close

తాజా వార్తలు

Published : 22/07/2020 16:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 5 PM

1. రాజ్‌భవన్‌లో ఏపీ మంత్రివర్గ విస్తరణ

రాష్ట్ర మంత్రులుగా చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, డాక్టర్‌ సీదిరి అప్పలరాజు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్‌ హాలులో ఈ ఇద్దరితో బుధవారం మధ్యాహ్నం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణం చేయించారు. శాసనమండలి ఛైర్మన్‌ షరీఫ్‌, శాసనసభాపతి తమ్మినేని సీతారాం, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, ఉప ముఖ్యమంత్రులు, కొత్త మంత్రుల కుటుంబసభ్యుల సమక్షంలో కార్యక్రమం నిర్వహించారు. వేణుగోపాలకృష్ణకు రహదారులు-భవనాల శాఖ, అప్పలరాజుకు మత్స్య, పశుసంవర్ధక శాఖలను అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. నవంబర్‌ నాటికి ఆక్స్‌‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ సిద్ధం!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉద్ధృతి పెరుగుతున్న వేళ అందరి దృష్టీ వ్యాక్సిన్‌ పైనే ఉంది. వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ప్రపంచ దిగ్గజ ఫార్మా కంపెనీలు పోటీ పడుతున్నాయి.  ఇప్పటికే పలు కంపెనీలు రూపొందించిన వ్యాక్సిన్‌లు మానవులపై ప్రయోగ దశలో ఉన్నాయి. పుణెలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాతో కలిసి ఆక్స్‌ఫర్డ్‌ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ నవంబర్‌ నాటికి సిద్ధమయ్యే అవకాశం ఉంది. ఈ వ్యాక్సిన్‌ ధర సుమారు రూ.1000ల వరకు ఉండవచ్చని సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. వ్యవసాయ శాఖకు మరిన్ని పోస్టులు: కేసీఆర్‌

కోటికిపైగా ఎకరాలను సాగులోకి తెచ్చేందుకు నిరంతరం కృషి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖపై సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. సాంప్రదాయక సాగు పద్ధతుల స్థానంలో గొప్ప పరివర్తన రావాలని చెప్పారు. తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా మారుతోందని తెలిపారు. వ్యవసాయశాఖకు మరిన్ని పోస్టులు మంజూరు చేసేందుకు సిద్ధమన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ‘అవినీతి రహిత భారతమే మనందరి లక్ష్యం’

భారత దేశాభివృద్ధికి అవినీతి ఓ అవరోధంగా మారిందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని దేశం నుంచి పారదోలేందుకు ప్రభుత్వంతోపాటు పౌరసమాజం సంయుక్తంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాగ్ కార్యాలయ ప్రాంగణంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..  రాజనీతిజ్ఞతతోపాటు సంఘ సంస్కర్తగా, తత్వవేత్తగా, మేధావిగా, న్యాయకోవిదుడిగా, ఆర్థికవేత్తగా, రచయితగా, మానవతా మూర్తిగా బహుముఖ ప్రజ్ఞ కలిగిన గొప్ప వ్యక్తి అంబేడ్కర్‌ అని అభివర్ణించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. కొవిడ్‌ టెస్టుల్లో.. అమెరికా టాప్‌, రెండో స్థానంలో భారత్‌!

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో అమెరికా ముందువరుసలో కొనసాగుతోందని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. తరువాతి స్థానంలో భారత్‌ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 5కోట్లకు చేరువయ్యిందని, కోటి 20లక్షలకుపైగా టెస్టులతో భారత్‌ రెండో స్థానంలో ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. ఈ రెండు దేశాలు మాత్రమే భారీ సంఖ్యలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. సీఎం సోదరుడి ఆస్తులపై ఈడీ దాడులు

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌ సోదరుడు అగ్రసేన్‌ గహ్లోత్‌ ఆస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) బుధవారం దాడులు జరిపింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆయన ఆస్తులపై ఏకకాలంలో ఈ దాడులు జరుగుతున్నాయి. ఎరువుల కుంభకోణం కేసులో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ఈ దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఆగస్టు 15న పేదలందరికీ ఇళ్ల పట్టాలు: జగన్‌

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గాజులపేటలో ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ‘జగమంతా వనం... ఆరోగ్యంతో మనం’ అనే నినాదంతో 71వ వన మహోత్సవంలో భాగంగా ఇబ్రహీంపట్నంలోని పేదల ఇళ్ల స్థలాల ప్రదేశంలో సీఎం మొక్కలు నాటారు. దేవుడి దయతో కోర్టు కేసుల అడ్డంకులన్నీ తొలగిపోతే ఆగస్టు  15న 30లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ‘పేదల పొట్టగొట్టడంలో రెండు పార్టీలూ ఒకటే’

దేశంలో ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆశయం మేరకు ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఇళ్లను మంజూరు చేసినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలోనే లక్షల ఇళ్లు కేంద్ర సాయంతో నిర్మించారన్నారు. పేదల ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని అప్పట్లో తెదేపాను ప్రశ్నించిన జగన్‌.. తాను అధికారంలోకి వచ్చాక ఇళ్ల విషయం మరిచిపోయారని ఎద్దేవా చేశారు. పేద ప్రజల పొట్టగొట్టడంలో తెదేపా, వైకాపాకు తేడా ఏమాత్రం లేదని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. దేశంలో రైడ్‌ రాజ్యం సృష్టించారు..: కాంగ్రెస్‌

రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ సోదరుడు అగ్రసేన్‌ గహ్లోత్‌ ఆస్తులపై ఈడీ దాడుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ తీవ్రస్థాయిలో మండిపడింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో రైడ్‌ రాజ్యం సృష్టించిందని.. ఇలాంటి వాటికి తమ పార్టీ భయపడబోదని కాంగ్రెస్‌ ముఖ్యఅధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా అన్నారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కేంద్రం వ్యూహాలు ఫలించకపోవడంతో సీబీఐ, ఈడీ వంటి సంస్థలతో దాడు‌లకు పాల్పడుతోందని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ​​​​​​పసిడి 10 గ్రాములు @50 వేలు

బంగారం ధర ఆకాశాన్ని తాకింది. దేశంలో 10 గ్రాముల పసిడి ధర తొలిసారి రూ.50 వేలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా బంగారానికి పెరిగిన డిమాండ్‌తో మన దేశంలో ధర పెరిగింది. దీంతో దేశీయ ఫ్యూచర్‌ మార్కెట్‌లో ఒకే రోజు రూ.500 పెరిగింది. మరోవైపు వెండి ధర సైతం భగ్గుమంది. కేజీకి సుమారు రూ.3,400 పెరిగింది. దీంతో దీని ధర రూ.61 వేలు దాటింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.