close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 5 PM

1. పురపోరు.. కారు జోరు

పురపాలక, నగర పాలక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార తెరాస దూసుకెళుతోంది. ఆ పార్టీ అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలుపొందారు.  స్వతంత్రులు చాలా చోట్ల సత్తా చాటారు. మొత్తం 120 పురపాలక సంస్థలు, 9 నగర పాలక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. 120 పురపాలికల్లో మొత్తం 107 చోట్ల తెరాస విజయకేతనం ఎగరవేసింది. 2,647 వార్డు సభ్యులు, 324 మంది కార్పొరేటర్లు ఎన్నికవ్వాల్సి ఉండగా.. మెజారిటీ స్థానాల్లో తెరాస సభ్యులే గెలుపొందారు. 80 వార్డులు, 1 డివిజన్‌ ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి

2. ఫలితాలు బాధ్యతను మరింత పెంచాయి:కేటీఆర్‌

మున్సిపల్‌ మంత్రిగా ఫలితాలు తన బాధ్యతను మరింత పెంచాయని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. శనివారం వెలువడిన మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో తెరాస ఘన విజయం సాధించిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ...2014 నుంచి చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్లే భారీ విజయం లభించిందన్నారు. ఇంతటి పెద్ద విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. జనసేన, భాజపా లాంగ్‌ మార్చ్‌ వాయిదా

ఫిబ్రవరి 2న భారతీయ జనతాపార్టీ, జనసేన సంయుక్తంగా నిర్వహించ తలపెట్టిన లాంగ్‌మార్చ్‌ వాయిదా పడింది. రాజధాని అమరావతి రైతులకు మద్దతుగా లాంగ్‌ మార్చ్‌ నిర్వహించనున్నట్లు ఇటీవల దిల్లీ పర్యటన సందర్భంగా జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. అయితే, ఈ క్రమంలో లాంగ్‌మార్చ్‌ వాయిదా పడినట్లు భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగభూషణం శనివారం ప్రకటించారు. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. క్షమాభిక్ష తిరస్కరణపై సుప్రీంకు నిర్భయ దోషి

సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో త్వరలో ఉరికంభం ఎక్కబోతున్న నలుగురు దోషుల్లో ఒకరైన ముకేశ్ కుమార్‌ సింగ్‌ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తన క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడంపై జ్యుడీషియల్‌ రివ్యూ కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశాడు.  తనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ ముకేశ్‌ చేసిన అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ఈ నెల 17న తిరస్కరించిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అమెరికాను దాటేసిన భారత్‌

స్మార్ట్‌ఫోన్‌ విపణిలో అగ్రరాజ్యం అమెరికాను దాటేసి భారత్‌ తొలిసారిగా రెండో స్థానానికి దూసుకెళ్లింది. చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌గా అవతరించింది. ఈ మేరకు కౌంటర్‌పాయింట్ రీసర్చ్ తాజా నివేదికలో పేర్కొంది. 2019లో భారత్‌లో 158 మిలియన్ల స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతులు, దిగుమతులు జరిగాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 7శాతం ఎక్కువ. దీంతో ఈ జాబితాలో అమెరికా మూడో స్థానానికి పడిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. భాజపాకు షాక్‌.. కపిల్‌మిశ్రాపై నిషేధం

భాజపా నేత కపిల్‌ మిశ్రాకు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదంటూ నిషేధం విధించింది. దీనికి సంబంధించిన నోటీసులను ఎన్నికల అధికారులు ఆయనకు పంపించారు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఈ నిషేధం అమల్లోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. దిల్లీ ఎన్నికలను భారత్‌-పాక్‌తో పోల్చినందుకు గాను ఆయనపై ఆప్‌ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కశ్మీర్‌లో 2జీ ఇంటర్నెట్‌ సేవలు పునరుద్ధరణ

దాదాపు ఆరు నెలల తర్వాత జమ్ముకశ్మీర్‌లో 2జీ మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరించారు. ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. కానీ, కేవలం 301 వెబ్‌సైట్లను మాత్రమే ఉపయోగించుకునేందుకు అనుమతిస్తున్నట్లు జమ్ముకశ్మీర్‌ యంత్రాంగం నోటీసులు విడుదల చేసింది.  2జీ ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మోదీ చెప్పిన ‘లక్ష్మణ్‌ స్ఫూర్తి మంత్రం’

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి టీమ్‌ ఇండియా మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్ ధన్యవాదాలు తెలియజేశారు. ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో తాత్కాలిక అడ్డంకుల గురించి ఆలోచించొద్దని మోదీ విద్యార్థులకు సూచించారు. ఈడెన్‌గార్డెన్‌లో ఆస్ట్రేలియాపై 2001లో గంగూలీ సేన విజయం సాధించడంలో లక్ష్మణ్‌, ద్రవిడ్‌ భాగస్వామ్యం గురించి ఆయన వివరించారు. కష్టాలు తాత్కాలికంగానే ఉంటాయని వారిలో స్ఫూర్తి నింపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. తెనాలిలో ఉద్రిక్తత.. దీక్షా శిబిరానికి నిప్పు

గుంటూరు జిల్లా తెనాలిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెనాలి పురపాలక కార్యాలయం వద్ద తెలుగుదేశం, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. తెదేపా అధినేత చంద్రబాబు దిష్టిబొమ్మను వైకాపా కార్యకర్తలు దహనం చేసి.. అక్కడే ఉన్న అమరావతి పరిరక్షణ ఐకాస చేపట్టిన దీక్షా శిబిరం దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశారు. వారిని తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఓ దశలో తోపులాట కూడా జరిగింది. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నా దావోస్‌ ఖర్చులు వాళ్లే భరించారు: పాక్‌ పీఎం

ప్రపంచ ఆర్థిక సదస్సు(డబ్ల్యూఈఎఫ్‌) కోసం దావోస్‌ వెళ్లేందుకు పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు  స్నేహితులు సహాయం చేశారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఆయన దావోస్‌ వెళ్లేందుకు అవసరమయ్యే ఖర్చులు ప్రభుత్వం భరించలేనందున  ఇద్దరు స్నేహితులైన వ్యాపారవేత్తలు షెహగల్‌, ఇమ్రాన్‌ చౌదరి ఆ ఖర్చులు భరించినట్లు ఆయన తెలిపారు. దావోస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. వాళ్లు కనుక ఖర్చు పెట్టకపోయినట్లయితే తాను దావోస్‌ రాగలిగే వాడిని కాదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.