close

తాజా వార్తలు

Updated : 22/10/2020 17:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 5 PM

1. అమరావతిని అలా చూస్తే బాధేస్తోంది: చంద్రబాబు

కళకళలాడిన ప్రజారాజధాని అమరావతిని నిస్తేజంగా చూస్తుంటే బాధేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగి నేటికి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా చంద్రబాబు ట్వీట్‌ చేశారు. రాజధాని నిర్మాణ పనులను ఏడాదిన్నరగా ఆపేశారని.. అభివృద్ధి చేస్తారని ఆశించిన ప్రజల ఆకాంక్షలను నీరుగార్చడం ప్రజాద్రోహంతో సమానమని వ్యాఖ్యానించారు. అవాస్తవ ఆరోపణలు, అభూత కల్పనలతో అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలి:పవన్‌

ఏపీలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో రైతులు పంట నష్టపోవడం బాధాకరమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పంట నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఖరీఫ్‌ సీజన్‌లో పెట్టుబడి పెట్టిన ప్రతి పైసా నీటి పాలైందన్నారు. రైతులను ఆదుకోవడంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం లేదని.. పరిహారాన్ని అందించడంలోనూ ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తోందని పవన్‌ ఆరోపించారు. పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని పవన్‌ కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. నాగ్‌ చివరిదశ ప్రయోగం విజయవంతం

రక్షణ రంగంలో భారత్‌ మరో అడుగు ముందుకేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ట్యాంక్‌ విధ్వంసక క్షిపణి నాగ్‌  చివరి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ రేంజ్‌ నుంచి నాగ్‌ మిసైల్‌  క్యారియర్  (ఎన్‌ఏఎమ్‌ఐసీఏ) ద్వారా దీనిని ప్రయోగించారు. నిర్దేశిత లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించినట్లు భారత రక్షణ, పరిశోధన సంస్థ (డీఆర్‌డీవో) వెల్లడించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇక నాగ్‌ క్షిపణులు ఉత్పత్తి దశకు చేరుకున్నట్లయింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

* వ్యాయామ ‘మధు’రిమ! (ప్రత్యేక కథనం)

4. డాక్టర్‌ రెడ్డీస్‌పై ‘సైబర్‌ దాడి’!

ప్రపంచంలోనే దిగ్గజ ఫార్మా కంపెనీల్లో ఒకటైన డాక్టర్‌ రెడ్డీస్‌పై సైబర్‌ నేరగాళ్ల కన్ను పడింది. కంపెనీకి చెందిన ఐటీ విభాగాలపై సైబర్‌ దాడి జరిగింది. ఈ విషయాన్ని సంస్థ స్టాక్‌ ఎక్ఛేంజీ ఫైలింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. తమ సంస్థకు చెందిన ఐటీ విభాగాలపై సైబర్‌ దాడిని గుర్తించినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలో అవసరమైన నివారణ చర్యల్లో భాగంగా అన్ని డేటా సెంటర్లలను ప్రత్యేకంగా ఉంచి, పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ట్విటర్‌ను హెచ్చరించిన కేంద్రం

లద్దాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతంలోని లేహ్‌ పట్టణాన్ని చైనాలో చూపించే విధంగా ఉన్న ట్విటర్‌ లొకేషన్ సెట్టింగ్‌లపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘భారతీయ పౌరుల మనోభావాలను గౌరవించండి’ అంటూ ఆ సంస్థను హెచ్చరించినట్లు గురువారం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారత పటాన్ని తప్పుగా చూపడంపై ప్రభుత్వ నిరసనను వ్యక్తం చేస్తూ ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ట్విటర్ సీఈఓ జాక్‌ డోర్సేకు లేఖ రాసినట్లు తెలిపాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. తాడోపేడో తేల్చేదెవరో..!

ముందడుగు వేయాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో ఉన్న రెండు జట్లు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఏడో స్థానంలో ఉన్న హైదరాబాద్‌, ఆరో స్థానంలో ఉన్న రాజస్థాన్‌ మధ్య మ్యాచ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో గెలిచిన జట్టు ప్లేఆఫ్స్‌ వైపు అడుగెస్తే.. ఓడిన జట్టు ఇంటిముఖం పట్టే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ఈరోజు రాత్రి 7.30గంటలకు దుబాయ్‌ వేదికగా హైదరాబాద్‌, రాజస్థాన్‌ మధ్య మ్యాచ్‌ ప్రారంభం కానుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ముగిసిన నాయిని అంత్యక్రియలు

మాజీ మంత్రి, తెరాస సీనియర్‌ నేత నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతో జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంతిమ సంస్కారాలను పూర్తిచేశారు. నాయిని అంత్యక్రియల సందర్భంగా పోలీసులు గౌరవ సూచికంగా గాల్లోకి కాల్పులు జరిపారు. మంత్రులు కేటీఆర్‌, ఈటల, మహమూద్‌ అలీ, ఎంపీ కె.కేశవరావు, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు అంత్యక్రియలకు హాజరయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. చైనాలో ట్రంప్‌ వ్యాపార లావాదేవీలు

చైనాతో జో బైడెన్‌ కుటుంబానికి వ్యాపార సంబంధాలున్నాయని ఆరోపించడంతో పాటు, అమెరికాను దోచుకోవడానికి కుయుక్తులు పన్నుతోందంటూ చైనాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఇరుకునపెట్టే అంశాన్ని ప్రముఖ వార్తా సంస్థ న్యూయార్క్‌ టైమ్స్‌ బయటపెట్టింది. స్వయంగా ట్రంపే చైనాలో వ్యాపార లావాదేవీలు నిర్వహించిన విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. రాజశేఖర్‌ చికిత్సకు స్పందిస్తున్నారు: వైద్యులు

సినీనటుడు రాజశేఖర్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని సిటీ న్యూరో సెంటర్‌ ఆసుపత్రి వెల్లడించింది. కరోనా కారణంగా రాజశేఖర్‌ తమ ఆసుపత్రిలో చేరినట్టు పేర్కొన్న సిటీ న్యూరోసెంటర్‌.. ఆయన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాజశేఖర్‌ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని, వెంటిలేటర్ సపోర్టు లేకుండానే చికిత్సకు స్పందిస్తున్నారని ఆసుపత్రి మెడికల్‌ డైరెక్టర్ రత్నకిశోర్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. సరికొత్త ఐ20 బుకింగ్స్‌ మొదలు..

దక్షిణకొరియా కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్‌ భారత్‌లో సరికొత్త మోడల్‌ ఐ20ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన బుకింగ్స్‌ కూడా మొదలైంది. దిల్లీ, ముంబయి, చెన్నై ఎంపిక చేసిన డీలర్ల వద్ద బుకింగ్స్ మొదలు పెట్టింది.  ఈ నెల చివర్లో కంపెనీ నుంచి నేరుగా బుక్‌ చేసుకొనే సౌకర్యాన్ని కూడా మొదలుపెట్టవచ్చు. వచ్చేనెలలో మొదటి వారంలో ఈ కారును మార్కెట్లోకి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.