close

తాజా వార్తలు

Published : 01/08/2020 16:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్‌ @ 5 PM

1. ‘షిప్‌యార్డు క్రేన్‌ ప్రమాదంపై రెండు కమిటీలు’

హిందూస్థాన్‌ షిప్‌ యార్డు ప్రమాదంలో 11 మంది మృతి చెందారని విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ తెలిపారు. ఈ దుర్ఘటనలో ఎవరూ గాయపడలేదన్నారు. క్రేన్‌ ఆపరేషన్‌, మేనేజ్‌మెంట్‌లో మొత్తం మూడు కాంట్రాక్ట్‌ సంస్థలు ఉన్నాయని చెప్పారు. ప్రమాద కారణాల కోసం కమిటీ ఏర్పాటుకు హెచ్‌ఎస్‌ఎల్‌ ఛైర్మన్‌ను కోరామన్నారు. హెచ్‌ఎస్ఎల్‌ ప్రమాదంపై రెండు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏయూ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ నిపుణులతో కమిటీ, ప్రభుత్వ ఇంజినీరింగ్‌ విభాగం నుంచి కమిటీ వేస్తామని కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. మాజీ మంత్రి మాణిక్యాలరావు కన్నుమూత

భాజపా నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు(59) కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా కరోనాతో చికిత్స పొందుతున్న ఆయన విజయవాడలో శనివారం తుదిశ్వాస విడిచారు. కరోనా బారిన పడిన మాణిక్యాలరావు 20 రోజుల క్రితం ఏలూరు కొవిడ్‌ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే, ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వారం క్రితమే విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గత కొద్ది రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో ప్రాణాలు విడిచారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. పార్టీ కార్యాలయాల నిర్మాణం త్వరగా పూర్తి కావాలి

జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ సూచించారు. తెలంగాణ భవన్‌లో తెరాస ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్‌ భేటీ అయ్యారు. తెరాస జిల్లా కార్యాలయాలను సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారని తెలిపారు. ‘కరోనా వేళ పార్టీ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్‌ కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. హిందూస్థాన్‌ షిప్‌యార్డు ఘటనపై జగన్‌ ఆరా

విశాఖలోని హిందూస్థాన్‌ షిప్‌యార్డులో జరిగిన ఘోర ప్రమాదం ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆరా తీశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. ఘటనపై తక్షణం చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ను సీఎం జగన్‌ ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. అడ్వాణీ, జోషికి అందని ఆహ్వానం!

అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించిన భూమిపూజ కార్యక్రమానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 5న జరిగే కార్యక్రమానికి యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ భూమి పూజ చేయనున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి ఎవరెవరు హాజరవుతారనే విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఎంతగానో కృషి చేసిన భాజపా అగ్రనేతలు ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషికి ఇంకా ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ‘దిల్లీ మోడల్‌’తో కరోనా వ్యాప్తికి బ్రేక్‌ వేయండి..

శంలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు అన్నిరాష్ట్రాలూ దిల్లీ మోడల్‌ను అనుసరించాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని టిమ్స్‌, గాంధీ ఆస్పత్రి, ఎర్రగడ్డ ఆయుర్వేదిక్‌ ఆస్పత్రులను సందర్శించి కరోనా బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. టెస్టింగ్‌, ట్రేసింగ్‌; ట్రీట్‌మెంట్‌పై దృష్టిపెట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఇప్పటికైతే సురక్షితంగా ఉన్నాం కానీ..

భారత దేశం ప్రస్తుతం కరోనా వైరస్‌తో సతమతమవుతోంది. రోజుకు వేలాది కేసులు నమోదవుతుండగా, వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదే విషయంపై టీమ్‌ఇండియా మాజీ సారథి, ప్రస్తుత ఎన్‌సీఏ డైరెక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్పందించాడు. ప్రస్తుతానికైతే ఆటగాళ్లు సురక్షితంగానే ఉన్నారని, అయితే.. అక్టోబర్‌లో దేశవాళి క్రికెట్‌ తిరిగి  ప్రారంభమైనప్పుడు పరిస్థితి దారుణంగా ఉంటుందని ద్రవిడ్ హెచ్చరించాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. మారుతీ విక్రయాలు జోరందుకుంటున్నాయ్‌..!

కరోనా మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో పూర్తిగా స్తంభించిన వాహన విక్రయాలు క్రమంగా కోలుకుంటున్నాయి. జులై నెలలో దాదాపు అన్ని సంస్థల అమ్మకాలు పుంజుకున్నాయి. తాజాగా మారుతీ సుజుకీ ఇండియా విక్రయాల్లోనూ భారీ వృద్ధి నమోదైనట్లు ఓ ప్రకటనలో తెలిపింది. జులైలో 1,08,064 యూనిట్లు అమ్ముడైనట్లు వెల్లడించింది. కొవిడ్‌కు ముందు నమోదైన విక్రయాలతో పోలిస్తే ఇంకా పుంజుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. రెఫరెండం పెట్టాకే తరలించండి: వైకాపా ఎంపీ

రాజధాని అమరావతిపై రెఫరెండం నిర్వహించాలని, వైకాపా ప్రజాప్రతినిధులకు రహస్య ఓటింగ్‌ పెట్టాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు డిమాండ్‌ చేశారు. అమరావతి విషయంలో సీఎం జగన్‌ ప్రజలను మోసగించారని దుయ్యబట్టారు. కీలకమైన బిల్లులకు గవర్నర్‌ ఆమోదం తెలిపిన నేపథ్యంలో దిల్లీలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ‘3 రాజధానులు’పై రేపు జనసేన కీలక భేటీ

మూడు రాజధానుల అంశంపై ఆదివారం జనసేన పార్టీ కీలక సమావేశం నిర్వహించనుంది. పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ ప్రతినిధులతో పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ రేపు అత్యవసరంగా సమావేశం కానున్నారు. భవిష్యత్‌ కార్యాచరణ, మూడు రాజధానులపై టెలీకాన్ఫరెన్స్‌లో నేతల అభిప్రాయాలను తీసుకోనున్నారు. రాజధాని రైతులకు జనసేన తరఫున ఎలా అండగా ఉండాలన్న దానిపై చర్చించనున్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.