close

తాజా వార్తలు

Published : 23/10/2020 16:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్@ 5 PM

1. కపిల్‌దేవ్‌కు ఛాతినొప్పి

అనారోగ్యంతో టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్ ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం ఆయన ఛాతినొప్పితో అస్వస్థతకు గురికావడంతో దిల్లీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు యాంజియోప్లాస్టీ చికిత్స చేశామని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ‘‘ఛాతినొప్పితో కపిల్‌దేవ్‌ గురువారం అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరారు. ఆయనకు యాంజీయోప్లాస్టీ చికిత్స అందించాం. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉంది. ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. మరో రెండు రోజుల్లో డిశ్ఛార్జ్‌ చేస్తాం’’ అని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ప్రస్తుతం ‘స్థానిక’ యోచన లేదు: గౌతమ్‌రెడ్డి

ప్రస్తుతం స్థానిక ఎన్నికలు నిర్వహించే యోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. దసరా తర్వాత కరోనా తీవ్రత పెరిగే వీలుందని.. నవంబర్‌, డిసెంబర్‌లో మరోసారి కరోనా వ్యాప్తి చెందే అవకాశముందని నిపుణులు చెబుతున్నారని తెలిపారు. తప్పకుండా జరపాల్సినవి కనుకే బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలతో స్థానిక ఎన్నికలను పోల్చకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. రాయలసీమ స్టీల్‌ ప్లాంట్‌ కార్పొరేషన్‌ రద్దు

రాయలసీమ స్టీల్‌ ప్లాంట్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఎస్‌పీసీ)ను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ కంపెనీ ఏర్పాటుతో దీనిని రద్దు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఆర్‌ఎస్‌పీసీని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ కంపెనీ పర్యవేక్షణలోనే కడప స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం చేపట్టనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. హిమాలయాలకు భారీ భూకంప ముప్పు!

హిమాలయ పర్వత శ్రేణులను వరుస భూకంపాలు కుదిపేసే ముప్పుందని తాజా అధ్యయనమొకటి వెల్లడించింది. ఆ వరుసలో ఒకటైన భారీ భూకంపం సమీప భవిష్యత్తులోనే సంభవించే అవకాశాలున్నాయని తెలిపింది. రిక్టరు స్కేలుపై 8 కంటే ఎక్కువ తీవ్రతతో ముంచుకొచ్చే ఆ ప్రకృతి విపత్తు ధాటికి.. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో మరణాలు సంభవిస్తాయని అంచనా వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. అమెరికాలో భారతీయ విద్యార్థుల అరెస్ట్‌

అమెరికాలో 15 మంది విదేశీ విద్యార్థులను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. అందులో 11 మంది భారతీయులు ఉన్నారు. అక్రమంగా దేశంలో నివసిస్తున్న కారణంగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. బోస్టన్‌‌, వాషింగ్టన్‌, హ్యూస్టన్‌, నెవార్క్‌, నాష్విల్లే, పిట్స్‌బర్గ్‌, హ్యారిస్‌బర్గ్‌ ప్రాంతాల నుంచి వీరిని అరెస్టు చేశారు. వీరంతా ‘ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ)’ అనే వెసులుబాటుని ఉపయోగించుకొని అక్రమంగా అమెరికాలో నివసిస్తున్నట్లు ‘ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌’(ఐసీఈ) అధికారులు ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. బాణసంచా కర్మాగారంలో పేలుడు.. ఐదుగురి మృతి

తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. విరుదునగర్‌ జిల్లా ఎరిచ్చనత్తం ప్రాంతంలో బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించిన ఘటనలో ఐదుగురు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

7. దేశంలో వంద మందిపై రష్యా వ్యాక్సిన్‌ ప్రయోగం..

రష్యా అభివృద్థి చేసిన కరోనా వైరస్‌ నిరోధక వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్‌ వీ’ని భారత్‌లో వంద మంది వాలంటీర్లపై ప్రయోగించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థ డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) రష్యన్‌ న్యూస్‌ ఏజెన్సీ స్పుత్నిక్‌కు వెల్లడించినట్లు సమాచారం. పరీక్షల నిర్వహణ కోసం  ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబోరేటరీస్‌కు అనుమతులు మంజూరు చేసినట్టు డీసీజీఐ ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. జైలుకెళ్లేందుకు ఎదురు చూస్తున్నా : కంగన

విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు చేస్తున్నారంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై ముంబయి కోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ బాలీవుడ్‌ నటి, ఆమె సోదరి రంగోలీ చందేలాపై ముంబయిలో కేసు నమోదయ్యింది. మరో కేసులో బాంద్రా మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేటు ఆదేశాల మేరకు.. వీరు వచ్చే వారం విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తనకు ఆదర్శప్రాయులైన మహనీయుల మాదిరిగానే.. తాను కూడా  జైలుకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్నానంటూ కంగన ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. వీసాలపై ఆంక్షలు‌..రూ.7లక్షల కోట్ల నష్టం!

ప్రత్యేక నైపుణ్యాల కింద విదేశీ నిపుణులు అమెరికా వచ్చే వీసాలపై ఆంక్షలు విధిస్తూ ట్రంప్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రభావం వందల మంది భారతీయులపై పడే అవకాశమున్నట్లు ఇప్పటికే నిపుణులు భావిస్తున్నారు. అంతేకాకుండా, ఈ నిర్ణయం వల్ల ఐటీ కంపెనీలకు భారీ నష్టం వాటిల్లే అవకాశముందని అమెరికా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికన్‌ సంస్థలు దాదాపు రూ.7లక్షల కోట్లు (100 బిలియన్‌ డాలర్లు) నష్టపోయే ఆస్కారం ఉందని అంచనా వేస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. మీ వాట్సాప్‌లో ఈ ఫీచర్‌ అప్‌డేట్‌ అయ్యిందా?

పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు వాట్సాప్‌లో నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. సాధారణంగా వాటిలో చాలా వరకు గుడ్‌ మార్నింగ్‌, బర్త్‌డే విషెస్‌, వైరల్‌ వీడియోల వంటివే ఎక్కువగా ఉంటాయి. మనకు అసలు ఎలాంటి సంబంధం లేని, అవసరం లేని సందేశాలు వచ్చి ఫోన్లో చేరి పోతుంటాయి. ఇవి మనకు ఒక్కోసారి విసుగు తెప్పిస్తుంటాయి. వీటి నుంచి తప్పించుకునేందుకు వాట్సాప్‌ సరికొత్త ఫీచర్‌ను నేటి నుంచి అందుబాటులోకి తెచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.