close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 30/03/2020 12:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments

కరోనా వైరస్‌ ఎలా వ్యాపిస్తుందో చూడండి

తప్పకుండా చూడాల్సిన గ్రాఫిక్‌ వీడియో

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ (కొవిడ్‌ 19) ఒకరి నుంచి మరొకరికి ఎలా వ్యాపిస్తుందనే వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఇతర జబ్బులు(ఫ్లూ)లతో పోలిస్తే ఈ వైరస్‌ ఎంత వేగవంతంగా, ప్రమాదకరంగా సోకుతోందనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసింది. చైనాలోని వూహాన్‌ ప్రావిన్స్‌లో తొలుత ప్రబలిన ఈ మహమ్మారి స్వల్ప కాలంలోనే ప్రపంచం నలుమూలలకు పాకింది. 

చైనాతో పాటు అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, ఇరాన్‌, బ్రిటన్‌ లాంటి దేశాలు ఈ వైరస్‌తో వణికిపోతున్నాయి. పలు దేశాల పరిస్థితులు చేయిదాటే పోయేస్థితికి చేరాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఏడు లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 30 వేల మందికి పైగా మృతిచెందారు. మరోవైపు భారత్‌లో ఈ వైరస్‌ను కట్టడి చేయడానికి గతవారం ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో అత్యధిక శాతం జనాభా ఇళ్లకే పరిమితమైంది. దేశంలో వెయ్యి మందికిపైగా వైరస్‌ బారినపడగా 27 మంది మరణించారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.