close

తాజా వార్తలు

Published : 23/05/2020 03:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్యాకేజీ సత్వరం అమలు చేయండి

పీఎస్‌బీ అధిపతులతో ఆర్థిక మంత్రి

దిల్లీ: ‘ఆత్మనిర్భర్‌భారత్‌’ ఉద్దీపన ప్యాకేజీని సత్వరం అమలు చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ) అధిపతులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కోరారు. శుక్రవారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన సమీక్షా సమావేశంలో ఉద్దీపన అమలుపై బ్యాంకుల సంసిద్ధతను మంత్రి ఆరా తీశారు. ‘సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థ(ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)లు, ఇతర వినియోగదార్ల అవసరాలను త్వరితగతిన తీర్చాల్సిన అవసరం ఉందని.. అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని ఆర్థిక మంత్రి కోరిన’ట్లు ఆర్థిక సేవల విభాగం ట్వీట్‌ చేసింది. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు అదనపు రుణాలను వేగంగా జారీ చేయాలని ఆర్థిక మంత్రి నొక్కిచెప్పినట్లు సమావేశానంతరం ఇండియన్‌ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌(ఎండీ) పద్మజ చుండూరు పేర్కొన్నారు. ప్యాకేజీ కింద వివిధ పథకాలకు కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే అనుమతులు ఇవ్వగా.. మార్గదర్శకాలు బ్యాంకులకు జారీ అవుతూ ఉన్నాయి. రూ.3 లక్షల కోట్ల విలువైన అత్యవసర రుణ హామీ పథకం(ఈసీఎల్‌జీస్‌) ఇందులో అత్యంత ముఖ్యమైనది.


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని