close

తాజా వార్తలు

Published : 30/11/2020 16:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 5 PM

1. రాజకీయాలపై వీలైనంత త్వరగా నిర్ణయం: రజనీ

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశంపై సందిగ్ధత ఇంకా తొలగలేదు. ‘రజనీ మక్కళ్‌ మండ్రం’ జిల్లా కార్యదర్శులతో రజనీకాంత్‌ సోమవారం భేటీ అయ్యారు. దీంతో రాజకీయ ప్రవేశంపై కీలక ప్రకటన ఉండొచ్చని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే వారికి మళ్లీ నిరాశే ఎదురైంది. కాగా.. రాజకీయ ప్రవేశంపై వీలైనంత త్వరగా తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని సమావేశం అనంతరం రజనీ ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. తేలికైన భాషలో టీకా సమాచారం ఇవ్వాలి

కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధికి కృషి చేస్తున్న మరో మూడు సంస్థల ప్రతినిధులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం సమావేశమయ్యారు. జెనోవా బయోఫార్మా, బయోలాజికల్ ఈ, డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థల ప్రతినిధులతో మోదీ వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. కరోనా టీకా పురోగతిపై ఆరా తీశారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. వ్యాక్సిన్‌ ప్రయోగాలు, సామర్థ్యం తదితర సమాచారాన్ని ప్రజలకు అర్థమయ్యేలా సాధారణ భాషల్లో చెప్పేందుకు ప్రయత్నించాలని ప్రధాని కోరినట్లు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

*కరోనాపై కేంద్రం మరోసారి అఖిలపక్ష భేటీ!

3. పోడియం ముందు చంద్రబాబు బైఠాయింపు

ఏపీ శాసనసభ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి.అధికార పక్షం తీరును నిరసిస్తూ తెదేపా అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పీకర్‌ పోడియం ఎదుట నేలపైనే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. తుపాను పరిహారంపై జరిగిన చర్చలో తెదేపా సభ్యుడు నిమ్మల రామానాయుడు చేసిన ఆరోపణలపై సీఎం జగన్‌ సమాధానమిచ్చారు. దానిపై మాట్లాడేందుకు చంద్రబాబు యత్నించగా అధికార పక్ష సభ్యులు అడ్డుతగిలారు. దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరుపై మండిపడుతూ తెదేపా సభ్యులతో కలిసి స్పీకర్‌ పోడియం ముందు భైఠాయించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ఆగస్టు కల్లా 30 కోట్ల మందికి టీకా: హర్షవర్దన్‌

వచ్చే ఏడాది ఆగస్టు కల్లా దేశంలో 30 కోట్ల మందికి కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ అందజేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘వచ్చే ఏడాది తొలి నాలుగు నెలల్లోపు దేశ ప్రజలకు కరోనా టీకా అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆగస్టులోపు 30 కోట్ల మందికి వ్యాక్సిన అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. మాస్క్‌ ధరించడం, సామాజిక దూరం తదితర నిబంధనలు విధిగా పాటించాలి’ అని హర్షవర్ధన్ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ఫ్రస్ట్రేషన్‌లోకి భాజపా: హరీశ్‌రావు

నాలుగు ఓట్లు వస్తాయన్న ఆశతో సోషల్‌ మీడియాలో భాజపా తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి  హరీశ్‌రావు ఆరోపించారు. పటాన్‌చెరులో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌ మాట్లాడారు. దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌ రోజు కాంగ్రెస్‌ అభ్యర్థి తెరాసలో చేరుతున్నట్లు ఓ ఛానల్‌ లోగోతో తప్పుడు వీడియో స్పష్టించారని.. ఇప్పుడు తనతో పాటు తెరాస కీలక నేతలు పార్టీ మారుతున్నట్లు ప్రముఖ ఛానళ్ల నకిలీ లోగోలతో వీడియో తయారు చేయించారని హరీశ్‌ ఆరోపించారు. భాజపా ఫ్రస్టేషన్‌లోకి వెళ్లిందని.. దాడులకు పాల్పడే అవకాశముందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ఓడిపోయే అవకాశమే లేదు!: ట్రంప్

డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ చేతిలో పరాజయం పాలైనప్పటికీ, ఎన్నికల్లో మోసం జరిగిందంటూ ఇంకా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు, కోర్టు తీర్పులు కూడా ఆయనకు ప్రతికూలంగానే వస్తున్నాయి. అయినా, శ్వేతసౌధాన్ని విడిచిపెట్టడానికి ఆయన సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఈ క్రమంలో ట్రంప్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘ఎన్నికల్లో ఓడిపోయే అవకాశమే లేదు!’ అంటూ ట్వీట్ చేయడంతో పాటు ఓ వీడియోను షేర్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

*బైడెన్‌కు గాయం.. స్పందించిన ట్రంప్‌

7. యాపిల్‌కు భారీ ఫైన్‌..!

టెక్‌ దిగ్గజం యాపిల్‌ తప్పుదోవ పట్టించే వ్యాపార విధానాలు అనుసరించినందుకు ఇటలీలోని యాంటీట్రస్ట్‌ అథారిటీ కోటీ 20 లక్షల డాలర్లు జరిమానా విధించింది. ఐఫోన్లకు సంబంధించి ఈ విధానాలు అనుసరించినట్లు పేర్కొంది. ఈ విషయాన్ని అక్కడి నియంత్రణ సంస్థలే ఒక ప్రకటనలో వెల్లడించాయి. యాపిల్‌ సంస్థ వివిధ రకాల ఐఫోన్‌ మోడళ్లపై ఎటువంటి వివరణలు లేకుండా వాటర్‌ రెసిస్టెంట్లుగా ప్రచారం చేసిందని నియంత్రణ సంస్థలు పేర్కొన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ఆ 8 రాష్ట్రాల నుంచే అత్యధిక కరోనా మరణాలు!

దేశంలో నమోదవుతున్న కొవిడ్‌ మరణాల్లో ఎక్కువ శాతం ఎనిమిది రాష్ట్రాల నుంచే ఉంటున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఆదివారం కొత్తగా 443 మంది మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,37,173కి చేరింది. వీటిలో 71 శాతం మరణాలు దిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, హరియాణా, పంజాబ్‌, కేరళ, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌ నుంచే ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. దిగజారిన చైనా క్షమాపణ చెప్పాలి..

చైనా తమ దేశానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్‌ మోరిసన్‌ డిమాండ్‌ చేశారు. ఆస్ట్రేలియా సైనికులు.. అఫ్గానిస్థాన్‌లో దురాగతాలు సాగిస్తున్నారంటూ చైనా సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న దుష్రచారాన్ని వెంటనే ఆపాలని ఆయన కోరారు. అంతేకాకుండా చైనా ట్విటర్‌లో షేర్‌ చేసిన తమ సైనికుల నకిలీ చిత్రాలను వెంటనే తొలగించాల్సిందిగా హెచ్చరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. శ్రీలంక జైలులో అల్లర్లు.. 8 మంది ఖైదీల మృతి

శ్రీలంకలోని ఓ జైలులో అల్లర్లు చెలరేగిన ఘటనలో 8 మంది ఖైదీలు మరణించారు. జైలు సిబ్బంది సహా 37 మంది గాయపడ్డారు. శ్రీలంక రాజధాని కొలంబో సరిహద్దుల్లో ఉన్న మహారా జైలులోని కొందరు ఖైదీలు ఆదివారం అల్లర్లు సృష్టించారు. జైలు అధికారులను బంధించి తలుపులను తెరుచుకొని పారిపోయేందుకు ప్రయత్నించారు. వంటశాలకు, రికార్డ్‌ రూమ్‌కు ఖైదీలు నిప్పంటించారు. తలుపులను బలవంతంగా తెరుస్తున్న క్రమంలో జైలు సిబ్బంది వారిని అడ్డుకున్నట్లు పోలీసు అధికారి అజిత్‌ రొహాన తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని