close

తాజా వార్తలు

Published : 27/10/2020 17:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 5 PM

1. అన్‌లాక్‌-5 మార్గదర్శకాలు పొడిగింపు 

గత నెలలో విడుదల చేసిన అన్‌లాక్‌-5 మార్గదర్శకాలను కేంద్రం మరో నెల పాటు పొడిగించింది. అక్టోబర్‌ నెలకు ప్రకటించిన నిబంధనలే నవంబర్‌ నెలాఖరు వరకు వర్తిస్తాయని స్పష్టంచేసింది.  కరోనా వైరస్‌ ఉద్ధృతి ఇంకా కొనసాగుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. కంటైన్‌మెంట్‌ జోన్‌లలో అన్ని రకాల ఆంక్షలూ కొనసాగుతాయని స్పష్టంచేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. తెలంగాణలో రెండు సంస్థలు భారీ పెట్టుబడులు

తెలంగాణలో మరో రెండు సంస్థలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. లారస్‌ ల్యాబ్స్‌, గ్రాన్యూల్స్‌ ఇండియా కంపెనీలు రాష్ట్రంలో పెట్టబోయే పెట్టుబడులకు సంబంధించిన విషయాలను ప్రకటించారు. ప్రగతి భవన్‌లో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసిన కంపెనీల ప్రతినిధులు ఈ మేరకు వెల్లడించారు. ఈ రెండు సంస్థలు జినోమ్‌ వ్యాలీలో రూ. 700 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. చక్రవడ్డీ మాఫీని వెంటనే అమలు చేయండి: ఆర్బీఐ

ఆరు నెలల మారటోరియం కాలానికి రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీ మాఫీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని రుణ విక్రేతల (బ్యాంకులు, ఆర్థిక సంస్థలు)ను ఆర్బీఐ కోరింది. సాధారణ వడ్డీకి, చక్రవడ్డీకి ఉన్న తేడాను రుణ గ్రహీతల ఖాతాల్లో రుణ విక్రేతలు జమ చేయాలని కేంద్రం ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. మారటోరియం ఉపయోగించుకోని వారికి కూడా ఈ స్కీమ్‌ వర్తిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ఏపీలో కొత్త జిల్లాలపై జనవరి 26న ప్రకటన

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వచ్చే ఏడాది జనవరి 26న స్పష్టమైన ప్రకటన ఉంటుందని శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి తెలిపారు. గుంటూరులోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటు చేయాలని భావించినా.. అరకు నియోజకవర్గం విషయంలో ఏర్పడిన సంక్లిష్టతతో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటవుతాయని ఆయన వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ఓటమి భయం కనిపిస్తోంది మీకా?మాకా?:తలసాని

రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోయినా రాష్ట్ర భాజపా నేతలు మాత్రం గొప్పలు చెబుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విమర్శించారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఉప ఎన్నిక ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతోందా? రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనా? దుబ్బాకలో ఇదే భాజపా అభ్యర్థికి రెండుసార్లు డిపాజిట్‌ రాలేదు. పార్లమెంట్ ఎన్నికలోనూ అదే పరిస్థితి. ఓటమి భయం కనిపిస్తోంది మీకా?మాకా?’’ అని భాజపా నేతలపై తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ఏపీ ప్రభుత్వం, తెదేపాకు సుప్రీం నోటీసులు

గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయానికి భూ కేటాయింపులపై వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీఆర్డీఏ చట్టం నిబంధనలు ఉల్లంఘించి నీటి వనరులతో సంబంధం ఉన్న భూమిని కేటాయిస్తూ 2017లో జీవో జారీ చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ నారీమన్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి నోటీసులు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. రాజశేఖర్‌ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులిటెన్‌

కరోనాతో పోరాడుతూ హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్‌ ఫర్‌ సర్వీస్‌లో చికిత్స పొందుతున్న సినీ నటుడు డాక్టర్‌ రాజశేఖర్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు సోమవారం బులిటెన్‌ విడుదల చేశాయి. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్‌ రత్నకిషోర్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ‘మీకు కన్నీళ్లు, కాలి బొబ్బలే మిగిలాయి’

ప్రస్తుతం బిహార్‌లో అధికారంలో ఉన్న పార్టీ గాడితప్పిందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. వారు చెప్పే మాటలు కానీ.. చేసే పనులు కానీ ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు నిరాశకు గురయ్యాయన్నారు. ఈ నేపథ్యంలో బిహార్‌ ప్రజలంతా మహాకూటమి వెంటే ఉన్నారని అభిప్రాయపడ్డారు. రేపు బిహార్‌ అసెంబ్లీకి తొలి విడత పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో ప్రజలనుద్దేశించి మంగళవారం ఆమె వీడియో ద్వారా సందేశం ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కితగ్గను: లోకేశ్‌

వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన తనపై ప్రభుత్వం అకారణంగా కేసులు నమోదు చేస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. పంటలు నీట మునిగి రైతులు తీవ్ర ఆవేదనలో ఉంటే కనీసం వారిని పలకరించని ముఖ్యమంత్రి జగన్‌.. బాధితులకు భరోసా కల్పించేందుకు వెళ్లిన తనపై కేసులు పెడుతున్నారని ట్విటర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ప్రతి ఊరూ వెళ్లి కష్టాల్లో ఉన్నవారి కన్నీళ్లు తుడుస్తానని లోకేశ్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. హైకోర్టు పర్యవేక్షణలోనే హాథ్రస్‌ కేసు విచారణ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్‌ హత్యాచార ఘటనపై సీబీఐ జరుపుతున్న విచారణను ప్రస్తుతానికి అలహాబాద్‌ హైకోర్టే పర్యవేక్షిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసులోని ఇతర కోణాలను సైతం హైకోర్టే చూసుకుంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో బాధితురాలి కుటుంబ సభ్యులు, సాక్షుల భద్రతను కూడా హైకోర్టే పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.