close

తాజా వార్తలు

Published : 19/09/2020 16:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌@ 5 PM

1. ఆ బిల్లు తేనె పూసిన కత్తి: కేసీఆర్‌

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతు లోకానికి తీవ్ర అన్యాయం చేసేవిధంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రైతులను దెబ్బతీసి కార్పొరేట్‌ వ్యాపారులకు లాభం చేకూర్చే విధంగా ఉండే ఈ బిల్లులను గట్టిగా వ్యతిరేకించాలని తెరాస పార్లమెంటరీ పార్టీ  నాయకుడు కె.కేశవరావును ఆదేశించారు. రాజ్యసభలో వ్యవసాయ బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంగా ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరాన్ని సీఎం వివరించారు. ఇది తేనె పూసిన కత్తి లాంటి చట్టం, దీన్ని కచ్చితంగా వ్యతిరేకించాలని సీఎం వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

2. పార్లమెంట్ సమావేశాలు కుదించే యోచనలో కేంద్రం!

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ ప్రత్యేకంగా జరుగుతున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నిర్దేశిత గడువు కంటే వారం ముందే ముగిసే అవకాశం ఉంది. పలువురు కేంద్ర మంత్రులతో పాటు 30 మంది ఎంపీలు కొవిడ్ బారిన పడినందున కేంద్రం ఈ దిశగా ఆలోచిస్తున్నట్టు పార్లమెంట్‌ అధికారులు తెలిపారు. గడిచిన ఆర్నెళ్ల వ్యవధిలో తొలిసారిగా ఈ నెల 14న సమావేశమైన పార్లమెంట్‌ ఉభయసభలు అక్టోబర్‌ 1వరకు కొనసాగుతాయని తొలుత కేంద్రం ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

3. బెట్టింగ్‌లపై గూగుల్ కన్ను‌

నేటి నుంచి టీ20 క్రికెట్‌ లీగ్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో బెట్టింగ్‌ను కట్టడి చేయడంపై ప్రముఖ సెర్చింజన్‌ గూగుల్‌ చర్యలు చేపట్టింది. బెట్టింగ్‌లకు వీలు కల్పించే యాప్‌లను తాము అనుమతించబోమని స్పష్టం చేసింది. బెట్టింగులు తమ విధానాలకు వ్యతిరేకమని, అలాంటి అప్లికేషన్లను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి తొలగిస్తామని వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

4. లక్ష ఇళ్లని చెప్పి 3,428 చూపించారు: భట్టి

లక్ష రెండు పడక గదుల ఇళ్లు చూపించలేక రాష్ట్ర ప్రభుత్వం తోకముడిచిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. శనివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తమకు లక్ష రెండు పడకగదుల ఇళ్లు చూపిస్తామని చెప్పి రెండ్రోజులు చూపించి మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారని తెలిపారు. రెండ్రోజుల్లో  కేవలం 3,428 ఇళ్లు మాత్రమే చూపించారని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

5. సరదాగా నా కొడుకు బెంజ్‌కారు నడిపాడు!

బెంజ్‌ కారు నడిపినంత మాత్రాన ఈఎస్‌ఐ కుంభకోణంలో తన పేరును తీసుకొస్తూ తెదేపా నేత అయ్యన్నపాత్రుడు చేస్తున్న తప్పుడు ప్రచారం మానుకోవాలని మంత్రి జయరాం హెచ్చరించారు. తన కుమారుడు యువకుడని, అతడి స్నేహితుడు అడిగాడు కాబట్టే  సరదాగా ఆ కారు నడిపాడని జయరాం వివరించారు. బెంజ్‌ కారు బహుమానంగా ఇచ్చారంటూ తనపై అభియోగం మోపుతున్నారనీ.. 2019 డిసెంబర్‌లో కార్తీక్‌ కారు కొన్నాడని తెలిపారు. కానీ ఈ కేసు నమోదైంది 2020 జూన్‌లో అని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

6. మా కూతురిలా ఇంకెవరికీ జరగకూడదు!

తమ కుమార్తె మృతికి కారణమైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సుమేధ (12) తల్లిదండ్రులు అభిజిత్‌, సుకన్య పోలీసులను కోరారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెలా ఇంకెవరూ బలికాకుండా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని సుమేధ తల్లిదండ్రులు కోరుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

7. మరో మూడు రోజులు వర్షాలే..!

తెలంగాణలో ఇప్పటికే కురుస్తున్న వర్షాలు మరో మూడు రోజుల పాటు కొనసాగనున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ఈశాన్య బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాగల 24గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉన్నట్టు తెలిపారు. ఇవాళ, రేపు, ఎల్లుండి అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

8. చివరికి గాంధీ విగ్రహాన్నీ వదల్లేదు: ట్రంప్‌

ఆఫ్రో-అమెరికన్‌ జార్జ్ ‌ప్లాయిడ్ మృతి అనంతరం నిరసనకారులు మహాత్మాగాంధీ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నిరసనకారులను ‘దుండగుల ముఠా’ అంటూ మండిపడ్డారు. శ్వేతజాతీయుడైన పోలీసు కర్కశత్వానికి మే 25న ఫ్లాయిడ్ బలైన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

9. ‘రూ.2 కోట్ల పరిహారం.. పిటిషన్‌ కొట్టివేయండి’

తన కార్యాలయాన్ని కూల్చివేసినందుకు బృహన్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎమ్‌సీ) రూ.2 కోట్లు నష్ట పరిహారంగా ఇవ్వాలని బాలీవుడ్ కంగనా రనౌత్‌ ముంబయి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే చట్టపరంగా చేపట్టిన కూల్చివేతకు నష్టపరిహారం చెల్లించమని కోరుతూ కంగన చట్టాన్ని అవమానించారని బీఎమ్‌సీ హైకోర్టుకు విన్నవించింది. నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కంగనా వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని శుక్రవారం కోర్టును కోరింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

10. ట్రంప్‌ నిర్ణయంపై టిక్‌టాక్‌ దావా!

అమెరికాలో టిక్‌టాక్‌ను నిషేధించడంపై దాని మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాలకవర్గంపై అక్కడి కోర్టులో దావా వేసింది. నిబంధనలకు విరుద్ధంగా యాప్‌పై నిషేధం విధించారని ఫిర్యాదులో పేర్కొంది. నిషేధం ఎత్తివేసేలా ట్రంప్‌ పాలకవర్గాన్ని ఆదేశించాలని ఫెడరల్‌ న్యాయమూర్తిని కోరింది. ట్రంప్‌పై టిక్‌టాక్‌ కోర్టుకు వెళ్లడం ఇది రెండోసారి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.