close

తాజా వార్తలు

Published : 04/08/2020 16:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 5 PM

1. దేశమంతా హైదరాబాద్‌వైపే చూస్తోంది: కేటీఆర్‌

కరోనా వ్యాక్సిన్‌ కోసం దేశం మొత్తం హైదరాబాద్‌ వైపే చూస్తోందని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కేటీఆర్‌ మంగళవారం ఉదయం భారత్‌ బయోటెక్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌పై జినోమ్‌ వ్యాలీలో చర్చ జరిగింది. ‘వ్యాక్సిన్‌ కోసం పోటీలో సైన్స్‌, అత్యవసరం - సమతుల్యత’ అంశంపై నిపుణులు, అనుభవజ్ఞులతో మంత్రి కేటీఆర్‌ ముచ్చటించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. కరోనా: విద్యావ్యవస్థపై మహా విపత్తు- ఐరాస

కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రభావంతో జులై నాటికి దాదాపు 160దేశాల్లో పాఠశాలలు మూతపడ్డాయి. ఇప్పటికే 100కోట్ల మంది విద్యార్థులపై ప్రభావం చూపింది. ఈ మహమ్మారి కారణంగా మరో 4కోట్ల మంది తొలిసారి పాఠశాలలకు వెళ్లే చిన్నారులు వీటికి దూరమౌతున్నారని అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ తాజా పరిణామాలు విద్యావ్యవస్థపై ‘తరాల విపత్తు’గా పరిణమించాయని ఐక్యరాజ్య సమితి ప్రపంచదేశాలను హెచ్చరించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. సుశాంత్‌ ఖాతాలోని రూ.50కోట్లు ఏమయ్యాయి?

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య కేసును ఎందుకు ఆర్థిక కోణంలో విచారణ చేయటం లేదని బిహార్‌ డీజీపీ గుప్తేశ్వర్‌ పాండే ముంబయి పోలీసులను ప్రశ్నించారు. గత నాలుగేళ్లలో సుశాంత్‌ బ్యాంకు ఖాతాల నుంచి రూ.50కోట్లు విత్‌ డ్రా అయ్యాయని, కేవలం ఏడాది కాలంలో రూ.15కోట్ల నగదును డ్రా చేశారని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. సివిల్స్‌-2019 ఫలితాలు విడుదల

సివిల్‌ సర్వీస్‌ పరీక్ష-2019 ఫలితాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) మంగళవారం విడుదల చేసింది. మొత్తం 829 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు యూపీఎస్సీ వెల్లడించింది. ఈ ఫలితాల్లో ప్రదీప్‌ సింగ్ మొదటి స్థానం సాధించాడు. జతిన్‌ కిషోర్‌, ప్రతిభా వర్మ ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ఎంపికైన వారిలో 304మంది జనరల్‌ కేటగిరీకి చెందిన వారేనని యూపీఎస్సీ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. మహిళల రక్షణకు సరైన చట్టాలు లేవు: పవన్‌

ఆంధ్రప్రదేశ్‌లో మహిళల రక్షణకు సరైన చట్టాలు లేవని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యానించారు. గుంటూరులో ఎస్సీ మహిళను ట్రాక్టర్‌తో హత్య చేయడం దారుణమన్నారు. కర్నూలు జిల్లా వెలుగోడు అత్యాచారం కేసు నమోదులో జాప్యం జరుగుతోందని చెప్పారు. ఏపీలో పోలీసులు కఠినంగా వ్యవహరించడం లేదని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. హాస్య నటుడు పృథ్వీకి కరోనా

కరోనా వైరస్‌ విజృంభణతో సినీ రంగం వణుకుతోంది. దేశంలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కొవిడ్‌ బారినపడ్డారు. కొందరు కోలుకొని డిశ్చార్జి కాగా.. మరికొందరు ఇంకా క్వారంటైన్‌లోనే ఉన్నారు. తాజాగా ప్రముఖ హాస్య నటుడు పృథ్వీరాజ్‌ కరోనా బారినపడ్డారు. 10 రోజుల నుంచి తీవ్ర జ్వరం, జలుబుతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.  పరీక్షలు నిర్వహించిన వైద్యులు కరోనా వైరస్‌ సోకినట్టు నిర్థారించారు. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నానని పేర్కొంటూ ఆయన ప్రత్యేక వీడియో విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ‘అక్కడ న్యాయం.. ఇక్కడ అన్యాయమా?’

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయని సీఎల్పీ నేత, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో దళితులపై దాడులు ఆగడం లేదన్నారు. 20వ తేదీ లోపు పోతిరెడ్డిపాడు టెండర్ల ప్రక్రియ పూర్తి అవుతుంది కాబట్టే కేసీఆర్ అపెక్స్ భేటీని వాయిదా వేయిమని చెప్పినట్లు ఉందని విమర్శించారు. తెలంగాణకు ద్రోహం చేసే సీఎంను ఇప్పటిదాకా చూడలేదని చెప్పారు. ఏపీకి న్యాయం చేస్తూ- తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. వర్షం ధాటికి వణికిన ముంబయి!

దేశ వాణిజ్య రాజధాని ముంబయి నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. భారీవర్షాల ధాటికి మహా నగరంలోని లోతట్టుప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నిన్న రాత్రి నుంచి ఈ ఉదయం వరకూ ఏకధాటిగా వర్షం కురిసింది. కేవలం పదిగంటల నిడివిలోనే దాదాపు 230మి.మీ వర్షపాతం నమోదైనట్లు బృహన్‌ ముంబయి నగరపాలక సంస్థ వెల్లడించింది. వర్షపునీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో నగరంలోని పలుప్రాంతాల్లో వరదలను తలపిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. అమిత్‌ షా అక్కడ ఉన్నా..గహ్లోత్‌కు విచారమే

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కరోనాతో ఆసుపత్రి ఐసోలేషన్‌లో ఉన్నప్పటికీ..రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్ ప్రభుత్వానికి మాత్రం ముప్పు అలాగే ఉందని మంగళవారం శివసేన పార్టీ పత్రిక సామ్నా వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది. అలాగే రాజస్థాన్‌ రాజకీయాలతో పాటు అయోధ్యలో రామ మందిర నిర్మాణం నిమిత్తం భూమి పూజ, కరోనా వైరస్‌ తీవ్రత వంటి పలు విషయాలను ప్రస్తావించింది. దేశంలో కరోనా వైరస్‌ విపత్తు సృష్టిస్తోందని, రాముడి అనుగ్రహంతో అది అంతమవుతుందని పేర్కొంది.  పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. రెడ్‌మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్

ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్‌మీ బడ్జెట్ ధరలో మరో ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రెడ్‌మీ 9ప్రైమ్‌ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్ రియల్‌ మీ నర్‌జో 10, శాంసంగ్ గెలాక్సీ ఎమ్‌11 ఫోన్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఆండ్రాయిడ్‌ 10 ఆధారిత ఎంఐయుఐ 11 ఓఎస్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. 6.53 అంగుళాల ఫుల్ హెచ్‌డీప్లస్‌ ఐపీఎస్‌ వాటర్‌డ్రాప్‌ స్టైల్ నాచ్ డిస్‌ప్లేని ఇస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.