close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. ఉన్నావ్‌ కేసు: మాజీ ఎమ్మెల్యేనే దోషి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్‌ అత్యాచార కేసులో దిల్లీలోని తీస్‌హజారీ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న భాజపా మాజీ ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సింగ్‌ సెంగార్‌ను దోషిగా నిర్ధారిస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ఈనెల 19న శిక్ష ఖరారుపై కోర్టు వాదనలు విననుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో నిందితుడు శశి సింగ్‌ను నిర్దోషిగా తేల్చింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. దిల్లీ పోలీసులకు అనుమతి ఎవరిచ్చారు?:ఆజాద్‌

జామియా వర్సిటీలోకి వెళ్లేందుకు పోలీసులకు అనుమతి ఎవరిచ్చారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ ప్రశ్నించారు. జామియా వర్సిటీలో ఆదివారం పోలీసులు వ్యవహరించిన తీరు అమానవీయంగా ఉందని మండిపడ్డారు. విపక్షనేతలు సీతారాం ఏచూరి, డి. రాజా, శరద్‌ యాదవ్‌తో కలిసి దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులు వర్సిటీలోకి వెళ్లి విద్యార్థుల వెంటబడ్డారని ఆజాద్‌ ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. అసత్యాలను ఎవరూ నమ్మవద్దు: ప్రధాని మోదీ

పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలు జరగడంపై ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దురదృష్టకర ఘటనలు చోటుచేసుకోవడంపై బాధాకరమని అన్నారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు. ‘పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంటు ఉభయసభల ఆమోదం లభించింది. దేశంలోని మెజారిటీ పార్టీలు సైతం దీనికి మద్దతు పలికాయి. ఎలాంటి అసత్యాలను నమ్మకుండా ప్రతిఒక్కరు హింసకు దూరంగా ఉండాలని కోరుతున్నా’’ అని మోదీ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. కడప‘ఉక్కు’పై ఎన్‌ఎండీసీతో త్వరలో ఒప్పందం

కడప స్టీల్ ప్లాంట్‌కు ఇనుప ఖనిజం సరఫరాపై జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ)తో ఏపీ ప్రభుత్వం త్వరలో ఒప్పందం చేసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయనున్న ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్‌కు అవసరమైన ముడి ఇనుము ఖనిజం కోసం ఈనెల 18న ఈ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నారు. ఈ నెల 23న కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఆందోళనలు

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ(ఎంఏఎన్‌యూయూ)లో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) వర్సిటీ విద్యార్థులకు మద్దతుగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. వర్సిటీ గేటుకు తాళాలు వేసి నిరసన చేపట్టారు. జేఎంఐ విశ్వవిద్యాలయం విద్యార్థులపై పోలీసుల లాఠీ ఛార్జిని వారంతా ఖండించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. సీఏఏ, ఎన్‌ఆర్సీ వాళ్లకి ఆయుధాలయ్యాయి

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్‌ఆర్సీ ఫాసిస్టులకు ఆయుధాలుగా మారాయని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. సీఏఏకి వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఆందోళనలపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.‘భారత్‌లోని ఫాసిస్టులకు సీఏఏ, ఎన్‌ఆర్సీలు ఆయుధాలుగా మారాయి. దాన్ని ఎదుర్కొనేందుకు అహింసాత్మక సత్యాగ్రహమే సరైన విధానం. సీఏఏ, ఎన్‌ఆర్సీకి వ్యతిరేకంగా శాంతియుతంగా పోరాటం చేస్తున్న వారికి నేను సంఘీభావం తెలుపుతున్నా’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. సెన్సార్‌ సభ్యులపై వర్మ పరువు నష్టం దావా

తన సినిమాకు నష్టం కలిగించిన సెన్సార్ సభ్యులపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ వెల్లడించారు. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోగా రెండు వారాలు ఆలస్యంగా విడుదలైందని దీనివల్ల నిర్మాతలకు రూ.కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ఉబర్‌ ఈట్స్‌-జొమాటో చర్చలు కీలక దశకు..

ఆన్‌లైన్‌ ఆహార పంపిణీ సంస్థ జొమాటో.. క్యాబ్‌ సేవల దిగ్గజం ఉబర్‌కు చెందిన ఆహార పంపిణీ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే ‘ఉబర్‌ ఈట్స్‌ ఇండియా’ పేరుతో ఆహారం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది చివరికి ఈ డీల్‌ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని టెక్‌ క్రంచ్‌ పత్రిక తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం ఉబర్‌ ఈట్స్‌ ఇండియా వ్యాపారం  విలువ 400 మిలియన్‌ డాలర్లు ఉండొచ్చని అంచనా. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ఆందోళనలు అవసరం లేదు: మైనారిటీ కమిషన్‌

పౌరసత్వ సవరణ చట్టం భారత ముస్లింలకు వ్యతిరేకంగా లేదని.. ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం లేదని జాతీయ మైనారిటీ కమిషన్‌ అభిప్రాయపడింది. ఒకవేళ నిరసన ప్రదర్శనలు చేసినా శాంతియుతంగా జరపాలని.. ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడొద్దని కమిషన్‌ ఛైర్మన్‌ సయ్యద్‌ ఘయోరుల్‌ హసన్‌ రిజ్వీ కోరారు. అలాగే పోలీసులు కూడా ఆందోళనల్ని అదుపు చేసే క్రమంలో సంయమనం పాటించాలని విన్నవించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. నష్టాలతో ముగిసిన మార్కెట్లు

దేశీయ మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్‌ ఎక్స్చేంజీ సెన్సెక్స్‌ 70 పాయింట్లు నష్టపోయి 40,938 వద్ద ముగిసింది. నిఫ్టీ 32 పాయింట్లు నష్టపోయి 12,053 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.99 వద్ద కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.