close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. భాజపా జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దిల్లీలోని భాజపా కార్యాలయానికి చేరుకున్న పార్టీ ముఖ్య నాయకులు నడ్డాను అధ్యక్షుడిగా ప్రతిపాదించారు. దీంతో ఆయన ఎలాంటి పోటీ లేకుండా భాజపా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు సీనియర్‌ నాయకులు రాధామోహన్‌సింగ్‌ అధికారికంగా ప్రకటించారు. గతంలో భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సేవలందించిన నడ్డా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నుంచి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. గ్రాఫిక్స్‌ సిటీగానే అమరావతి: కన్నబాబు

లక్ష కోట్ల రూపాయలతో రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పి ఐదేళ్లలో కేవలం రూ.5వేల కోట్లు మాత్రమే గత ప్రభుత్వం ఖర్చు చేసిందని మంత్రి కన్నబాబు అన్నారు. సినిమా డైరెక్టర్లతో సెట్టింగులు వేయించారని, డిజైన్ల పేరిట నాలుగేళ్ల కాలం వృథా చేశారని ఆయన ఆరోపించారు.  దీంతో అమరావతి గ్రాఫిక్స్‌ సిటీగా మిగిలిపోయిందన్నారు. రాజధానుల అంశంపై అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘‘సూపర్‌ కేపిటల్‌ వద్దని శివరామకృష్ణ కమిటీ చెప్పింది. గ్రీన్‌ఫీల్డ్‌, ఉన్న నగరం అభివృద్ధి చేయడం, పాలనా వికేంద్రీకరణ చేయడం వంటి మూడు ఐచ్ఛికాలు ఇచ్చింది’’ అని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ఏ జీవో ప్రకారం బోస్టన్‌ కమిటీ..?: తెదేపా

 రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో భూములు ఇచ్చిన రైతుల్లో 24 మంది చనిపోయారని.. వారి మృతికి సంతాప సూచకంగా సభలో రెండు నిమిషాలపాటు మౌనం పాటించాలని తెదేపా డిమాండ్‌ చేసింది. ఈ విషయంలో స్పీకర్‌ అనుమతివ్వాలని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు కోరారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతిపై అసత్య ప్రచారాలు చేసిందని రామానాయుడు ఆరోపించారు. ఏ జీవో ప్రకారం బోస్టన్‌ గ్రూప్‌ కమిటీని నియమించారని ఆయన ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ఏపీలో గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలు వాయిదా

ఏపీలో గ్రూప్‌-1 పరీక్షలు వాయిదా పడ్డాయి. ఫిబ్రవరి 4 నుంచి 16 వరకు జరగాల్సిన ప్రధాన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. పరీక్షల తేదీలను వచ్చే సోమవారం ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు తెలిపారు. అభ్యర్థుల కోరిక మేరకే పరీక్షలను వాయిదా వేసినట్లు ఆయన చెప్పారు.

5. మూడు రాజధానులు అందుకే.. : బొత్స

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో సీఆర్‌డీఏ రద్దు బిల్లును మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఉండాలన్న అంశంపై కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్‌ చేసిన సిఫార్సులను అప్పటి ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. ఆ రోజు సభలో బలముందని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. అభివృద్ధి అంటే 13 జిల్లాల అభివృద్ధి అని.. 5 కోట్ల మంది అభివృధ్ది  చెందాలని ఈ బిల్లును తీసుకొచ్చాం’ అని బొత్స స్పష్టంచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. సీఏఏను రాష్ట్రాలు కాదనలేవు: కాంగ్రెస్‌ నేత

పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) అమలు చేయబోమనే అధికారం రాష్ట్రాలకు లేదని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మరో సీనియర్‌ నేత హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్‌ సింగ్‌ హుడా స్పష్టం చేశారు. సీఏఏపై ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘రాజ్యాంగ పరంగా చూసుకుంటే పార్లమెంటులో ఒకసారి చట్టంగా మారిన తర్వాత దాన్ని కాదనే అధికారం రాష్ట్రాలకు లేదు. కానీ, న్యాయపరంగా మాత్రం దాన్ని వ్యతిరేకించవచ్చు’ అని ఆయన అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. 3 రాజధానులు స్వాగతిస్తున్నా: జనసేన ఎమ్మెల్యే

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ అన్నారు. ఇలాంటి ఉన్నతమైన నిర్ణయం ఉన్నతమైన వ్యక్తులకే వస్తాయని సీఎం జగన్‌ను కొనియాడారు. 13 జిల్లాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రభుత్వ సంస్థలకు ఎకరా రూ.4 కోట్లకు ఇచ్చి.. తన అనుచరులకు రూ.50 లక్షలకు వందలాది ఎకరాలు చంద్రబాబు కట్టబెట్టారని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. తొలగిన అడ్డంకులు..ఇక వారిని ఉరితీయడమే

నిర్భయ ఘటన జరిగిన సమయంలో తాను మైనర్‌ను అంటూ దోషి పవన్‌ గుప్తా వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. దీంతో నలుగురు దోషులను ఫిబ్రవరి 1న ఉరితీసేందుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి.  దోషి పవన్‌ గుప్తా వేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఆర్‌ భానుమతి, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ‘మేయర్‌ సీటుపై ఎంఐఎంతో ఒప్పందం లేదు’

 తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత నిజామాబాద్‌లో జరిగిన అభివృద్ధి కళ్లముందే కనిపిస్తోందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రోడ్లు, సెంట్రల్‌ లైటింగ్‌ వ్యవస్థ, భూగర్భ డ్రైనేజీ, పార్కులతో పాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. నగర ప్రజలు విజ్ఞులని..అభివృద్ధికి పట్టం కట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం సందర్భంగా నిజామాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రశాంత్‌రెడ్డి మాట్లాడారు.  ఎట్టి పరిస్థితుల్లో మేయర్‌ స్థానం మజ్లిస్‌కు ఇవ్వబోమని.. ఆ అవసరం కూడా తమకు లేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. 11ఏళ్ల కనిష్ఠానికి భారత వృద్ధి రేటు

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.