close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 10/01/2020 19:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సబ్బండ వర్గాలను సంతృప్తి పరిచేలా..!

 అన్ని వర్గాల ఓట్లే లక్ష్యంగా కాంగ్రెస్‌ పుర మేనిఫెస్టో
  ముసాయిదాపై ముమ్మర కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌: పురపాలక సంఘాల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ఉమ్మడి మేనిఫెస్టోకు తుదిరూపు ఇస్తోంది. మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి నేతృత్వంలో పీసీసీ ఏర్పాటు చేసిన కమిటీ.. ముసాయిదాపై కసరత్తు చేస్తోంది. నిరుద్యోగులు, విద్యార్థులు, కార్మికులు సహా వివిధ వర్గాలకు సంబంధించిన అంశాలను ఎన్నికల ప్రణాళికలో చేరుస్తున్నారు. ముసాయిదా పూర్తి స్థాయిలో సిద్ధం చేసి పీసీసీకి అందజేసి సూచనలు సలహాలతో తుది మేనిఫెస్టోను సిద్ధం చేయనున్నారు.
ముసాయిదా మేనిఫెస్టోలోని అంశాలు
పురపాలికల పరిధిలో 750 చదరపు అడుగులు.. అంతకంటే తక్కువ ఉండే ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపుతోపాటు ఉచితంగా నీటి కనెక్షన్‌, సరఫరా.
పేదలకు 150 చదరపు గజాల స్థలంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.9 లక్షల గ్రాంట్‌.
అన్ని పురపాలక సంఘాల్లో వ్యవసాయం నేపథ్యంలో ఉపాధి హామీ పథకం అమలు.
ప్రతి పురపాలక పట్టణంలో వంద పడకల ఆసుపత్రి.
నిరుద్యోగ యువతకు రుణాలు, ఉద్యోగ మేళాల నిర్వహణ.
పురపాలక సంఘాల్లో జూనియర్‌, డిగ్రీ కాలేజీలు, విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం.
ప్రతి స్వయం సహాయక సంఘానికి రూ.25 లక్షల రుణం.
శ్మశానాలకు పదెకరాల స్థలం.
ఆధునిక వసతులతో దోబీ ఘాట్ల నిర్మాణం. క్షురకులకు షాపుల కోసం ఉచితంగా స్థలం. కుమ్మరి సంఘాలకు ఐదెకరాలు.
అత్యాధునిక వసతులతో స్టేడియాల నిర్మాణం.
రవాణా కార్మికుల కోసం బోర్డు ఏర్పాటు చేయడంతోపాటు వారికి ఉచిత వైద్యం, కుటుంబానికి ఆరోగ్య బీమా.
స్కూలు ఫీజుల నియంత్రణ.
పురపాలక పట్టణాల్లో అంతర్గత రోడ్లు, సీసీ కెమెరాలు, భూగర్భ డ్రైనేజీ, ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటు సహా వివిధ అంశాలను మేనిఫెస్టోలో పొందుపరచనున్నారు.

 

Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.