close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. విద్యుత్‌ ఉద్యోగుల విభజనపై నిర్ణయం

విద్యుత్‌ ఉద్యోగుల విభజనపై ధర్మాధికారి కమిటీ నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల పాటు చర్చించిన కమిటీ మొత్తం 1157 మంది ఏపీ ఉద్యోగుల్లో 613 మందిని ఏపీకే కేటాయించింది. ఏపీ నుంచి తెలంగాణకు వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్న 256 మంది ఉద్యోగుల్లో 50 శాతం మందిని తెలంగాణకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ కేటాయింపులను ఏపీ విద్యుత్‌ ఉద్యోగులు అంగీకరించడం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. జగన్‌ నినాదం వంచనే: యనమల

ఐదు రోజులపాటు శాసనసభ జరిగిన తీరు సీఎం జగన్‌ అహంభావానికి అద్దంపట్టిందని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. సాక్షిలో రాసినవన్నీ తప్పుడు రాతలేనని జగన్‌ స్వయంగా ఒప్పుకున్నారని యనమల ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఆరు నెలల వైఫల్యాలను శాసనసభ సమావేశాల్లో తెదేపా ఎండగట్టిందన్నారు. యాభై శాతం పదవులు బడుగులకే అని చెప్పిన జగన్‌ నినాదం వంచనేనని దుయ్యబట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. మొనాకో గ్రాండ్‌ప్రి రన్నరప్‌గా హంపి

అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) మహిళల మొనాకో గ్రాండ్‌ప్రి చెస్‌ టోర్నమెంట్‌లో భారత చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపి రన్నరప్‌గా నిలిచింది. 12 మంది మేటి క్రీడాకారిణుల మధ్య 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హంపి రెండో స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో ఏడు పాయింట్లు సాధించిన హంపి రష్యా ప్లేయర్లు అలెగ్జాండ్రా కొస్టెనిక్‌, అలెగ్జాండ్రా గొర్యాచికినాతో సమంగా నిలిచింది. అయితే టైబ్రేక్‌ నిబంధనల ఆధారంగా కొస్టెనిక్‌ టైటిల్‌ గెలిచింది. హంపి రెండో స్థానంలో, గొర్యాచికినా మూడో స్థానంతో సరిపెట్టుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. విధించబోయే టారీఫ్‌లను సస్పెండ్‌ చేసిన చైనా..

అమెరికాకు చెందిన వస్తువులపై డిసెంబర్‌ 15నుంచి విధించాల్సిన టారీఫ్‌లను చైనా సస్పెండ్‌ చేసింది. అమెరికా-చైనా మధ్య శుక్రవారం తొలివిడత వాణిజ్య ఒప్పందం కుదరడంతో ఈ నిర్ణయం తీసుకొంది. వాస్తవానికి డిసెంబర్‌ 15 నుంచి అమెరికా నుంచి దిగుమతి అయ్యే మొక్కజొన్న, గోధుమ ఇతర వ్యవసాయ ఉత్పత్తులపై పన్ను విధించాల్సి ఉంది. ప్రస్తుతం వీటిని మాత్రం తొలగించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. తెరాస పాలనపై మాట్లాడే హక్కు వాళ్లకు లేదు

ప్రజల తిరస్కరణతో దివాలా తీసిన పార్టీలకు తెరాస పాలనపై మాట్లాడే హక్కులేదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. ఆరేళ్ల ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలను మంత్రి అజయ్‌ ఘాటుగా  విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి,  ప్రజలకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రతిపక్షాలు కళ్లు తెరిచి చూడాలన్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ పాలనకు ఎన్నో అవార్డులు వచ్చాయంటూ ‘ఈటీవీ’ నిర్వహించిన ముఖాముఖిలో మంత్రి పువ్వాడ వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి​​​​​​​

6. ఏడాదిలో కోటిన్నర రియల్‌మీ ఫోన్ల విక్రయం

చైనాకు చెందిన ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ భారత్‌లో అమ్మకాల సునామీ సృష్టించింది. ఇక్కడి మార్కెట్లోకి ప్రవేశించిన ఏడాదిలోనే కోటిన్నర ఫోన్లను విక్రయించింది. వచ్చే ఏడాది ఈ సంఖ్యను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్లు కంపెనీ సీఈవో మాధవ్‌ సేత్‌ తెలిపారు. బీబీకే గ్రూపుతో కలిసి మాధవ్‌ సేత్‌ ఈ కంపెనీని ప్రారంభించారు. ప్రస్తుతం ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఏడో మొబైల్‌ కంపెనీగా ఘనత సాధించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి​​​​​​​

7. కాల్‌మనీ బాధితుడి ఆత్మహత్యాయత్నం

గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌ వద్ద కాల్‌మనీ బాధితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఉండవల్లికి చెందిన వెంకట్రామయ్య పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. కాల్‌మనీ వ్యవహారంలో ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితుడు ఆరోపిస్తున్నాడు. వ్యాపారి గోపాలం సాంబశివరావు వద్ద రూ.6 లక్షలు అప్పు తీసుకుంటే రూ.23 లక్షలు వడ్డీ కట్టించుకున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంకా డబ్బులు కట్టాలని వేధిస్తుండటంతో ఆత్మహత్యకు యత్నించినట్లు వెంకట్రామయ్య చెబుతున్నాడు.

8. భారత్‌లో ఎంజీ రూ.3వేల కోట్ల పెట్టుబడి..!

చైనాకు చెందిన ఎస్‌ఏఐసీ నేతృత్వంలోని బ్రిటీష్ కంపెనీ మారిస్‌ గారాజ్‌(ఎంజీ)మోటార్స్‌ భారత్‌లో రూ.3వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇక్కడి మార్కెట్లలో విస్తరించడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆ కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఎంజీ మోటార్స్‌ భారత్‌లో రూ.2,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టింది. ఆ కంపెనీకి గుజరాత్‌లోని హాలోల్‌లో సొంత ప్లాంట్‌ ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి​​​​​​​

9. మహేశ్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌

మహేశ్‌బాబు అభిమానులకు శుభవార్త. సంక్రాంతి సందర్భంగా వెండితెరపై ‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ మహేశ్‌ చేసే సందడి చూడటానికి ముందే ఆయనను నేరుగా చూసే అవకాశం కలగనుంది. ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుకను జనవరి 5న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో భారీగా నిర్వహించనున్నారు. ఈ మేరకు చిత్ర బృందం ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి​​​​​​​

10. చైనా: కృత్రిమ సూర్యుడి సృష్టికి యత్నాలు 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.