
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 5 PM
1. తమిళ ప్రజల కోసం ప్రాణమైనా ఇస్తా: రజనీ
తమిళనాడు కోసం జీవితాన్ని త్యాగం చేస్తానని, రాష్ట్ర ప్రజల కోసం తన ప్రాణాలు ఇవ్వడానికైనా సంతోషపడతానని సూపర్‌స్టార్ రజనీకాంత్ అన్నారు. రాజకీయాల్లోకి రాబోతున్నానంటూ ప్రకటించిన అనంతరం తలైవా తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. తన రాజకీయ ప్రవేశాన్ని కొందరు విమర్శిస్తూనే ఉన్నారని రజనీ ఈ సందర్భంగా తెలిపారు. వైద్యులు వద్దంటున్నా.. ప్రజలు, అభిమానుల కోసం రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
*ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ జరగదు
2. రైతు సంఘాలు, కేంద్రం భేటీ
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు చేపట్టిన నిరసన ఎనిమిదో రోజుకు చేరిన క్రమంలో.. గురువారం వారితో కేంద్రం మరోసారి భేటీ అయింది. ఈ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నంలో భాగంగా ఇరువర్గాల మధ్య నాలుగో విడత చర్చలు జరుగుతున్నాయి. దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరుగుతోన్న ఈ భేటీలో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూశ్ గోయల్, సోమ్ ప్రకాశ్(పంజాబ్ నుంచి ఎన్నికైన ఎంపీ), 35 రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. గ్రేటర్ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. జీహెచ్ఎంసీలోని 30 సర్కిళ్ల పరిధిలోని 150 డివిజన్లలో జరిగిన ఎన్నికలకు రేపు 30 కేంద్రాల్లో లెక్కింపు జరగనుంది. రేపు ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అన్ని పార్టీలు కలిసి మొత్తంగా 1,122 మంది అభ్యర్థుల భవితవ్యం రేపు తేలనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణపై స్టే ఇవ్వాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని తోసిపుచ్చిన హైకోర్టు.. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేయాలని ఏపీ పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ‘పద్మ’ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చిన బాదల్
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తోన్న రైతులకు మద్దతు ప్రకటిస్తూ పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్(92) పద్మ విభూషణ్ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చారు. వారికి మద్దతుగా పురస్కారాన్ని వెనక్కి ఇచ్చిన మొదటి వ్యక్తి ఈయనే. దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ను కేంద్రం ఆయనకు 2015లో బహూకరించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. మోదీజీ..టీకాపై మీ వైఖరి ఏంటి?:రాహుల్
ప్రతి ఒక్కరికి టీకా వేయడం గురించి కేంద్రం ఎప్పుడూ మాట్లాడలేదంటూ ఆరోగ్యశాఖ కార్యదర్శి చేసిన ప్రకటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. టీకాకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ, ప్రభుత్వం, భాజపా నేతలను నుంచి విరుద్ధమైన ప్రకటనలు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. అలా చేస్తే రాక్షసుడికి ఆహారం పంపినట్లే!
పాకిస్థాన్ తీరును ప్రపంచ దేశాల ఎదుట భారత్ మరోసారి బయటపెట్టింది. పాక్ ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడే దక్షిణాసియా దేశాల్లో శాంతి స్థాపన జరుగుతుందని పునరుద్ఘాటించింది. ఆ దేశం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీలో ‘ కల్చర్ ఆఫ్ పీస్’ అనే అంశంపై జరిగిన చర్చలో ఐరాసలో భారత తరఫున శాశ్వత ప్రతినిధి ఆశిష్ శర్మ ప్రసంగించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. కరోనా మరణాల్లో ‘అగ్ర’దేశం
కొవిడ్ మహమ్మారి ధాటికి అమెరికా వణికిపోతోంది. వైద్యరంగంలో మెరుగైన సదుపాయాలకు పేరుగాంచిన అగ్రదేశం.. కరోనా సృష్టించే విలయాన్ని అడ్డుకోలేకపోతోంది. ఏ దేశంలో లేని విధంగా మరణాల సంఖ్య నానాటికీ రికార్డు మార్కులను దాటేస్తోంది. అమెరికా కాలమానం ప్రకారం.. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు 2,731 కొవిడ్ మరణాలు సంభవించాయని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. మరో వెయ్యి పరుగుల కోసం ఎదురుచూడాలి
టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలకడైన దిగ్గజ బ్యాట్స్‌మన్ అని మాజీ సారథి సునీల్ గావస్కర్ ప్రశంసించాడు. అతడిలా మరెవరూ ఆడలేరని చెప్పాడు. బుధవారం జరిగిన మూడో వన్డేలో కోహ్లీ (63) పరుగులు చేసి హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీ చేతికి చిక్కి ఔటైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడు వన్డే ఫార్మాట్లో అరుదైన ఘనత సాధించాడు. 251 మ్యాచ్‌ల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగుల మైలురాయిని అందుకొని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. టీకా సమాచారంపై ఉ.కొరియా హ్యాకర్ల దాడి..!
కరోనా వైరస్ భయంతో వణికిపోతోన్న ఉత్తర కొరియా, వ్యాక్సిన్ కోసం ఆరాటపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ దేశాధినేత కిమ్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా అక్కడి హ్యాకర్లు కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తోన్న సంస్థలపై దాడులకు ప్రయత్నించినట్లు వెల్లడైంది. ముఖ్యంగా అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, దక్షిణ కొరియాకు చెందిన ఫార్మా సంస్థల నుంచి కీలకమైన సమాచారాన్ని తస్కరించే ఉద్దేశంతోనే ఈ దాడులకు పాల్పడ్డట్లు వెల్లడైంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- మరో 6 పరుగులు చేసుంటే..
- నేను తెలుగింటి అల్లుడినే: సోనూసూద్
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- గబ్బా కాదు..శార్దూల్-సుందర్‌ల దాబా: సెహ్వాగ్
- ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్‌బాబు టీమ్
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- బైడెన్ తొలి సంతకం వీటిపైనే..!
- డ్రాగన్ ‘ప్లాన్’ ప్రకారమే..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
