close

తాజా వార్తలు

Published : 10/08/2020 16:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌@ 5 PM

1. సొంత గూటికి పైలట్‌?.. రాహుల్‌తో భేటీ!

అసెంబ్లీ సమావేశాల తేదీ సమీపిస్తున్న వేళ రాజస్థాన్‌ రాజకీయాలు మళ్లీ రక్తికడుతున్నాయి. నిన్నటి వరకు ఎవరి క్యాంపులు వారివే.. ఎవరి వ్యూహాలు వారివే అన్నట్లు సైలెంట్‌గా ఉన్న రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు మొగ్గుచూపుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో ఆయన సోమవారం భేటీ అయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. త్వరగా విచారణ చేపట్టండి: ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌ పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దుపై హైకోర్టు ఇచ్చిన ‘స్టేటస్‌ కో’ని ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ కాపీని కెవియట్‌ వేసిన వారికి పంపినట్లు ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు లేఖ పంపింది. ప్రతివాదులకు పిటిషన్‌ కాపీ పంపినందున వీలైనంత త్వరగా కేసుపై విచారణ జరపాలని ప్రభుత్వం లేఖలో కోరింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. రమేశ్‌ ఆస్పత్రిలో ప్రత్యేక బృందాల తనిఖీ

స్వర్ణ ప్యాలెస్‌ ఘటనపై ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. మూడు ప్రత్యేక బృందాలు రమేశ్‌ ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించినట్లు ఏసీపీ సూర్యచంద్రరావు తెలిపారు. తనిఖీల్లో కీలక పత్రాలు, హార్డ్‌డిస్కులు లభించినట్లు వెల్లడించారు. రమేశ్‌ ఆస్పత్రి నిబంధనలకి విరుద్ధంగా ఎక్కువ మంది పేషెంట్లను చేర్చుకొని వారి నుంచి రూ. లక్షలు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. రమేశ్‌ ఆస్పత్రికి చెందిన మూడు బ్రాంచ్‌ ఆస్పత్రుల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయని ఏసీపీ  చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. తీవ్ర అవినీతిలో తెలంగాణ ప్రభుత్వం: జేపీ నడ్డా

తెలంగాణలో భాజపా జిల్లా కార్యాలయాలకు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా భూమిపూజ చేశారు. వర్చువల్‌ వేదికగా దిల్లీ నుంచి ఆయన భూమిపూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెరాస ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అవినీతిలో కూరుకుపోయింది. రాష్ట్రంలో ఏడు లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని తెరాస హామీ ఇచ్చింది. ఇప్పటివరకు 50 వేలకు మించి ఇళ్లు ఇవ్వలేదు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పారు’అని నడ్డా అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ల్యాప్‌టాప్‌ల వ్యాపారానికి తొషిబా స్వస్తి

జపాన్‌కు చెందిన టెక్‌దిగ్గజం తొషిబా ల్యాప్‌టాప్‌ల వ్యాపారం నుంచి వైదొలగాలని నిర్ణయించుకొంది. కంపెనీ తన డైనాబుక్‌ ల్యాప్‌టాప్‌ బ్రాండ్‌లో 19.9శాతం వాటాను షార్ప్‌కు విక్రయించింది. దీంతో ఈ వ్యాపారం నుంచి వైదొలగినట్లైంది. గతంలో 80.1శాతం వాటాను షార్ప్‌కు విక్రయించింది. దీనిపై కంపెనీ ప్రకటన చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ఇడుక్కి ఘటన: మరో 6మృతదేహాలు వెలికితీత

కేరళలోని ఇడుక్కిలో ఇటీవల కొండ చరియలు విరిగి పడిన ఘటనలో మరో ఆరు మృతదేహాలను వెలికి తీశారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 49కి పెరిగింది. రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  కేరళలోని పలు ప్రాంతాల్లో ఆదివారం కూడా భారీ వర్షాలు కురిసినట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. కాసర్‌గోడ్‌, కన్నూర్‌, వయనాడ్‌, కొలికోడ్‌, మళప్పురం, అళప్పుళ జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. అక్రమ నిర్మాణాలుంటే తొలగించండి: హైకోర్టు

హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల కబ్జాలపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది. నిర్మల్‌ చెరువు సహా నాగోలు, మల్కాజ్‌గిరి, జంగంపేటలో ప్రభుత్వ భూములు కబ్జా కావడంపై వేర్వేరుగా హైకోర్టులో ప్రజాప్రయోజనవ వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు ఆయా భూములను పరిశీలించి నివేదిక ఇవ్వాలని, ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలుంటే వెంటనే తొలగించాలని ఆదేశించింది.

8. వెబ్‌సిరీస్‌గా గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబె జీవితం

చిత్రసీమలో బయోపిక్‌లు కొత్త కాదు. ఇప్పటికే ఎందరో ప్రముఖల జీవితాలను ఆధారంగా చేసుకొని సినిమాలు చేశారు. అలాంటి బయోపిక్స్‌లో క్రిమినల్స్‌ కూడా ఉన్నారు. అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్‌ దావూద్‌ ఇబ్రహీం నుంచి నయీం వరకు చాలా మంది క్రిమినల్స్‌ జీవితాలను ఆధారంగా చేసుకొని సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మరో గ్యాంగ్‌స్టర్‌ బయోపిక్‌ రానుంది. అది ఎవరిదో కాదు.. ఇటీవల ఎన్‌కౌంటర్‌లో హతమై వార్తల్లోకెక్కిన వికాస్‌ దుబెది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. 2021కి కరోనా అంతం: బిల్ గేట్స్

వచ్చే ఏడాది నాటికి దాదాపు అన్ని దేశాల్లో కరోనా వైరస్‌ ప్రభావం తగ్గుముఖం పడుతుందని మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుందని, 2022 కల్లా వైరస్‌ ప్రభావం పూర్తిగా తొలగిపోతుందని ఆయన వైర్డ్‌ అనే వార్తా సంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ఫొటో ఓటర్ల జాబితా సవరణ ఈసీ అవకాశం

ఏపీలో ఫొటో ఓటర్ల జాబితా సవరణకు అవకాశం కల్పిస్తూ ఎన్నికల సంఘం ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. పేర్ల నమోదు, మార్పులు, అభ్యంతరాల స్వీకరణకు నిర్ధిష్టమైన గడువును ఖరారుచేసింది. 2021 జనవరి 1 నాటికి సవరించిన ఫొటో ఓటర్ల జాబితా ప్రకటనకు షెడ్యూల్‌ను ప్రకటించింది. ఓటర్ల జాబితాలో అభ్యంతరాలపై దరఖాస్తుకు అక్టోబర్‌ 31 వరకు గడువు విధించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.