close

తాజా వార్తలు

Updated : 20/10/2020 17:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 5 PM

1. మరో 3 రోజులు భారీ వర్షాలు

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. మరో 48 గంటల పాటు వాయువ్య దిశగా అల్పపీడనం కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య దిశ అనంతరం ఉత్తర ఈశాన్యంగా పయనిస్తుందని వాతావరణ శాఖ అంచనా. ఈ నేపథ్యంలో మరో 3 రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్రలో విస్తారంగా వర్షం, ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. 6 గంటలకు మీకో విషయం చెప్తా: మోదీ

ప్రధాని మోదీ ఇవాళ సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.‘‘సాయంత్రం 6 గంటలకు దేశ ప్రజలతో ఓ విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. దయచేసి అందరూ వినాలి’’ అంటూ ప్రధాని ట్విటర్‌లో పోస్టు చేశారు. అయితే, ఏ విషయంపై మాట్లాడతారన్నది స్పష్టంగా తెలియడం లేదు. దసరా, దీపావళి తదితర పండుగల నేపథ్యంలో కరోనా వ్యాప్తి నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై మాట్లాడే అవకాశముందని పలువురు భావిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ప్రజలెవరూ అధైర్యపడొద్దు: కేటీఆర్‌

నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు మంగళవారం పర్యటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఖైరతాబాద్‌లోని ఎంఎస్‌ మక్త, రాజు నగర్‌లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు మంత్రి కేటీఆర్‌ రూ.10వేల ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ప్రజలెవరూ అధైర్యపడొద్దని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. హైదరాబాద్‌ కోసం కదిలిన తారాలోకం

భారీ వర్షాలతో అల్లాడుతున్న భాగ్యనగరం కోసం తారాలోకం కదిలివచ్చింది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్న నేపథ్యంలో బాధితుల సహాయార్థం తెలుగు చలనచిత్ర సీమ ప్రముఖులు భారీ విరాళాలు ప్రకటించారు. మొదట నాగార్జున తన వంతుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు విరాళం అందించబోతున్నట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ఆపై చిరంజీవి, మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌, విజయ్‌ దేవరకొండ, త్రివిక్రమ్‌, హరీష్‌ శంకర్‌ తదితరులు విరాళాల్ని ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. కమల్‌నాథ్‌ వ్యాఖ్యలు దురదృష్టకరం: రాహుల్‌

మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినాయకుడు రాహుల్‌గాంధీ తీవ్రంగా స్పందించారు. మహిళా మంత్రిపై కమల్‌నాథ్‌ అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన వయనాడ్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘కమల్‌నాథ్‌ మా పార్టీకి చెందిన వారే కావచ్చు. కానీ, ఆయన ఉపయోగించిన భాష నాకు వ్యక్తిగతంగా నచ్చలేదు. ఎవరైనా సరే అలాంటి భాష ఉపయోగించడాన్ని నేను అంగీకరించను. ఆయన అలా అనడం దురదృష్టకరం’ అని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. తెలంగాణకు రూ.15కోట్ల సాయం: కేజ్రీవాల్

భారీ వర్షాలకు దెబ్బతిన్న తెలంగాణకు సాయం చేసేందుకు దిల్లీ ప్రభుత్వం ముందుకొచ్చింది. వరదలతో అతలాకుతలమవుతోన్న హైదరాబాద్‌లో సహాయ చర్యల నిమిత్తం రూ.15కోట్ల అందిస్తామని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు.ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం రూ.పదికోట్ల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ‘ఆత్మాభిమానమే ఉంటే ఇంకా ఆ పదవిలో కొనసాగరు’

ఆలయాలు తెరిచే అంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, ఆ రాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ మధ్య జరిగిన మాటల యుద్ధం.. ఆపై అమిత్‌ షా వ్యాఖ్యలు.. ఈ పరిణామాలనుద్దేశించి ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఘాటుగా స్పందించారు. ఆత్మాభిమానమే ఉంటే ఆ పదవి నుంచి వైదొలగాలంటూ గవర్నర్‌కు పరోక్ష సవాల్‌ విసిరారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. అవన్నీ తప్పుడు వార్తలు: పీవీ సింధు

ఒలింపిక్స్‌ జాతీయ శిక్షణా శిబిరం నుంచి వైదొలిగి పీవీ సింధు లండన్‌ వెళ్లినట్లు వచ్చిన వార్తలను ఆమె ఖండించింది. మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ప్రకటన చేస్తూ ఆ వార్తలు ప్రచురించిన రిపోర్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే తన తల్లిదండ్రులు, కోచ్‌ పుల్లెల గోపీచంద్‌తో తనకు ఎలాంటి విభేదాలూ తలెత్తలేదని స్పష్టం చేసింది. తాను న్యూట్రిషియన్‌, రికవరీ అవసరాల కోసం లండన్‌ వెళ్లినట్లు పేర్కొంది.

9. మీ ఫోన్‌ని ఇలా వైరస్‌ ఫ్రీ చేయండి... 

కొవిడ్‌-19 ప్రభావంతో ప్రతి ఒక్కరూ శుభ్రతకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు తమ వంతుగా చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి చేస్తున్నారు. కానీ ఎప్పుడూ చేతిలో ఉండే మొబైల్‌ఫోన్‌, ఇతర గ్యాడ్జెట్స్‌పై ఉండే వైరస్‌ను నిర్మూలించడం ఎలా? అనే సందేహం ప్రతి ఒక్కరిలో వస్తోంది. మొబైల్‌ఫోన్, ఇయర్‌ ఫోన్స్‌, వాచ్‌, కళ్లజోడు లాంటి వాటిని శుభ్రం చేసేందుకు ప్రత్యేకంగా యూవీ (అల్ట్రా వయోలెట్) స్టెరిలైజర్‌ బాక్స్‌ను శాంసంగ్ మార్కెట్లోకి విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. కొనకుండానే కారు మీ ఇంటికి!

దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా అందిస్తున్న వాహన సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రాంను ఇప్పుడు హైదరాబాద్‌, పుణె నగరాలకూ విస్తరించింది. ఇప్పటి వరకు ఈ స్కీమ్‌ దిల్లీ, బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ స్కీమ్‌లో కారును నేరుగా కొనుగోలు చేయకుండానే ఉపయోగించుకోవచ్చు. ప్రతి నెలా నిర్వహణ ఛార్జీల కింద కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌ అమలు కోసం జపాన్‌కు చెందిన ఒరిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ఇండియా కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.