీ స్థాయి అధికారితో నోటీసు ఇప్పించి ఆయన్ను ముందస్తు అరెస్ట్‌ చేశారని శ్రావణ్‌ కుమార్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. సెక్షన్‌ 151 కింద చంద్రబాబుకు నోటీసు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కరోనా ప్రభావంపై రఘురాం రాజన్ సలహా

ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా (కొవిడ్-19) వైరస్‌ ప్రభావంతో స్టాక్‌ మార్కెట్లు నష్టాల బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌ పలు సూచనలు చేశారు. వైరస్‌ వ్యాపించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడమే ఉత్తమమైన ఆర్థిక ఔషధమని, ప్రోత్సాహకాల గురించి తర్వాత ఆందోళన చెందవచ్చని అన్నారు. ఈ విషయంలో కేంద్ర బ్యాంకులు చేయగలింది కొంతేనని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అవినీతి అధికారుల వివరాలివ్వండి: ఏసీబీ

ప్రభుత్వ శాఖల నుంచి అవినీతి ఆరోపణలున్న అధికారులు, సిబ్బంది వివరాలు ఇవ్వాలని అవినీతి నిరోధక శాఖ కోరింది. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖకు అనిశా డీజీ లేఖ రాశారు. రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామస్థాయి వరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఉద్యోగుల వివరాలు తెలియజేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి ఆరోపణలతో అరెస్టయిన వారి వివరాలు, సస్పెండైన సిబ్బంది వివరాలు కూడా తెలపాలని ప్రభుత్వ శాఖలకు సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. దిశ నిందితుల కుటుంబాలకు సుప్రీంలో చుక్కెదురు

దిశ నిందితుల కుటుంబాలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది.ఒక్కో కుటుంబానికి పరిహారంగా రూ.50లక్షలు ఇవ్వాలని, పోలీసులపై ఎఫ్ఐఆర్‌ నమోదు చేయాలని నిందితుల కుటుంబాలు పిటిషన్‌లో పేర్కొన్నాయి.ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే న్యాయ విచారణకు కమిషన్‌ వేశామని, ఈ సమయంలో పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘ఈశాన్య దిల్లీలో సాధారణ పరిస్థితులు’

ఈశాన్య దిల్లీలో దాదాపు అన్ని ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని జాయింట్‌ కమిషనర్‌ ఓ.పి.మిశ్రా తెలిపారు. ఈరోజు ఆయన ఘర్షణల ప్రభావం అధికంగా ఉన్న చాంద్‌బాద్‌ ప్రాంతంలో సందర్శించారు. చాలా ప్రాంతాల్లో దుకాణాలు, ఇతర కార్యాలయాలు తెరుచుకుంటున్నాయని వెల్లడించారు. గురువారం నుంచే పరిస్థితులు అదుపులోకి వచ్చాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘ఏటీఎంల్లో మార్పులు.. ఆందోళన వద్దు’

 దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంల్లో మార్పు(రీకాలిబ్రేషన్‌)ల విషయమై  వస్తున్న వార్తల నేపథ్యంలో.. ఆ విషయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎఫ్‌ఐఎస్‌ ఎండీ(బ్యాంకింగ్‌ సొల్యూషన్స్‌ ఏపీఎంఈఏ) మహేశ్‌ రామమూర్తి ప్రకటించారు. ఈ చర్యల వల్ల వినియోగదారులకు ఏ విధమైన అసౌకర్యం కలగదని ఆయన హామీ ఇచ్చారు. ‘‘రానున్న కొద్ది నెలల్లో భారత్‌లోని 2.4 లక్షల ఏటీఎంల రీకాలిబ్రేషన్‌ చేయాలని అనుకుంటున్నాం. ఈ ప్రక్రియలో భాగంగా రూ.2,000 నోట్లు ఉంచే స్లాట్‌లను రూ.500లతో మారుస్తున్నాం. ’’ అని ఆయన వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కలకలం రేపుతున్న ఎమ్‌ఎన్‌ఎస్‌ పోస్టర్‌

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో రాజ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్‌ఎన్‌ఎస్‌) పార్టీ ఏర్పాటు చేసిన ఓ పోస్టర్‌ స్థానికంగా కలకలం రేపుతోంది. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌కు చెందిన చొరబాటు దారుల గురించి కచ్చితమైన సమాచారం అందించిన వారికి రూ.5,000 బహుమతి ఇస్తామని అందులో ప్రకటించారు. దీనిపై ఎమ్‌ఎన్‌ఎస్‌ విద్యార్థి విభాగం నాయకుడు అఖిల్ చిత్రే మాట్లాడుతూ ‘‘చొరబాటుదారుల గురించి సమాచారం అందించిన వారికి బహుమతిగా రూ.5 వేలు ఇస్తాం. అంతేకాకుండా వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం’’ అని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. భారత్‌ కరోనా కట్టడి సామర్థ్యంపై అమెరికా ఆందోళన!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌(కొవిడ్‌-19) వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికాకు చెందిన నిఘా సంస్థలు దీనిపై దృష్టి సారించాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంపై పలు దేశాల సామర్థ్యాన్ని అంచనా వేస్తున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో భారత్‌లో వైరస్‌ విజృంభించిన పక్షంలో దాన్ని ఎలా నిలువరిస్తారన్న దానిపై ఆందోళన వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. జన సాంద్రత అధికంగా ఉన్న భారత్‌లో కరోనా ప్రభావం ఆందోళన కలిగించే అంశమని నిఘా విభాగానికి చెందిన ఓ అధికారి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.