close

తాజా వార్తలు

Published : 28/10/2020 16:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 5 PM

1. గెలిస్తే బెర్తు ఖరారు..!

టీ20 క్రికెట్‌ లీగ్‌లో భాగంగా 48వ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో వచ్చే ఫలితం ప్లేఆఫ్స్‌ జట్టును నిర్ణయించనుంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న ముంబయి, బెంగళూరు ఈ మ్యాచ్‌లో తలపడనున్నాయి. గెలిచిన జట్టు  దాదాపు ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో వేర్వేరుగా ఓడిన ఈ రెండు జట్లూ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి బెర్తు ఖరారు చేసుకోవాలని తహతహలాడుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. మృత్యుబావి కేసులో సంజయ్‌కు ఉరిశిక్ష

తెలంగాణలో సంచలనం సృష్టించిన తొమ్మిది మంది హత్య కేసులో నిందితుడిపై నేరం రుజువు కావడంతో న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. ఈ ఏడాది మే 20న వరంగల్‌ నగర శివారులోని గొర్రెకుంట బావిలో 9మందిని హత్య చేసిన కేసులో విచారణ పూర్తయింది. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సత్యనారాయణ నిందితుడిపై అభియోగాలను నిరూపించడంతో ఉరిశిక్ష ఖరారు చేస్తూ వరంగల్‌ మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి జయకుమార్‌ తీర్పు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. జీడీపీ స్వల్ప క్షీణత లేదా సున్నా: సీతారామన్‌

ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజ సంకేతాలు కన్పిస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అందువల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020-21) జీడీపీ వృద్ధి సున్నాకి సమీపంలో లేదా స్వల్ప క్షీణతను నమోదు చేయొచ్చని పేర్కొన్నారు. తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌- జూన్‌) జీడీపీ వృద్ధిరేటు గణనీయ స్థాయిలో 23.9 శాతం క్షీణించడం ఇందుకు కారణమని తెలిపారు. ప్రస్తుత పండగ సీజనులో గిరాకీ పుంజుకోవడం సానుకూల అంశంగా ఆమె పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. మీ ఓటు బిహార్‌ను ‘బీమార్‌’గా మారనివ్వదు

బిహార్‌లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం దర్భంగా ర్యాలీలో పాల్గొన్నారు. రాజ్ మైదాన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేసిందంటూ ప్రశంసించారు. ఈసారి కూడా దోపిడీకి పాల్పడినవారిని అధికారంలోకి రాకుండా చేయాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారంటూ విపక్షాలపై విమర్శలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. మోదీ మీతో టీ తాగారా?: రాహుల్ గాంధీ

భాజపా, జేడీయూ కూటమి బిహార్‌ను ధ్వంసం చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. రెండో దశ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన చంపారన్‌లో మాట్లాడుతూ..అధికార పార్టీలపై మండిపడ్డారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ చివరి సారి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో చక్కెర కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే మీతో కలిసి టీ తాగుతానని అన్నారు. మీతో టీ తాగారా?’ అంటూ ర్యాలీకి హాజరైన ప్రజలను రాహుల్ ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ఏపీ ఎస్‌ఈసీతో సీఎస్‌ నీలం సాహ్ని భేటీ

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) నీలం సాహ్ని సమావేశయ్యారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం తెలపాలని ఎస్‌ఈసీ కోరిన నేపథ్యంలో సీఎస్‌ ఆయనతో భేటీ అయ్యారు. ఒకవేళ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తే రాష్ట్ర ప్రభుత్వ సన్నద్ధత తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. మంగళవారం రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖల అధికారులతో ఎస్‌ఈసీ సమావేశమై రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులపై చర్చించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఎవరికి ఓటెయ్యాలో ప్రజలే ఆలోచించాలి: హరీశ్‌

తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలకు దుబ్బాక ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. పోలింగ్‌ గడువు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వేడి పెరుగుతోంది. బుధవారం దుబ్బాక మండలంలోని అప్పనపల్లి గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ‘‘దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడిగా రెండు పంట కాలాల్లో కలిపి రూ.10వేలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. ఇవన్నీ గమనిస్తూ.. ప్రజలంతా ఆలోచించి తమ ఓటును వేయాలి’’ అని హరీశ్ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. అన్నం పెట్టే చేతులకు బేడీలు వేస్తారా?

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం రైతులకు పోలీసులు సంకెళ్లు వేసి స్టేషన్‌కు తీసుకెళ్లడంపై రాజధాని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తుళ్లూరు మండలం వెంకటపాలెం, అనంతవరం గ్రామాల్లోని దీక్షా శిబిరాల వద్ద మహిళలు వినూత్న నిరసన తెలియజేశారు. వెంకటపాలెంలో మహిళలు కళ్లకు గంతలు కట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. అన్నం పెట్టే రైతులకు బేడీలు వేస్తారా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ఈ ఏడాది చివరికి వ్యాక్సిన్‌ సాధ్యమే..

ఈ ఏడాది చివరి కల్లా కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ సాధ్యమేనని అమెరికన్‌ ఫార్మా దిగ్గజం ఫైజర్‌ తాజా ప్రకటనలో వెల్లడించింది. క్లినికల్‌ పరీక్షలు అనుకున్న విధంగా జరిగి.. అధికారిక అనుమతులు సకాలంలో లభిస్తే 2020 ముగిసేలోపే కొవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీ సాధ్యమేనని సంస్థ సీఈఓ ఆల్బర్ట్‌ బౌర్లా తెలిపారు. తాము వ్యాక్సిన్‌ తయారీలో చివరి అంకంలో ఉన్నామని.. ప్రజారోగ్యం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు అతి ముఖ్యమైన ఈ విషయంలో ఓర్పు వహించటం ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. భారత్‌×ఆసీస్‌: షెడ్యూలు వచ్చేసిందోచ్‌!

ఆస్ట్రేలియాలో భారత పర్యటనకు సంబంధించిన షెడ్యూలు ఖరారైంది. 3 టీ20లు, 3 వన్డేలు, 4 టెస్టుల తేదీలను క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది. డిసెంబర్‌ 17న ఆరంభమయ్యే గులాబి టెస్టుకు ముందు సిడ్నీలో అదనంగా మరో డే/నైట్‌ వార్మప్‌ మ్యాచ్‌ నిర్వహించేందుకు సీఏ అంగీకరించింది. నవంబర్‌ 10న యూఏఈ నుంచి టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఆస్ట్రేలియాకు బయల్దేరుతారు. నవంబర్‌ 12 నుంచి అక్కడి నిబంధనల ప్రకారం 12 రోజులు క్వారంటైన్‌లో ఉంటూ సాధన చేస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.