close

తాజా వార్తలు

Updated : 29/07/2020 17:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 5 PM

1. అంబాలా చేరుకున్న ‘రఫేల్‌’ యుద్ధ విమానాలు

ప్రతిష్ఠాత్మకమైన రఫేల్‌ యుద్ధ విమానాలు అంబాలా ఎయిర్‌బేస్‌లో సురక్షితంగా దిగాయి. అబుదాబి అల్‌ దఫ్రా వైమానిక స్థావరం నుంచి ఐదు రఫేల్‌ విమానాలు భారత్‌కు వచ్చాయి. 17వ వైమానిక స్క్వాడ్రన్‌లో రఫేల్‌ యుద్ధ విమానాలు చేరనున్నాయి. ఆగస్టు రెండో విడత భారత్‌కు మరికొన్ని రఫేల్‌ యుద్ధ విమానాలు రానున్నాయి. ప్రపంచంలోని అత్యుత్తమ యుద్ధ విమానాల్లో రఫేల్‌కు స్థానముంది. అనేక మిషన్లు చేపట్టే ఓమ్నిరోల్ విమానంగా రక్షణశాఖ పరిగణిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. మానవ వనరుల శాఖ ఇకపై విద్యాశాఖ

కేంద్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ భేటీలో నూతన విద్యా విధానానికి ఆమోదం తెలిపింది. అలాగే మానవ వనరుల శాఖ పేరును విద్యాశాఖగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో దీనిపై కేంద్రం అధికారికంగా ప్రకటన చేయనుంది. ఇస్రో మాజీ చీఫ్‌ కె.కస్తూరీరంగన్‌ కమిటీ సిఫార్సుల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. రాజస్థాన్‌: మూడోసారీ ముఖ్యమంత్రికి చుక్కెదురు!

రాజస్థాన్ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. తాజాగా ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌కు గవర్నర్‌ కార్యాలయం నుంచి మళ్లీ చుక్కెదురైంది. జులై 31న అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మూడోసారి అందిన ప్రతిపాదనలను గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా మళ్లీ తిరస్కరించారు. దీంతో గవర్నర్‌ను మరోసారి కలవడానికి ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ సిద్ధమయ్యారు. తిరస్కరణకు గల కారణాలను నేరుగా గవర్నర్‌నే అడిగి తెలుసుకుంటానని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. కరోనా లెక్కలు దాచాల్సిన అవసరంలేదు: ఆళ్ల

కరోనా రోగులకు సమయానికి ఆహారం, ఔషధాలు అందిస్తున్నామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బుధవారం కొవిడ్‌పై సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక్కో కొవిడ్‌ రోగికి భోజనం కోసం రోజుకి రూ.500 చొప్పున వెచ్చిస్తున్నట్టు చెప్పారు. కరోనా మృతుల లెక్కలు దాచాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. అయోధ్యలో హై అలర్ట్..!

ఆగస్టు 5న అయోధ్యలో జరగబోయే రామ మందిర నిర్మాణానికి భూమిపూజ వేడుకను భగ్నం చేయడంతో పాటు విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ కుట్రలు పన్నుతోందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో అయోధ్య, దిల్లీ, జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ముమ్మర తనిఖీలు చేపడుతున్నాయి. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అయోధ్యలో హై అలర్ట్‌ ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. భారత్‌లో కొవిడ్‌ కట్టడికి ఏడీబీ చేయూత!

భారత్‌లో కరోనా కట్టడి చర్యలకు ఏషియన్ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌(ఏడీబీ) చేయూతనిస్తోంది. మూడు మిలియన్‌ డాలర్ల గ్రాంటు మంజూరుకు మంగళవారం ఆమోదం తెలిపింది. ఆసియా పసిఫిక్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌(ఏపీడీఆర్‌ఎఫ్‌) కింద భారత్‌కు ఈ నిధులను సమకూర్చనుంది. వైరస్‌ బాధితుల్ని వేగంగా గుర్తించడంతో పాటు వారికి చికిత్స అందజేయడం వంటి చర్యలకు ఈ నిధుల్ని ఉపయోగించాలని నిర్దేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. పక్షులు వచ్చేశాయ్‌.. నవశకానికి నాంది!

అత్యంత అధునాతన రఫేల్‌ యుద్ధవిమానాలు భారత వైమానిక అమ్ముల పొదిలో వచ్చి చేరాయి.  ఫ్రాన్స్‌ నుంచి 5 రఫేల్‌ ఫైటర్‌ జెట్‌లు భారత్‌కు చేరుకోవడంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హర్షం వ్యక్తంచేశారు. రఫేల్‌ యుద్ధ విమానాలు భారత్‌కు సురక్షితంగా చేరాయని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ జెట్‌ల రాక భారత సైనిక చరిత్రలో సరికొత్త శకానికి నాందిగా ఆయన అభివర్ణించారు. భారత వైమానిక దళం సామర్థ్యం మరింత పెరిగిందని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ప్లేస్టోర్‌ నుంచి మరో 29 యాప్‌ల తొలగింపు

ఆండ్రాయిడ్ ఫోన్‌ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందిచడంలో భాగంగా గూగుల్ ప్లేస్టోర్‌ నుంచి 29 యాప్‌లను తొలగించింది. భద్రతా తనిఖీల్లో భాగంగా వైట్ ఓప్స్ సటోరి అనే ఇంటెలిజెన్స్‌ గ్రూప్‌ ఈ యాప్‌లలో యాడ్‌వేర్‌ అనే వైరస్‌ను గుర్తించినట్లు వెల్లడించారు.  ఫొటో ఎడిటింగ్‌కు సంబంధించిన ఈ 29 యాప్‌లతో చార్టర్ ‌యూజ్‌బ్లర్‌ అనే కోడ్ పేరుతో ఈ యాడ్‌వేర్‌ను యాప్‌ల ద్వారా ఫోన్‌లలో ప్రవేశింపజేస్తున్నారని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. కరోనాను ఇలా జయించవచ్చు: విశాల్‌

కరోనా వైరస్‌ బారినపడిన వారు భయాన్ని వీడాలని, ఆ భయం ఎన్నో అనర్థాలకు దారితీస్తుందని కథానాయకుడు విశాల్‌ సూచించారు. తాను, తన తండ్రి, మేనేజర్‌ కరోనా బారినపడి 3 వారాల్లోనే కోలుకున్నామని స్పష్టం చేశారు.  ఇందుకు ఆయుర్వేద, హోమియో మందులు బాగా పనిచేశాయని పేర్కొన్నారు. తాను ఏ మెడిసిన్‌ను ప్రచారం చేయడం లేదని, ఎలా కోలుకున్నామో చెప్పడానికి ఆయుర్వేద, హోమియో మందుల పేర్లను సామాజిక మాధ్యమాల్లో చెప్పానని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. స్వీయ నిర్బంధంలోకి తమిళనాడు గవర్నర్‌!

తమిళనాడు రాజ్‌భవన్‌లో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. వైద్యుల సూచన మేరకు ఆయన ఏడు రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉంటారని రాజ్‌భవన్‌ అధికారులు వెల్లడించారు. గవర్నర్‌ ఆరోగ్యంగానే ఉన్నారని.. ముందు జాగ్రత్తలో భాగంగానే స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్టు స్పష్టంచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.