close

తాజా వార్తలు

Published : 05/08/2020 09:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘ఆహా’లో ఆ సైకలాజికల్‌ థ్రిల్లర్‌

హైదరాబాద్‌: మలయాళ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ కథానాయకుడిగా తెరకెక్కిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘ట్రాన్స్‌’. ఈ ఏడాది ఫిబ్రవరిలో మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్‌లలో సినిమాల విడుదల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విడుదలకు నోచుకోని పలు చిత్రాలతో పాటు, ఇతర భాషల్లోని చిత్రాలను తెలుగులోకి అనువదిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రాన్ని తెలుగు ఓటీటీ ‘ఆహా’లో విడుదల చేస్తున్నారు. ఆగస్టు 7న ‘ట్రాన్స్‌’ స్ట్రీమింగ్‌ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు, నటుడు గౌతమ్‌ మేనన్‌ ‘ట్రాన్స్‌’ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. నజ్రియా నజీమ్‌, గౌతమ్‌ మేనన్‌, చంబన్‌ వినోద్‌ జోసీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్వర్‌ రషీద్‌ దర్శకత్వం వహించారు.Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

Panch Pataka

దేవతార్చన