
తాజా వార్తలు
సీపీ అంజనీకుమార్‌పై మాజీ గవర్నర్ ప్రశంసలు
హైదరాబాద్: నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సేవలను తెలంగాణ మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కొనియాడారు. అంజనీకుమార్ నాయకత్వంలో పోలీసు సిబ్బంది అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారంటూ ప్రశంసించారు. సిటీ పోలీసులను చూసి గర్విస్తున్నానని చెప్పారు. కరోనా వంటి సంక్షోభ సమయంలో కూడా ముందుండి సేవలందిస్తున్న పోలీసులను చూస్తుంటే తనకు ఎంతో గర్వంగా ఉందంటూ కితాబిచ్చారు. పోలీసు సిబ్బందికి తన శుభాకాంక్షలు తెలిపారు. ఓ టీవీ కార్యక్రమాన్ని వీక్షించిన అనంతరం ఓ సామాన్య వ్యక్తిలా ఇలా
తన స్పందన తెలియజేస్తున్నట్లు నరసింహన్ వివరించారు.
Tags :