close

తాజా వార్తలు

Published : 05/12/2020 16:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 5 PM

1. రైతులతో కేంద్రం చర్చలు ప్రారంభం

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న రైతులతో కేంద్రం ప్రభుత్వం మరోసారి భేటీ అయ్యింది. దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ నేతృత్వంలో రైతు సంఘాల ప్రతినిధులతో ఈ చర్చలు జరుగుతున్నాయి. అంతకుముందు రైతుల ఆందోళనపై ప్రధాని మోదీ కేంద్ర మంత్రులతో కీలక భేటీ నిర్వహించిన విషయం తెలిసిందే. రైతుల డిమాండ్ల పరిష్కారంపై కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌, తోమర్‌, పీయూష్‌ గోయల్‌తో మోదీ సుదీర్ఘంగా చర్చించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

*వ్యవసాయ చట్టాల్లో సవరణలకు కేంద్రం ఓకేనా?

2. తమిళనాట అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కొత్తగా ఏర్పాటు చేయనున్న రాజకీయ పార్టీ తమిళనాట అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఎన్నికల్లో 234 సీట్లలో పోటీ చేయనున్నట్లు రజనీకాంత్‌ సలహాదారు మణియన్‌ తెలిపారు. రజనీకాంత్‌ కొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టనున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న విద్వేష రాజకీయాలు కాకుండా ఆధ్యాత్మిక రాజకీయాలు చేయనున్నట్లు మణియన్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ఎన్నికలు జరపడం కమిషన్‌ విధి: నిమ్మగడ్డ

ప్రభుత్వ అనుమతితో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలంటూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అన్నారు. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అసెంబ్లీలో ప్రభుత్వం చేసిన తీర్మానంపై గవర్నర్‌కు ఎస్‌ఈసీ లేఖ రాశారు. రాజ్యాంగంలోని 243కె అధికరణ కింద ఎన్నికల సంఘానికి స్వయం ప్రతిపత్తి ఉందని.. ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడం కమిషన్‌ విధి అని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమ: కేటీఆర్‌

ఐటీ పరిశ్రమను మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఐటీ, పరిశ్రమల శాఖలపై మంత్రి కేటీఆర్ ఇవాళ‌ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలు, రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరిస్తామని చెప్పారు. త్వరలోనే కొంపల్లి ఐటీ పార్క్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

 *7న కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

5. ఆ చట్టాలపై ఆపోహలు తొలగించాలి: చంద్రబాబు

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై జాతీయ స్థాయిలో సమగ్ర చర్చ జరగాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఈ విషయంలో రైతులు, రైతు సంఘాల ప్రతినిధుల ఏకాభిప్రాయం సాధించాలన్నారు. రైతు ప్రయోజనాలే మిన్నగా పాలకుల నిర్ణయాలు ఉండాలని, ఆ చట్టాలపై రైతుల్లో, రైతు సంఘాల్లో ఉన్న అపోహలను తొలగించాలని చంద్రబాబు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. కరోనా:కెనడా నేతృత్వం..భారత్‌ గైర్హాజరు

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్‌లో రైతులు చేస్తోన్న నిరసనకు కెనడా మద్దతు ప్రకటించడంపై భారత ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఈ క్రమంలో డిసెంబర్‌ 7న కెనడా నేతృత్వంలో జరిగే కొవిడ్-19 సమావేశానికి విదేశాంగ మంత్రి జైశంకర్ గైర్హాజరు కానున్నారు. భారత్‌లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారనే వార్త తెలిసిందని, శాంతియుత నిరసన హక్కుల పరిరక్షణకు కెనడా అండగా ఉంటుందని ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో కొద్ది రోజుల క్రితం వీడియో సందేశంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఆమె ఆకస్మిక నిష్క్రమణతో గూగుల్‌లో దుమారం!

కృత్రిత మేధ(ఏఐ) రంగంలో ప్రఖ్యాతి గాంచిన గూగుల్‌ ఉద్యోగి టిమ్‌నిట్‌ గెబ్రూ నిష్క్రమణ ఆ సంస్థలో ఇప్పుడు పెద్ద దుమారమే రేకెత్తిస్తోంది. ఓ పరిశోధన పత్రం విషయంలో సంస్థ మేనేజ్‌మెంట్‌కు.. ఆమెకు మధ్య తీవ్ర విబేధాలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఏఐలో రూపుదిద్దుకొంటున్న ఓ కొత్త విభాగం సామాజిక సమస్యలకు దారితీసే అవకాశం ఉందని గెబ్రూ లేవనెత్తడమే వివాదానికి కారణమైనట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. 24 గంటల్లోనే.. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట

కొవిడ్‌-19 వ్యాప్తిని అడ్డుకునే సామర్థ్యం ఒక యాంటీవైరల్‌ ఔషధానికి ఉన్నట్లు అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మహమ్మారి ఉద్ధృతికి కళ్లెం వేయడానికి దీన్ని ఒక మార్గంగా ఉపయోగించుకోవచ్చని తేల్చారు. జార్జియా స్టేట్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ ఆవిష్కారం చేశారు. మోల్నుపిరావిర్‌ అనే ఈ యాంటీవైరల్‌ ఔషధాన్ని తొలుత ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ల కోసం అభివృద్ధి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. వచ్చే విద్యాసంవత్సరం వరకూ పాఠశాలల బంద్‌

కరోనా ఉద్ధృతి తగ్గకపోవడంతో పలు రాష్ట్రాల్లో విద్యాసంస్థల బంద్‌లు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలోనే మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న విద్యాసంవత్సరం నాటి వరకూ పాఠశాలలను తెరవకూడదని నిర్ణయం తీసుకుంది. కేవలం 10, 12వ తరగతుల విద్యార్థులకు మాత్రమే తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10.గబ్బర్‌ చెలరేగాల్సిన సమయం ఇది..

ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ తొలి వన్డేలో మినహా మిగతా మూడు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. ఇంకో రెండు టీ20లు ఆడితే ఈ ఏడాది అతడి ఆట పూర్తి అవుతుంది. ఎందుకంటే అతడు కంగారూలతో టెస్టు సిరీస్‌కు ఎంపికవ్వలేదు. ఈ క్రమంలోనే అతడు చివరి రెండు టీ20ల్లో దంచి కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని