close

తాజా వార్తలు

Published : 24/09/2020 16:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్‌ @ 5 PM

1. క్రికెట్‌ దిగ్గజం డీన్‌జోన్స్‌ కన్నుమూత

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత డీన్‌ జోన్స్‌(59) కన్నుమూశారు. యూఏఈలో జరుగుతున్న మెగా టీ20 క్రికెట్‌ లీగ్‌లో స్టార్‌స్పోర్ట్స్‌ తరఫున వ్యాఖ్యాతగా కొనసాగుతున్న ఆయన ప్రస్తుతం ముంబయిలోని ఓ హోటల్‌లో బస చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. మెల్‌బోర్న్‌లో పుట్టి పెరిగిన డీన్‌జోన్స్‌ ఆస్ట్రేలియా తరఫున 52 టెస్టులు ఆడగా 46.55 సగటుతో 3,631 పరుగులు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. మార్కెట్లపై బేర్‌ పంజా.. నిఫ్టీ 11వేల దిగువకు

దేశీయ మార్కెట్లు గురువారం నాటి ట్రేడింగ్‌లో భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆర్థికవేత్తల ఆందోళన ప్రభావం ప్రపంచ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లపైనా పడింది. దీంతో వరుసగా ఆరో రోజూ దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 1100 పాయింట్లకు పైగా కోల్పోగా.. నిఫ్టీ 11వేల మార్కు దిగువకు చేరింది. ఆగస్టు 4 తర్వాత నిఫ్టీ 11వేల దిగువకు చేరడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం వాయిదా

భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) వాయిదా పడింది. నవంబర్‌ 20 నుంచి 28 మధ్య గోవాలో జరగాల్సిన 51వ చిత్రోత్సవాలను వచ్చే ఏడాది జనవరి 16 నుంచి 24 తేదీల మధ్య నిర్వహించాలని నిర్ణయించినట్టు కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్‌ వెల్లడించారు. గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌తో చర్చించిన అనంతరం ఈ ప్రకటన జారీ చేసినట్టు పేర్కొన్నారు. కరోనాతో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సమాచార, ప్రసారాల శాఖ అధికారులు చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. మత విశ్వాసాల్లో రాజకీయ జోక్యమా?:బండి

తిరుమల శ్రీవారి ఆలయ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చాలా బాధాకరమని తెలంగాణ భాజపా అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. మత విశ్వాసాలు, ఆచార వ్యవహారాల పట్ల రాజకీయ జోక్యంతో వివాదాలు చేయడం తగదని హితవు పలికారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆచారాలు, సంప్రదాయాలు, విశ్వాసాలు అనాదిగా వస్తున్నాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. పోలవరానికి నిధులివ్వండి: బుగ్గన

రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించినట్టు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కేంద్రమంత్రిని కలిసిన అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, కేంద్ర సహకారం కోరామన్నారు.  పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్న రాష్ట్రానికి నిధులు విడుదల వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ఇక ‘హ్యూమన్‌ ఛాలెంజ్‌’కి వ్యాక్సిన్‌ సిద్ధం!

వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో భాగంగా బ్రిటన్ మరో ముందడుగు వేయనుంది. ఇప్పటివరకు ఆరోగ్యవంతులపై ప్రయోగాలు జరుపుతుండగా.. తాజాగా ‘హ్యూమన్‌ ఛాలెంజ్’‌ ప్రయోగాలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. తద్వారా వ్యాక్సిన్‌ సమర్థతను కచ్చితంగా పరీక్షించే వీలుంటుందని అంచనా వేస్తోంది. ఇప్పటికే తుదిదశకు చేరుకున్న వ్యాక్సిన్‌ ప్రయోగాలకు, తాజా విధానం మరో ముందడుగు కానుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. కొత్త కేసుల్లో 75%  ఆ 10 రాష్ట్రాల్లోనే..!

దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి ఆగడం లేదు. రోజూ 80వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న కూడా దేశ వ్యాప్తంగా 87,374 కొత్త పాజిటివ్‌ కేసులు వచ్చాయి. గడిచిన 24గంటల్లో నమోదైన మొత్తం కేసుల్లో 75శాతానికి పైగా కేవలం 10 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోనే నమోదు కావడం గమనార్హం. తాజాగా అత్యధికంగా మహారాష్ట్రలో నమోదు కాగా.. ఆ తర్వాత స్థానంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, యూపీ, తమిళనాడు, దిల్లీ, ఒడిశా, దిల్లీ, కేరళ, పశ్చిమబెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌లలో నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. నటుడు విజయకాంత్‌కు కరోనా

తమిళ రాజకీయ నాయకుడు, నటుడు విజయ కాంత్‌కు కరోనా వైరస్‌ పాజటివ్‌ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ‘‘విజయ కాంత్‌కు సెప్టెంబర్‌ 22న కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయనకు చెన్నైలోని ఎం.ఐ.ఓ.టీ. హాస్పిటల్స్‌లో చికిత్స అందిస్తున్నాము. ప్రస్తుతం ఆయన ఆరోగ్య స్థితి నిలకడగా ఉంది. ఆయన త్వరలోనే పూర్తిగా కోలుకుని, డిశ్చార్జి‌ అవుతారు.’’ అని ఆస్పత్రి మేనేజింగ్‌ డైరక్టర్‌ పృధ్వీ మోహన్‌దాస్‌ ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. నాని వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవి: సజ్జల

ప్రధాని నరేంద్రమోదీపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దేశ ప్రధానిపై వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కొడాలి నాని వాస్తవాన్ని గ్రహించి ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారు. అమరావతిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. మీడియా ప్రతినిధులు చెప్తే తప్ప ప్రధానిపై నాని ఏం వ్యాఖ్యలు చేశారో తెలియదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. శ్రీశైలంలో అన్యమత పార్శిల్ కలకలం

శ్రీశైలంలో అన్యమత పార్శిల్‌ కలకలం రేగింది. ఆలయానికి సమీపంలోని దళిత కాలనీకి చెందిన ఓ కుటుంబానికి కర్నూలు నుంచి క్రిస్టియన్ సంస్థ ద్వారా ఓ పార్శిల్ వచ్చింది. ఆర్టీసీ కార్గో ద్వారా స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌కు పార్శిల్ రావడంతో స్థానికులు గుర్తించి దేవస్థానం అధికారులకు సమాచారం అందించారు. దీంతో దేవస్థానం ఇన్‌ఛార్జి చీఫ్‌ సెక్యూరిటీ అధికారి శ్రీహరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.