close

తాజా వార్తలు

Updated : 26/09/2020 17:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రెండేళ్ల బుడతడు.. రైలు కింద పడి బతికాడు

ఇంటర్నెట్ డెస్క్‌: తను నడుపుతున్న రైలు ముందు ఓ రెండేళ్ల బాలుడు పడటాన్ని గమనించాడు ఆ రైలు డ్రైవరు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్‌ వేసి ఆపడానికి ప్రయత్నించినా, కొంత దూరం ప్రయాణించిన తర్వాత కానీ రైలు ఆగలేదు. ఏ ఘోరం చూడాల్సి వస్తుందోనని ఆందోళనతో.. తనతో ఉన్న మరో డ్రైవర్‌తో సహా దిగి చూసిన అతనికి తన కళ్లను తానే నమ్మలేని దృశ్యం కనిపించింది. అక్కడ ఆ బాలుడు ఒంటి మీద కనీసం ఓ చిన్న దెబ్బ కూడా లేకుండా కనిపించాడు.

కాగా ఆ చిన్నారిని అతని అన్నయ్యే రైలు కిందకి తోసేశాడని తెలిసింది. ఆ బుడతడి ఆయుష్షు గట్టిది కాబట్టి ఇది సాధ్యమైంది కానీ.. లేకుంటే అతను బతకటం అసంభవమని ఈ సంఘటన చూసిన వారు అంటున్నారు. తనతో ఉన్న మరో డ్రైవర్‌, ఇతరుల సహాయంతో ఇంజిన్‌ కింద ఇరుక్కున్న ఆ బాలుడిని బయటకు తెచ్చి వారి తల్లికి అప్పగించారు. ఈ సంఘటన దిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌ ప్రాంతానికి చెందిన బల్లబ్‌ఘడ్‌ రైల్వే స్టేషన్‌ వద్ద  చోటుచేసుకుంది. కాగా, ఆ గూడ్స్‌ రైలు డ్రైవర్‌ జరిగిన సంఘటన అంతా లిఖిత పూర్వకంగా పై అధికారులకు వివరించాడు. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఇద్దరు డ్రైవర్లకు రైల్వే ఉన్నతాధికారులు బహుమతి ప్రకటించారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.