close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. సీఏఏని అమలు చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధం

పార్లమెంట్‌ ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. సీఏఏకి మద్దతుగా భాజపా ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించిన ‘జన జాగరణ్‌ అభియాన్‌’ కార్యక్రమంలో ఆదివారం ఆమె పాల్గొని ప్రసంగించారు. ‘‘సీఏఏని అమలు చేయబోమంటూ రాష్ట్రాలు తీర్మానం చేయొచ్చు. అది కేవలం ఓ రాజకీయ ప్రకటన మాత్రమే. కానీ అవి చట్టం అమలును ఆపలేవు. పార్లమెంట్‌లో ఆమోదం పొందిన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది’’ అని నిర్మలా సీతారామన్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. కొనసాగుతున్న టీడీఎల్పీ సమావేశం

తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం కొనసాగుతోంది. ఎన్టీఆర్‌ భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. రేపటి నుంచి మూడు రోజులపాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన విధానమే ప్రధాన అజెండాగా ఈ భేటీలో చర్చిస్తున్నారు. సభలో సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ రాజధాని తరలింపును ప్రక్రియను అడ్డుకునే అవకాశాలపై వ్యూహరచన చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ఎమ్మెల్యే క్వార్టర్స్‌ ఎక్కి రాజధాని రైతుల నిరసన

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్‌ భవనంపైకి ఇద్దరు రైతులు ఎక్కడం ఆందోళన కలిగిస్తోంది. తుళ్లూరు, నెక్కల్లు గ్రామాలకు చెందిన కొందరు రైతులు నూతనంగా నిర్మిస్తున్న ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద నిరసనకు దిగారు. అందులో ఇద్దరు 13 అంతస్తుల భవనంపైకి ఎక్కి అమరావతికి అనుకూలంగా నినాదాలు చేశారు. రాజధాని తరలింపు అంశాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. అమరావతిపై ప్రజా బ్యాలెట్‌ నిర్వహణ

గుంటూరు జిల్లా కాకుమానులో రాజధాని అమరావతిపై ప్రజా బ్యాలెట్‌ నిర్వహించారు. మహిళల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తమ అభిప్రాయాలు తెలిపేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అమరావతికి వ్యతిరేకంగా, అనుకూలంగా వచ్చిన ఓట్ల వివరాలు ఇవాళ సాయంత్రం వెల్లడిస్తామని నిర్వాహకులు తెలిపారు. 

5. మేడారం మహా జాతర

6. భారత్‌లోని జీఎం ప్లాంట్‌ గ్రేట్‌వాల్‌ మోటార్స్‌ చేతికి..?

భారత్‌లో విక్రయాలను నిలిపివేసిన అమెరికా కార్ల తయారీ సంస్థ జీఎం మోటార్స్‌ ఇండియా ప్లాంట్‌ను కొనుగోలు చేసేందుకు చైనాకు చెందిన గ్రేట్‌వాల్‌ మోటార్స్‌ అంగీకరించింది. ఈ ప్రస్తుతం చైనాలో అత్యధికంగా ఎస్‌యూవీలను విక్రయిస్తోంది ఈ సంస్థే. విదేశాల్లో మార్కెట్‌ను విస్తరించేందుకు గ్రేట్‌వాల్‌ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. ఈ ఏడాది ద్వితీయార్థం నాటికి దీని కొనుగోలు పూర్తికావచ్చని భావిస్తున్నారు. దీనిని కొనుగోలు చేశాక.. భారత్‌లో కూడా గ్రేట్‌వాల్‌ వాహనాలను విక్రయాలను ప్రారంభించాలని భావిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ‘నిర్భయ దోషులను ఆప్‌ రక్షించాలని చూస్తోంది’

నిర్భయ దోషులను రక్షించేందుకు ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోందని భాజపా ఆరోపించింది. ఉద్దేశపూర్వకంగానే వారికి ఉరిశిక్ష పడకుండా రెండేళ్లుగా ఆలస్యం చేసిందని ఆ పార్టీ దిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ అన్నారు. దిల్లీలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆప్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 2017లో ఉరిశిక్ష విధిస్తే 2019 వరకు సమాచారం ఇవ్వకుండా ఆలస్యం చేశారని తివారీ అన్నారు. ఇప్పటి వరకు న్యాయ ప్రక్రియను అడ్డుకున్న ఆప్‌ ప్రభుత్వం ఇప్పుడు వారిని రక్షించాలని చూస్తోందని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. సీఏఏ అమలును రాష్ట్రాలు నిరాకరించలేవు:సిబల్‌

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలును రాష్ట్రాలు నిరాకరించే అవకాశమే లేదని ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ స్పష్టం చేశారు. పార్లమెంటులో ఒకసారి చట్టంగా మారిన తర్వాత అమలుచేయాల్సిందేనని.. లేదంటే అది రాజ్యాంగ విరుద్ధ చర్య అవుతుందని అభిప్రాయపడ్డారు. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయొచ్చని.. చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రంపై ఒత్తిడి పెంచొచ్చన్నారు. రాష్ట్రాలు చట్టాన్ని అమలు చేయబోమని మొండికేస్తే తీవ్ర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ప్రభుత్వం మెడలు వంచాలి: పరిటాల శ్రీరామ్‌

రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ మహిళలు, రైతులు చేస్తున్న ఉద్యమాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని తెదేపా యువనేత పరిటాల శ్రీరామ్‌ అన్నారు. ఈ విషయంలో మొండిగా వ్యవహరిస్తున్న వైకాపా ప్రభుత్వం మెడలు వంచాలన్నారు. అమరావతి ప్రాంతంలోని మందడం, వెలగపూడి గ్రామాల్లో రైతుల దీక్షా శిబిరాలను సందర్శించి మద్దతు తెలిపారు. రాజధాని విషయంలో ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో అసెంబ్లీలో తమకు అనుగుణంగా బిల్లులు ఆమోదించుకునేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రజా ఉద్యమం ముందు ఎవరైనా తలవంచాల్సిందేనని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. మార్చిలో ‘మిలన్‌-2020’

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.