టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM
close

తాజా వార్తలు

Published : 05/07/2020 16:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. ఆస్తుల పరిరక్షణకు జీహెచ్‌ఎంసీ టోల్‌ఫ్రీ నంబర్‌

భాగ్యనగరంలో ఆస్తుల పరిరక్షణకు జీహెచ్‌ఎంసీ వినూత్న కార్యక్రమం చేపట్టింది. పార్కులు, చెరువులు, బహిరంగ స్థలాల పరిరక్షణకు  ‘అసెట్‌ ప్రొటెక్షన్‌ సెల్‌’ టోల్‌ఫ్రీ నంబర్‌ 1800 599 0099ను ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌, విపత్తు నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ నంబర్‌ను  మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. అవినీతిని ప్రశ్నించినందుకే కొల్లును ఇరికించారు

వైకాపా ప్రభుత్వం అవినీతిని ప్రశ్నించిన కారణంగానే మాజీ మంత్రి కొల్లు రవీంద్రను హత్య కేసులో ఇరికించారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. చీమకు కూడా అపకారం చేయని మనిషి కొల్లు రవీంద్ర అని చెప్పారు. ఈ మేరకు పార్టీ నాయకులతో ఆయన ఆదివారం టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కొల్లు రవీంద్రను ఇరికించేందుకే కాల్స్‌ డ్రామా ఆడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. రాష్ట్రపతితో ప్రధాని మోదీ సమావేశం

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వారివురు చర్చించినట్లు రాష్ట్రపతి భవన్‌ అధికారులు తెలిపారు. సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ప్రధాని మోదీ రాష్ట్రపతికి వివరించినట్లు సమాచారం. వీరివురి సమావేశానికి సబంధించిన ఫొటోను రాష్ట్రపతి భవన్‌ అధికారిక ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ఏపీలో కరోనా: ఒక్కరోజే వెయ్యి కేసులు!

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో కొత్తగా దాదాపు వెయ్యి కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. 20,256 శాంపిల్స్‌ పరీక్షించగా.. 961 స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 36 మంది, విదేశాల నుంచి వచ్చిన ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మొత్తంగా ఈ రోజు 998 పాజిటివ్‌ కేసులు, 14 మరణాలు నమోదయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ముంబయిని ముంచెత్తుతున్న వర్షాలు

కరోనా మహమ్మారితో విలవిలాడుతున్న దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరానికి భారీ వర్షాల రూపంలో మరో విపత్తు ఏర్పడింది. థానేతో సహా మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతాల్లో వరుసగా మూడో రోజు వర్షాలు ముంచెత్తాయి. దీంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో  భారీగా వరద నీరు చేరింది. రాబోయే 24 గంటల్లో ముంబయి సహా చుట్టు పక్కల ప్రాంతాల్లో భారీగా వర్షపాతం చోటుచేసుకునే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ)అంచనా వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. హెచ్‌సీక్యూ, హెచ్‌ఐవీ మందుల ప్రయోగాల నిలిపివేత

కరోనా చికిత్సకు సంబంధించి యాంటీ మలేరియా డ్రగ్‌ హైడ్రాక్సీక్లోరోక్విన్‌(హెచ్‌సీక్యూ), హెచ్ఐవీ మందులు లోపినావిర్-రిటోనావిర్‌తో చేస్తున్న ప్రయోగాల్ని నిలిపివేస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. కరోనా చికిత్సలో ఈ ఔషధాలు ఎంతమేర ఉపయోగపడతాయో తెలుసుకునేందుకు గత కొంతకాలంగా డబ్ల్యూహెచ్‌వో ఆధ్వర్యంలో పరిశోధన జరుగుతున్న విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. చైనా వంచ‌న విధాన‌మే ప్ర‌పంచాన్ని ముంచింది!

ప‌్ర‌పంచ సంక్షోభానికి కార‌ణ‌మైన క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారికి చైనానే పూర్తి జ‌వాబుదారీగా ఉండాల‌ని అని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మ‌రోసారి స్పష్టం చేశారు. చైనా ర‌హ‌స్య‌, వంచ‌న విధానా‌లే క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌మంతా వ్యాపించ‌డానికి కార‌ణ‌మయ్యాయ‌ని ఆ దేశంపై విరుచుకుప‌డ్డారు. అమెరికా 244వ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌సంగించిన‌ డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. కిల్ల‌ర్ గ్యాంగ్‌స్ట‌ర్: పోలీసులే ఉప్పందించారు..?

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన కాన్పూర్‌ ఎన్‌కౌంట‌ర్‌లో 8మంది పోలీసులు మృత్యువాత‌ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో స్థానిక పోలీసుల పాత్ర కూడా ఉన్న‌ట్లు ద‌ర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ప్ర‌ధాన నిందితుడైన గ్యాంగ్‌స్ట‌ర్ వికాస్ దూబేకు స్థానిక పోలీసులే సాయం చేసిన‌ట్లు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలినట్లు స‌మాచారం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ‘నారప్ప’ పెద్ద కుమారుడు ఇతనే!

వెంకటేశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నారప్ప’. ప్రియమణి కథానాయిక. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. ఇప్పటికే మాస్‌లుక్‌లో ఉన్న వెంకటేశ్‌ స్టిల్‌ను విడుదల చేయగా, ఇటీవల ప్రియమణి పుట్టిన రోజు సందర్భంగా ఆమె లుక్‌ను కూడా విడుదల చేశారు. వెంకటేశ్‌ ఇందులో ఇద్దరు కొడుకుల తండ్రి కనిపించనున్నారు. పెద్ద కొడుకు పాత్రలో కార్తీక్‌ రత్నం కనిపించనున్నాడు. ఆదివారం అతని పుట్టిన రోజు సందర్భంగా ‘నారప్ప’లో కార్తీక్‌ లుక్‌ను విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. శ్రీలంక క్రికెటర్‌ మెండిస్‌ అరెస్టు

ప్రముఖ శ్రీలంక క్రికెటర్‌ కుశాల్‌ మెండిస్‌ ఆదివారం అరెస్టయ్యాడు. ఈ రోజు ఉదయం ఓ సైక్లిస్టును తన కారుతో ఢీకొట్టడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో కారుతో సహా మెండిస్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని