close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. కర్ణాటక ఉప పోరులో కాషాయం రెపరెపలు

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లో కాషాయ జెండా రెపరెపలాడింది. అత్యధిక స్థానాల్లో విజయం సాధించడంతో యడియూరప్ప నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం అధికారాన్ని నిలబెట్టుకుంది. ఎంతో ఉత్కంఠగా సాగిన 15 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో భాజపా 12 చోట్ల జయభేరీ మోగించింది. ఇక కాంగ్రెస్‌ కేవలం 2 స్థానాలకే పరిమితమవగా.. జేడీఎస్‌ కనీసం ఖాతా తెరవలేకపోయింది. మరో చోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నిందితుల మృతదేహాలను గాంధీకి తరలించండి

చటాన్‌పల్లి వద్ద ఎన్‌కౌంటర్‌లో మరణించిన దిశ హత్య కేసు నిందితుల మృతదేహాలను శుక్రవారం వరకు భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. మహబూబ్‌నగర్‌ నుంచి ఏసీ వాహనాల్లో గాంధీ ఆస్పత్రికి తరలించాలని సూచించింది. ఎన్‌కౌంటర్‌పై దాఖలైన రెండు పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. ఘటన జరిగిన సాయంత్రం ప్రజా సంఘాలు లేఖ రాస్తూ ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని హైకోర్టును కోరాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘అలాంటి వారికి కర్ణాటక ఫలితాలు ఓ గుణపాఠం’

దేశ ప్రజలు భాజపాను ఏ స్థాయిలో విశ్వసిస్తున్నారో నేటి కర్ణాటక ఫలితాలతో తేలిపోయిందని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో రాజకీయ సుస్థిరత భాజపాతోనే సాధ్యమని ప్రజలు ఈ తీర్పు ద్వారా స్పష్టం చేశారన్నారు. తమ పార్టీకి భారీ విజయం కట్టబెట్టిన కర్ణాటక ప్రజలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. భాజపాకు దక్షిణాదిన స్థానం లేదని విమర్శించిన వారికి ఈ తీర్పు చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఉప ఎన్నికల ఎఫెక్ట్‌:సిద్ధరామయ్య రాజీనామా

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌లో రాజకీయ వేడి మొదలైంది. సీఎల్పీ నేతగా ఉన్న మాజీ సీఎం  సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేసినట్టు సమాచారం. కర్ణాటకలో 15 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఈ డెబిట్‌కార్డులను బ్లాక్‌ చేయనున్న ఎస్బీఐ..!

మ్యాగ్‌స్ట్రైప్‌తో ఉన్న డెబిట్‌ కార్డులను డిసెంబర్‌ 31 తర్వాత ఎస్బీఐ బ్లాక్‌ చేయనుంది. వాటి స్థానంలో కొత్త ఈఎంవీ చిప్‌ అండ్‌ పిన్‌ బేస్డ్‌ డెబిట్‌ కార్డులను తీసుకోవాలని సూచించింది. ఈ నెల 31లోపు మ్యాగ్‌స్ట్రైప్‌కార్డులను ఎలాంటి రుసుము లేకుండా మార్చుకునే వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం మ్యాగ్‌స్ట్రైప్ కార్డు ఉన్న ఖాతాదారులు కొత్త తరహా కార్డుల కోసం తమ హోంబ్రాంచిలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆంధ్రప్రదేశ్‌ మహిళాంధ్రప్రదేశ్‌గా మారాలి: రోజా

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మహిళాంధ్ర ప్రదేశ్‌గా మారాలని వైకాపా ఎమ్మెల్యే రోజా ఆకాంక్షించారు. సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా తొలి రోజు మహిళల రక్షణకు సంబంధించిన అంశంపై నిర్వహించిన చర్చలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. దిశ ఘటన తర్వాత తొలిసారిగా ఏపీలో మహిళా భద్రతపై చర్చ జరుగుతుంటే దేశమంతా ఈ అసెంబ్లీలో ఎలాంటి చట్టాలు చేస్తారు? మనకు ఎలా భద్రత కల్పిస్తారని మహిళలంతా ఎదురు చూస్తున్నారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఎన్‌కౌంటర్‌పై సిట్‌ కార్యాచరణ ప్రారంభం

షాద్‌నగర్‌ చటాన్‌పల్లి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కార్యాచరణ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార ఘటన నిందితులు ఈ నెల 6న చటాన్‌పల్లి వద్ద పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు బాధ్యతను ఇప్పటికే రాచకొండ అదనపు డీసీపీ సురేందర్‌రెడ్డికి అప్పగించగా.. ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ధరల స్థిరీకరణ నిధిని ఏం చేశారు?

పౌరసరఫరాల శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే ఉల్లికోసం క్యూలో నిలబడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవటం దురదృష్టకరమని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థతకు ఇది నిరద్శనమన్నారు. సచివాలయం సమీపంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత 30, 40 రోజుల నుంచి సమస్య ఉన్నా సీఎం జగన్‌ ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదని మండిపడ్డారు. రూ.3వేల కోట్లతో ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధిని ఏం చేశారో చెప్పాలని రామానాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మరింత చౌకగా ఎస్‌బీఐ గృహరుణాలు..!

దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీరేట్లను 10 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇది ఈ డిసెంబర్‌ 10 నుంచి అమల్లోకి రానుంది. ఎస్‌బీఐ అనుసంధానిత ఎంసీఎల్‌ఆర్‌కు(మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్‌ బేస్డ్‌ లెండింగ్‌) అనుసంధానించిన కారు, గృహ, ఇతర రుణాలపై వడ్డీరేట్లు తగ్గనున్నాయి. తాజా తగ్గింపుతో ఎస్‌బీఐ ఎంసీఎల్‌ఆర్‌ 8.00శాతం నుంచి 7.90శాతానికి తగ్గింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఒడుదొడుకుల్లో మార్కెట్లకు స్వల్ప లాభాలు

అమ్మకాల ఒత్తిడి.. విదేశీ పెట్టుబడులు తరలిపోవడం, వడ్డీరేట్లపై ఆర్‌బీఐ నిర్ణయాలు తదితర కారణాలతో దేశీయ మార్కెట్లు సోమవారం లాభనష్టాల్లో ఊగిసలాడాయి. తీవ్ర ఒడుదొడుకుల్లో సాగిన సూచీలు చివరకు స్వల్ప లాభాలను దక్కించుకున్నాయి. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ స్వల్పంగా 42 పాయింట్ల లాభంతో 40,487 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 11,937 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.09గా కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.